మరో బంపర్ హిట్ కోసం మారుతి మెగా ప్లాన్.. ఈ సారి కొడితే దెబ్బ మామూలుగా ఉండదు

మారుతి సుజుకి నుంచి మార్కెట్లో దూసుకుపోతున్న ప్రముఖ SUV లలో బ్రెజా (Maruti Suzuki Brezza) ఒకటి. దీని ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నప్పటికీ, ప్రతినెలా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ వినియోగదారుల ఫేవరెట్ కార్‌గా నిలిచింది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026లో ఈ బ్రెజా సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే రహస్యంగా టెస్టింగ్‌లు ప్రారంభించింది. కొత్త బ్రెజా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

తాజాగా CNG పవర్ మోడల్ అని భావిస్తున్న కొత్త మారుతి సుజుకి బ్రెజా రోడ్ టెస్టింగ్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పై వీడియోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. బయట నుంచి చూస్తే ఈ కారు డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే, ఇటీవల సెప్టెంబర్‌లో విడుదలైన మారుతి విక్టోరిస్ (Victoris) SUV మాదిరిగానే, ఈ కొత్త బ్రెజా కూడా అండర్‌బాడీ CNG ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీనివల్ల బూట్ స్పేస్ పెరిగే అవకాశం ఉంది.

Maruti Brezza CNG Spied Testing New Model Expected with 25 51 Kmpl Mileage

టెస్టింగ్‌లో కనిపించిన ఈ SUVని పూర్తిగా కప్పి ఉంచినా, కొన్ని మార్పులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. షార్క్-ఫిన్ యాంటెన్నా, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యంగా, ఈ కొత్త బ్రెజాలో అత్యంత అడ్వాన్సుడ్ లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సేఫ్టీ ఫీచర్ ఉండే అవకాశం ఉంది. ఇది డ్రైవింగ్ సేఫ్టీని మరింత పెంచుతుంది.

పవర్‌ట్రైన్ పరంగా ప్రస్తుత CNG మోడల్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.ఇందులో శక్తివంతమైన 1.5-లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88 BHP హార్స్ పవర్, 121 Nm (న్యూటన్ మీటర్) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది వస్తుంది. CNG మోడల్ కిలోకు 25.51 కిమీ వరకు మైలేజీని ఇవ్వగలదని భావిస్తున్నారు.

Maruti Brezza CNG Spied Testing New Model Expected with 25 51 Kmpl Mileage

సాధారణ పెట్రోల్ బ్రెజా మోడల్ కూడా కొన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‎తో వస్తుంది. ఇది లీటరుకు 17.80 నుంచి 19.80కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 328 లీటర్ల బూట్ స్పేస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, 360-డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి విక్టోరిస్ కూడా మార్కెట్లో బాగా విజయవంతమైంది. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్య ఉంది. అక్టోబర్ నెలలో ఈ ఎస్‌యూవీ ఏకంగా 13,496 యూనిట్లు అమ్ముడైంది. ఇది 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5-లీటర్ సీఎన్‌జీ ఇంజన్లలో లభిస్తుంది. ఇది 21 నుంచి 29 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 20, 2025, 12:00 [IST]
English summary
Maruti brezza cng spied testing new model expected with 25 51 kmpl mileage
Read more on: #maruti suzuki #facelift #cng
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+