డిక్కీలో ఖాళీ లేదని బాధపడుతున్నారా? మారుతి బ్రెజ్జా కొత్త ఐడియా అదిరిపోయింది బాసూ!
మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV)లలో ఒకటి. 2022లో విడుదలైన సెకండ్ జనరేషన్ బ్రెజ్జా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్ల నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి సిద్ధమైంది.
ఇందులో భాగంగా మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ 2026 పేరుతో సరికొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. ఇది 2026 ప్రారంభ నెలల్లో (ఫిబ్రవరి ప్రాంతంలో) మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ ప్రధానంగా సేఫ్టీ, అత్యాధునిక ఫీచర్లు, వాడుకలో సౌలభ్యం (Practicality) పై దృష్టి పెడుతుంది. ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేనప్పటికీ, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా అనేక కొత్త హంగులు ఉండబోతున్నాయి.

కొత్త బ్రెజ్జాలో రాబోతున్న అతిపెద్ద మార్పు లెవల్-2 ADAS (Advanced Driver Assistance System). ఈ ఫీచర్ ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.
ముఖ్యంగా సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొనే మారుతి, ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా నెక్సాన్, సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. సాధారణంగా CNG కార్లు కొనేవారికి ఉన్న అతిపెద్ద బాధ డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి చోటు లేకపోవడం. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ డిక్కీలోనే ఉంటుంది.

అయితే మారుతి ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపబోతోంది. కొత్త బ్రెజ్జాలో గ్యాస్ ట్యాంక్ కారు బాడీ కింద భాగంలో అమర్చబడి ఉంటుంది. దీనివల్ల కారు లోపల బూట్ స్పేస్ మొత్తం పెట్రోల్ కారు మాదిరిగానే ఖాళీగా లభిస్తుంది. సుదూర ప్రయాణాలు చేసే కుటుంబాలకు ఇది ఒక గేమ్ చేంజర్ ఫీచర్ అని చెప్పవచ్చు.
కారు లోపలి భాగం ఇప్పుడు మరింత లగ్జరీగా కనిపించనుంది. ప్రస్తుతం ఉన్న సెమీ డిజిటల్ క్లస్టర్ స్థానంలో 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ రాబోతోంది. అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సైజు కూడా 9 అంగుళాల నుంచి 10.1 లేదా 10.25 అంగుళాలకు పెరగనుంది.

ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మెరుగైన ఆడియో సిస్టమ్ ఉండబోతున్నాయి. వేసవిలో ఉపశమనం కోసం మొదటిసారిగా బ్రెజ్జాలో వెంటిలేటెడ్ సీట్లు కూడా ఆశించవచ్చు. కారు బాక్సీ డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, కొత్త అలాయ్ వీల్స్, అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు కారుకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. హెడ్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ (LED DRL) సిగ్నేచర్ అప్‌డేట్ చేయబడతాయి.
వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు కారును మరింత స్టైలిష్‌గా మారుస్తాయి. ఇంజిన్ పరంగా నమ్మకమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది, ఇది మంచి మైలేజీ, పనితీరును అందిస్తుంది. ఈ కొత్త మార్పులతో 2026 బ్రెజ్జా మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రత్యర్థి కంపెనీలు ఇక ఎన్ని కొత్త వ్యూహాలు పన్నాలో చూడాలి.


Click it and Unblock the Notifications








