తక్కువ ధరలో బెస్ట్ కార్లు ఇవే.. ఏప్రిల్ నెల అమ్మకాల్లో దుమ్ములేపిన టాప్ 10కార్ల లిస్ట్ ఇదే !
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ ప్రతి నెలా వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతుంటాయి. ఏప్రిల్ నెలలో భారీ సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి. తాజాగా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. ఎప్పటిలాగే మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ హ్యుందాయ్ మోడల్ ఒకటి నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే టాటా, మహీంద్రా కార్లు కూడా మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి.
మొదటి స్థానంలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) SUV ఉంది. ఈ మోడల్ ఏకంగా 17,016 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు అందుబాటు ధరలో ఉండడంతో వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర కనీసం రూ.11 లక్షలు.. టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షల వరకు ఉంది.

ఈ క్రెటా SUV 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో లభిస్తుంది. ఇది లీటరుకు17 నుండి 21 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి. డ్యూయల్ డిస్‌ప్లే (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం)తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) ఉంది. దాదాపు 16,996 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.84 లక్షల నుండి రూ.10.19 లక్షల వరకు ఉంది.

కొత్త డిజైర్ సెడాన్ 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 24.79 నుండి 33.73 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, ఆటో AC వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
మూడవ స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) SUV ఉంది. మొత్తం 16,971 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి రూ.14 లక్షల వరకు ఉంది.

ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 17.38 నుండి 25.51 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు.
నాల్గవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఎంపీవీ ఉంది. ఏకంగా 15,780 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫ్యామిలీ కారు, చాలా అందుబాటు ధరలో కూడా లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.96 లక్షల నుండి రూ.13.25 లక్షల వరకు ఉంది.

కొత్త మారుతి ఎర్టిగా కారు 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 20.3 నుండి 26.11 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 సీట్లు ఉంటాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఐదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) SUV ఉంది. మొత్తం 15,534 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది స్కార్పియో N, స్కార్పియో క్లాసిక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెద్ద కుటుంబాలు దూర ప్రయాణాలు చేయడానికి ఇది చాలా సౌకర్యవంతమైన కారు.

మహీంద్రా స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ.14 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఉంది. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 12.12 నుండి 15.94 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 6/7 సీట్ల ఆప్షన్‌తో లభిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV కూడా అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13.62 లక్షల నుండి రూ.17.50 లక్షల వరకు ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 16 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆరవ స్థానంలో టాటా నెక్సాన్ (Tata Nexon) SUV ఉంది. ఏకంగా 15,457 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు పెట్రోల్, ఎలక్ట్రిక్ రూపాల్లో అందుబాటులో ఉంది. సాధారణ నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర కనీసం రూ.8 లక్షలు, గరిష్టంగా రూ.15.60 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్ EV కూడా అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.19 లక్షల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 45 కిలోవాట్ (kWh), 46.08 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 275 నుండి 489 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇస్తుంది.

ఏడవ స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) హ్యాచ్‌బ్యాక్ ఉంది. దాదాపు 14,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల వరకు ఉంది.
ఈ స్విఫ్ట్ కారు 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 24.8 నుండి 32.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 మంది ప్రయాణించవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక మిగిలిన వాటిలో ఎనిమిదవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) SUV ఉంది. ఏకంగా 14,345 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.54 లక్షల నుండి రూ.13 లక్షల వరకు ఉంది. తొమ్మిదవ స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (13,413 యూనిట్లు), పదవ స్థానంలో మారుతి బలెనో (13,180 యూనిట్లు) ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








