500కిమీ రేంజ్, 10 ఏళ్ల వారంటీ.. క్రెటా ఆధిపత్యానికి చెక్ పెట్టేసేందుకు సెప్టెంబర్ 3న వస్తున్నాడు
మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ కారు లాంచ్ డేట్ ఖరారైంది. కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. భారతదేశంతో పాటు యూరోపియన్ మార్కెట్లలో కూడా దీన్ని లాంచ్ చేయనున్నారు. కంపెనీ మొదట యూకే, నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాలలో ఈ-విటారాను విక్రయించనుంది.
అంతేకాకుండా, ఈ మోడల్‌పై కంపెనీ 10 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీని రేంజ్ సుమారు 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారత మార్కెట్‌లో ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతి ఈ-విటారా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, టెయిల్-లైట్స్, 18-అంగుళాల వీల్స్, గ్రిల్‌పై యాక్టివ్ ఎయిర్ వెంట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ ఇంటీరియర్ ఆంబియెంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.
అంతేకాకుండా, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫినిటీ బై హార్మన్ ఆడియో సిస్టమ్, ఇన్-కార్ కనెక్టివిటీ టెక్నాలజీ, సింగిల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి.

అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రెక్లైనింగ్, స్లైడింగ్, స్ప్లిట్ రియర్ సీట్లు, డ్రైవ్ మోడ్‌లు, స్నో మోడ్, వన్-పెడల్ డ్రైవింగ్, రీజెన్ మోడ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇక మారుతి ఈ-విటారా భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో లెవల్ 2 ఏడిఏఎస్ సూట్ ఉంటుంది. దీనిలో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
దీంతో పాటు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెషర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ డిస్క్ బ్రేక్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎగ్జాస్ట్ వెహికల్ అలారం సిస్టమ్..పాదచారుల కోసం వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ-విటారాను 10 ఎక్స్‌టీరియర్ రంగుల ఆప్షన్లలో ప్రవేశపెట్టనుంది. వీటిలో 6 మోనో-టోన్, 4 డ్యూయల్-టోన్ రంగులు ఉన్నాయి. 6 సింగిల్-టోన్ రంగుల ఆప్షన్లలో నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, ఆపులెంట్ రెడ్ ఉన్నాయి.
డ్యూయల్-టోన్ రంగులలో బ్లాక్ రూఫ్, ఏ-పిల్లర్, బి-పిల్లర్‌లు లభిస్తాయి. అలాగే, కాంట్రాస్టింగ్ ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఆపులెంట్ రెడ్ రంగుల ఆప్షన్లు కూడా ఉంటాయి.
మారుతి సుజుకి ఈ-విటారా ధరల విషయానికి వస్తే.. సిగ్మా (49kWh) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.18 లక్షలు ఉంటుంది. డెల్టా (49kWh) వేరియంట్ ధర సుమారు రూ.19.50 లక్షలు ఉంటుంది. జెటా (49kWh) వేరియంట్ ధర సుమారు రూ.21 లక్షలు ఉంటుంది.
జెటా (61kWh) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.22.50 లక్షలు ఉంటుంది. ఆల్ఫా (61kWh) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹24 లక్షలు ఉంటుంది. కేవలం జెటా (Zeta) వేరియంట్‌ను మాత్రమే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలు చేయగలరు.


Click it and Unblock the Notifications








