ఒక్కసారి ఛార్జ్ పెడితే 500కిమీ వెళ్లొచ్చు.. రోజూ ఆఫీసు వెళ్లే వాళ్లకు బెస్ట్ కారు ఇది.. డిసెంబర్లో దిగుతోంది
భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించడానికి మారుతీ సుజుకీ (Maruti Suzuki) సిద్ధమవుతోంది. వినియోగదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ ఈ-విటారా (Maruti Suzuki e-Vitara) లాంచ్ తేదీ ఖరారైంది. డిసెంబర్ 2న ఈ 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించనుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, రెండు స్ట్రాంగ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు, 500 కి.మీల అంచనా రేంజ్‌తో వస్తున్న ఈ కారు ధరలు, ఫీచర్లు, ప్రత్యర్థుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతి సుజుకీ ఈ-విటారా రాక కోసం ఎదురుచూస్తున్న భారతీయ కస్టమర్లకు శుభవార్త అందింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిసెంబర్ 2న దేశీయంగా విడుదల కానుంది. ఇది దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లకు కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచే గుజరాత్‌లోని హన్సల్‌పూర్ తయారీ యూనిట్ నుండి 2,900కు పైగా ఈ-విటారా మోడళ్లను యూరప్‌లోని ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు.

ఈ ఎస్‌యూవీ ధర రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై, టాప్ వేరియంట్‌కు రూ. 22.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే, ఇది మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా పోటీని సృష్టించగలదు. ఈ విటారా డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.
ఈ-విటారా రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఇది వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది. 49 kWh (కిలో వాట్ అవర్) బ్యాటరీ ప్యాక్. ఇది 144 bhp పవర్, 189 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61 kWh బ్యాటరీ ప్యాక్. ఇది మరింత శక్తివంతమైన 174 bhp పవర్, 189 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకీ ఈ కొత్త ఈ-విటారా ఒక్క ఫుల్ ఛార్జ్‌పై 500 కి.మీల వరకు రేంజ్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ-విటారా ఐదు సీట్ల (5-సీటర్) ఎస్‌యూవీ సెటప్‌తో వస్తుంది. డిజైన్, ఫీచర్ల పరంగా ఇది ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఇది 4,275 మి.మీ పొడవు, 4,275 మి.మీ వెడల్పు, 1,800 మి.మీ ఎత్తుతో విశాలంగా ఉంది. దీనికి 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,700 మి.మీ వీల్‌బేస్ ఉన్నాయి.
ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు ఆకర్షణీయంగా ఉంది. క్యాబిన్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, ఆటో ఏసీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఈ-విటారాలో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు జోడించారు. ఈ కారులో సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 360 డిగ్రీ కెమెరా వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీతో వస్తుంది.
ఈ-విటారా భారత మార్కెట్లో టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్‌సర్ ఈవీ వంటి వాటితో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








