రూ.5.25 లక్షలకే 7 సీటర్ కారు.. రెండు ఫ్యామిలీలకు బెస్ట్.. 30 రోజుల్లో చాలా మంది కొన్నారు!
భారతదేశంలో ఇటీవల కార్ల మార్కెట్‌లో 7 సీట్ల కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కుటుంబాలు కలిగినవారికి వీటిలో ప్రయాణించడం సౌకర్యంగా ఉండటంతో, ఈ తరహా కార్లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా, తక్కువ ధరలో, ఎక్కువ సీట్లు కలిగిన కార్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఈ విభాగాన్ని ఎంచకుంటున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీకి చెందిన కార్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. మారుతీ సుజుకీ విక్రయించిన మొత్తం వాహనాల సంఖ్య మే 2025లో 1,80,077 యూనిట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే 3 శాతం పెరుగుదలగా చెప్పొచ్చు. మే 2024లో మారుతీ 1,74,551 వాహనాలను విక్రయించిన సంగతి గమనార్హం.
ఈ మొత్తం విక్రయాల్లో, మారుతీ ఈకో (Maruti Eeco) కూడా కీలక పాత్ర పోషించింది. తక్కువ ధరలో, మంచి స్పేస్, మైలేజ్‌తో కూడిన మైలేజ్, వాడకానికి అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేయబడిన ఈ కారు, చిన్న వ్యాపారాలు నడిపేవారికి, టాక్సీ సేవలకోసం చూస్తున్నవారికి, కుటుంబ ప్రయాణాలకు అనువుగా మారింది. ఈ వాహనం ఇప్పుడు భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన తక్కువ ధర 7 సీట్ల కారుగా నిలిచింది.

మారుతీ ఈకో మే నెలలో మొత్తం 12,327 యూనిట్లు అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 10,960 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతున్న వినియోగదారుల అభిరుచులను సూచించేలా, 7-సీట్ల కార్లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతోందనడానికి ఈ గణంకాలే నిదర్శనం. తక్కువ ధర, అనేక సీటింగ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండడం వంటి అంశాల కారణంగా దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మారుతీ ఈకో మూడు వేరు వేరు మోడళ్లలో 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 5.70 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది, ఇది ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న అత్యంత చౌకైన 7 సీట్ల కార్లలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆరు నెలల అమ్మకాల గణాంకాలు పరిశీలిస్తే, ఈకో మెల్లగా కానీ స్థిరంగా అమ్మకాల్లో పెరుగుదల నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది.

ఆరు నెలల అమ్మకాలను చూసినట్లయితే, నవంబర్ 2024లో 10,589 యూనిట్లు, డిసెంబర్ 2024లో 11,678 యూనిట్లు, జనవరి 2025 లో 11,250 యూనిట్లు, ఫిబ్రవరి 2025లో 11,493 యూనిట్లు, మార్చి 2025 లో 10,409 యూనిట్లు, ఏప్రిల్ 2025లో 11,438 యూనిట్లు, మే 2025లో 12,327 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. మారుతీ ఈకోకు గల ఆదరణ ఎలా పెరుగుతుందో తెలుసుకోవడానికి ఈ గణంకాలే నిదర్శనం.
మారుతి ఈకో, ఆర్థికంగా మిడిల్ క్లాస్ భారతీయ వినియోగదారులకు సరిపోయే విధంగా రూపొందించబడినందున, ఇది ఇంకా కొన్నాళ్లు మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇది K-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ అత్యుత్తమంగా 80.76 PS పవర్, 104.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ రోజువారీ వాడకానికి, నగర ప్రయాణాలకు సరిపడే స్థాయిలో ఉంటుంది.

CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. 71.65 PS పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌తో పోలిస్తే కొంత తక్కువ పెర్ఫార్మెన్స్ అయినప్పటికీ, మైలేజ్ విషయంలో మాత్రం CNG వేరియంట్ చాలా ముందుంది. CNG వేరియంట్‌లో 27.05 కిలోమీటర్లు కిలోకు మైలేజ్ వస్తుంది. అదే పెట్రోల్ వేరియంట్‌లో లీటర్‌కు 20.2 కిలోమీటర్లు వస్తుంది. అదే ప్యాసింజర్ వేరియంట్‌లో పెట్రోల్‌కు 19.7 kmpl, CNGలో 26.78 km/kg వస్తుంది.


Click it and Unblock the Notifications








