ఎర్టిగా రాజభోగం పోయింది.. 7-సీటర్ కార్లలో నెంబర్ 1 స్థానం దక్కించుకున్న బిగ్ డాడీ స్కార్పియో

2025 సెప్టెంబర్ నెల భారతీయ వాహన మార్కెట్‌కు అత్యంత అద్భుతమైన నెలగా నిలిచింది. పండుగ ఆఫర్లు, జీఎస్టీ ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ల కారణంగా చాలా కంపెనీల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో, 7-సీటర్ ఫ్యామిలీ కార్ల విభాగంలో ఒక ఊహించని మార్పు కనిపించింది. ఎన్నో నెలలుగా అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా MPV తన రాజపట్టాన్ని కోల్పోయింది. ఎర్టిగాను వెనక్కి నెట్టి మరీ, దాని బిగ్ డాడీ అయిన మహీంద్రా స్కార్పియో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10, 7-సీటర్ కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

కొన్ని నెలలుగా 7-సీటర్ కార్ల సెగ్మెంట్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మారుతి ఎర్టిగాకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎర్టిగాను వెనక్కి నెట్టి మరీ మహీంద్రాకు చెందిన 'బిగ్ డాడీ' మహీంద్రా స్కోర్పియో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. స్కోర్పియో N, స్కోర్పియో క్లాసిక్ మోడళ్లు రెండింటి అమ్మకాలు కలిపి ఏకంగా 18,372 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే స్కోర్పియో 27 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.

Maruti Ertiga Loses 7-Seater Crown Mahindra Scorpio Becomes the Bestselling 7-Seater in September 2025 2025

మారుతి సుజుకి ఎర్టిగాకు ఈసారి షాక్ తగిలింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 17,441 యూనిట్లు అమ్ముడైన ఎర్టిగా.. ఈసారి ఏకంగా 31% అమ్మకాలు తగ్గి 12,115 యూనిట్లకు పరిమితమైంది. దీంతో ఎర్టిగా నెం.2 స్థానానికి పడిపోయింది. సాధారణంగా దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల టాప్-5లో ఉండే ఎర్టిగా, ఈ నెలలో టాప్-10 అమ్మకాల జాబితాలో కూడా పత్తా లేకుండా పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జీఎస్‌టీ తగ్గింపు ఉన్నా కూడా అమ్మకాలు తగ్గడం గమనార్హం.

ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ మోడళ్లతో కలిపి 9,783 యూనిట్లు అమ్మి మూడో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించింది. 7-సీటర్ ఎస్‌యూవీ అయిన XUV700 9,746 యూనిట్లు అమ్మి నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి దీని అమ్మకాలు దాదాపు స్థిరంగా (1% వృద్ధి) ఉన్నాయి.

Maruti Ertiga Loses 7-Seater Crown Mahindra Scorpio Becomes the Bestselling 7-Seater in September 2025 2025

కియా కారెన్స్ ఎంపీవీ 7,338 యూనిట్లు అమ్మి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది కూడా 18 శాతం వార్షిక వృద్ధిని చూపించింది. మిగిలిన స్థానాలు (6 నుంచి 10) పరిశీలిస్తే.. టాప్-5, బాటమ్-5 కార్ల మధ్య అమ్మకాల విషయంలో చాలా పెద్ద తేడా ఉంది.

2,783 యూనిట్లతో టయోటా ఫార్చ్యూనర్ 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో 2,747 యూనిట్లతో మహీంద్రా బొలెరో నిలిచింది. అయితే కొత్త మోడల్ రాబోతున్నందున, దీని అమ్మకాలు గత సంవత్సరం కంటే 66 శాతం పడిపోయాయి. 2,587 యూనిట్లతో 8వ స్థానంలో రెనో ట్రైబర్ ఉంది.

Maruti Ertiga Loses 7-Seater Crown Mahindra Scorpio Becomes the Bestselling 7-Seater in September 2025 2025

దీనికి 68 శాతం వార్షిక వృద్ధి లభించింది. 9వ స్థానంలో మారుతి సుజుకి XL6 2,170 యూనిట్లతో నిలిచింది. టాటా సఫారీ 2,000 యూనిట్లను అమ్మి 10వ స్థానంలో ఉంది. టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన సఫారీ చివరి స్థానంలో నిలిచింది.

7-సీటర్ ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్‌లో ఈ నెలలో మహీంద్రా స్కోర్పియో సృష్టించిన సంచలనం చూస్తుంటే, రాబోయే నెలల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఎర్టిగా తిరిగి పుంజుకుంటుందా లేక స్కోర్పియో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందా అనేది చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2025, 7:15 [IST]
English summary
Maruti ertiga loses 7 seater crown mahindra scorpio becomes the bestselling 7 seater in september 20
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+