28 కి.మీ. మైలేజ్ ఇచ్చే కారు కేవలం రూ. 6.85 లక్షలే.. ఈ పండుగ ఆఫర్ కింద రూ. 88,000 భారీ డిస్కౌంట్ కూడా

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు, కొత్త వస్తువులు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా దీపావళికి కొత్త కారు ఇంటికి తీసుకురావాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారి కలలను నిజం చేసేందుకు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది.

ఇటీవల GST ధరల తగ్గింపుతో ఇప్పటికే అందుబాటు ధరలో ఉన్న తమ పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ పై ఇప్పుడు ఏకంగా రూ. 88,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. అద్భుతమైన మైలేజ్, అదిరిపోయే ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారును ఈ పండుగకు ఇంటికి తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం.

Maruti Fronx Diwali Offer Avail Benefits Up to Rs 88 000 Price Starts from Rs 6 85 Lakh

పండుగ ఆఫర్ల జాతర.. వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్లు
మారుతి తన ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే ఫ్రాంక్స్ కారుపై అక్టోబర్ 2025 నెలలో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఏ వేరియంట్‌పై ఎంత ఆఫర్ ఉందో వివరంగా చూద్దాం.

ఫ్రాంక్స్ టర్బో వేరియంట్లు: ఈ మోడల్‌పై అత్యధికంగా రూ. 88,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 స్క్రాపేజ్ బోనస్, మరియు రూ. 43,000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీలు ఉచితంగా లభిస్తాయి.

Maruti Fronx Diwali Offer Avail Benefits Up to Rs 88 000 Price Starts from Rs 6 85 Lakh

1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లు: ఈ సాధారణ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లపై రూ. 22,000 నుంచి రూ. 39,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
CNG వేరియంట్లు: అధిక మైలేజ్‌తో ఆకట్టుకునే CNG వేరియంట్లపై కూడా కంపెనీ రూ. 30,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.

జీఎస్టీ తగ్గింపుతో ఇప్పటికే దిగివచ్చిన ధరలు
ఇటీవల ప్రభుత్వం GST విధానంలో చేసిన మార్పుల కారణంగా మారుతి ఫ్రాంక్స్ ధరలు సుమారు రూ. 1.12 లక్షల వరకు తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.85 లక్షలుగా ఉంది. టాప్ మోడల్ ధర రూ. 11.98 లక్షల వరకు ఉంది. ఇప్పుడు ఈ తక్కువ ధరలకు దీపావళి ఆఫర్లు కూడా తోడవ్వడంతో ఇది కొనుగోలుదారులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

Maruti Fronx Diwali Offer Avail Benefits Up to Rs 88 000 Price Starts from Rs 6 85 Lakh

ఇంజిన్, పెర్ఫార్మెన్స్, మైలేజ్
మారుతి ఫ్రాంక్స్ రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది.
1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్: ఇది పవర్, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం. ఈ ఇంజిన్ కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనికి మాన్యువల్ మరియు పాడిల్ షిఫ్టర్లతో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్: ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. రోజువారీ ప్రయాణాలకు, మంచి మైలేజ్ కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక. దీనికి మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

మైలేజ్ విషయానికి వస్తే, ఫ్రాంక్స్ పెట్రోల్ వేరియంట్లు లీటర్‌కు 21.5 కి.మీ నుంచి 22.89 కి.మీ వరకు ఇస్తాయి. ఇక CNG వేరియంట్ అయితే కిలోకు ఏకంగా 28.51 కి.మీ మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫీచర్లు, సేఫ్టీ
ధర తక్కువే అయినా ఫీచర్ల విషయంలో మారుతి ఏమాత్రం తగ్గలేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఆధునిక ఫీచర్లున్నాయి.

భద్రత విషయంలోనూ ఫ్రాంక్స్ ముందుంది. ఇటీవల బేస్ వేరియంట్‌తో సహా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వీటితో పాటు ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న ఆఫర్లు మీ నగరం, డీలర్‌షిప్, స్టాక్ బట్టి మారతాయి. పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

Article Published On: Sunday, October 12, 2025, 15:57 [IST]
English summary
Maruti fronx diwali offer avail benefits up to rs 88 000 price starts from rs 6 85 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+