కోట్ల రూపాయలు అవసరం లేదు.. లక్షల్లోనే లగ్జరీ ఫీచర్లు.. ఈ కారు కొనుక్కుంటే బోలెడు డబ్బులు ఆదా

దేశీయ వాహన మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. డిజైన్, ఇంటీరియర్, పర్ఫామెన్స్, ఇంధన సామర్థ్యం వంటి అనేక ఫీచర్లతో నిండిన కార్లను రోడ్లపైకి తీసుకొచ్చే కంపెనీ ఇదే. హ్యుందాయ్, మహీంద్రా, టాటా వంటి కంపెనీలతో ఒంటరిగా తలపడే ధైర్యం మారుతికి తప్ప మరెవరికీ భారతదేశంలో లేదని చెప్పవచ్చు. కాంపాక్ట్ SUV కొనాలని కోరుకునే వారిని నిరాశపరచని మారుతి అద్భుతమైన మోడల్ ఫ్రాంక్స్. ఈ కారును సొంతం చేసుకోవాలని కోరుకునే వారు షోరూమ్‌కి వెళ్ళే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.

మారుతి సుజుకి అత్యంత ఆకర్షణీయమైన కాంపాక్ట్ ఎస్యూవీలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒకటి. డిజైన్‌లో అత్యంత ముఖ్యమైన అంశం LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో అనుసంధానించబడిన క్రోమ్-యాక్సెంట్ చేయబడిన నెక్సా సిగ్నేచర్ గ్రిల్. ఇది ఫ్రాంక్స్ ముందు భాగాన్ని ఒక్క చూపులో ఎవరినైనా ఆకట్టుకునేలా చేస్తుంది.

Maruti Fronx is a Masterpiece Know These Things Before You Plan to Buy

అదనంగా సిల్వర్ రూఫ్ రైల్స్, స్పోర్టీ డ్యుయల్-టోన్ అల్లాయ్ వీల్స్ సైడ్ ప్రొఫైల్‌ను అద్భుతంగా చేస్తాయి. వీల్ ఆర్చ్‌లు, పక్కల చుట్టూ ఉన్న బ్లాక్ బాడీ క్లాడింగ్ ఫ్రాంక్స్ ఎస్యూవీ లుక్ హైలైట్ చేయడానికి సాయపడతాయి. అంతేకాకుండా, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, ప్రీమియం టచ్ ఇచ్చే స్టైలిష్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లతో పాటు ఫ్రాంక్స్ వెనుక భాగం కూడా మెరిసిపోతుంది.

డిజైన్ అద్భుతంగా ఉంటే, లోపలి ఇంటీరియర్ గురించి చెప్పనవసరం లేదు. డోర్ తెరవగానే కళ్ళు జిగేల్ మనే క్యాబిన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ సొంతం. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, క్రోమ్ యాక్సెంట్‌లు, హై లెవల్ ఫినిషింగ్‌లు అన్నీ కలిపి క్యాబిన్‌ను అత్యంత ఆకర్షణీయంగా చేస్తాయి. మారుతి ఫ్రాంక్స్ ధర దాని వేరియంట్‌ను బట్టి ఎక్స్-షోరూమ్ సుమారుగా రూ. 6.85 లక్షల నుండి రూ. 13.04 లక్షల వరకు ఉంటుంది.

Maruti Fronx is a Masterpiece Know These Things Before You Plan to Buy

బాగా అమర్చబడిన డాష్‌బోర్డ్‌తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉన్నాయి. వీటికి సపోర్టు ఇచ్చే పెద్ద 9 అంగుళాల ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో చేర్చారు. కాబట్టి కంటిన్యూ కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంటుకు ఎలాంటి లోటు ఉండదు.

హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ తక్కువ బరువు గల కాంపాక్ట్ SUV అద్భుతమైన ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. వివిధ అవసరాలకు సరిపోయే రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు, ఒక CNG వేరియంట్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ డ్యుయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు దాదాపు 22.8 కిలోమీటర్ మైలేజ్‌ను అందిస్తుంది.

Maruti Fronx is a Masterpiece Know These Things Before You Plan to Buy

సిటీ డ్రైవింగ్‌కు సాధారణంగా దాదాపు 14 నుండి 17 కిలోమీటర్, హైవే డ్రైవింగ్‌కు దాదాపు 18 నుండి 20 కిలోమీటర్ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది సుదూర ప్రయాణాలు, రోజువారీ ప్రయాణాలు కోరుకునే వారికి ఫ్రాంక్స్‌ను బెస్ట్ ఆప్షన్‎గా మారుస్తుంది. మరింత పవర్ కోరుకునే వారికి 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో దాదాపు లీటరుకు 21.5 కిలోమీటర్, ఆటోమేటిక్ వెర్షన్‌తో దాదాపు 20 కిలోమీటర్ మైలేజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో స్పోర్టీ పనితీరును కూడా వాగ్దానం చేస్తుంది. అదనంగా, 1.2 లీటర్ సీఎన్జీ వేరియంట్ చాలా లాభదాయకం. ఫ్రాంక్స్ సీఎన్జీ క్లెయిమ్డ్ మైలేజ్ కిలోగ్రాముకు 28.5 కిలోమీటర్లు. కాబట్టి, ఇంధన ఖర్చులను ఆదా చేయాలనుకునే రోజువారీ ప్రయాణికులకు సీఎన్జీ వేరియంట్ చాలా అనుకూలంగా ఉంటుంది.

Maruti Fronx is a Masterpiece Know These Things Before You Plan to Buy

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎటువంటి రాజీ లేని సేఫ్టీ లక్షణాలను అందిస్తుంది. అన్ని వేరియంట్‌లలో ఫ్రంట్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో సహా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. అదనంగా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్రైవింగ్ పరిస్థితులలో కంట్రోల్ నిర్వహించడానికి సాయపడే 360-డిగ్రీ కెమెరా కూడా కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 27, 2025, 13:21 [IST]
English summary
Maruti fronx is a masterpiece know these things before you plan to buy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+