సౌండ్ లేకుండా సేల్స్ సునామీ..హైరైడర్‎ను ఓడించి అమ్మకాల్లో టాప్‌లోకి మారుతి గ్రాండ్ విటారా

టయోటా, మారుతి సుజుకి సంస్థల భాగస్వామ్యం ఫలితంగా రూపొందించబడిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడళ్లు భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఒకదానికొకటి పోటీ ఇస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, ఈ రెండు మోడళ్లు ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించడం ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాయి. ప్రారంభంలో మారుతి మోడల్‌కు ఎక్కువ అమ్మకాలు జరిగినా గత కొన్ని నెలలుగా టయోటా హైరైడర్ అమ్మకాలలో ఆధిక్యం కనబరిచింది. అయితే నవంబర్ 2025 నెల అమ్మకాలతో ఈ పోటీలో కథ మారింది.

తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం మారుతి సుజుకి గ్రాండ్ విటారా మళ్లీ పుంజుకుని, తన ప్రత్యర్థి అయిన టయోటా హైరైడర్‌ను వెనక్కి నెట్టింది. గ్రాండ్ విటారా ఏకంగా 11,339 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెల (10,148 యూనిట్లు)తో పోలిస్తే ఏకంగా 12 శాతం అధిక వృద్ధిని సాధించింది.

Maruti Grand Vitara Sales Jump 12 Overtakes Toyota Hyryder with Attractive Discounts

అదే సమయంలో టయోటా హైరైడర్ నవంబర్‌లో కేవలం 7,393 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, గ్రాండ్ విటారా మళ్లీ పుంజుకోవడం దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకికి నిజంగా శుభవార్త.

గ్రాండ్ విటారా అమ్మకాల జోరు పెరగడానికి ఈ నెలలో కంపెనీ ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఒక ప్రధాన కారణం. డిసెంబర్ నెలలో గ్రాండ్ విటారాపై వినియోగదారులు రూ.2.40 లక్షల వరకు భారీ తగ్గింపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇందులో ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ కవరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Maruti Grand Vitara Sales Jump 12 Overtakes Toyota Hyryder with Attractive Discounts

అయితే, ఈ ఆఫర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, డీలర్‌షిప్‌ను బట్టి స్వల్పంగా మారవచ్చు. జీఎస్టీ సంస్కరణల తర్వాత సవరించిన ధరల ప్రకారం, మారుతి సుజుకి మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.77 లక్షల నుంచి రూ.20.22 లక్షల వరకు ఉంది. ఈ భారీ తగ్గింపులు, వినియోగదారులను మళ్లీ గ్రాండ్ విటారా వైపు ఆకర్షించాయి.

గ్రాండ్ విటారా రెండు ప్రధాన ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 102 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 113 bhp పవర్, 122 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉంది.

Maruti Grand Vitara Sales Jump 12 Overtakes Toyota Hyryder with Attractive Discounts

హైబ్రిడ్ వేరియంట్‌లు అద్భుతమైన 27.97 కి.మీ మైలేజీని అందిస్తాయి. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లు 19.38 కి.మీ, CNG వేరియంట్‌లు 26.6 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తాయని మారుతి చెబుతోంది. అదనంగా ఇందులో CNG పవర్‌ట్రైన్, కష్టమైన రోడ్లపై ఉపయోగపడే ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలు కూడా ఉన్నాయి.

విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రాండ్ విటారా 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. టయోటా భాగస్వామ్యంతో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావడం, ఇటీవలే విక్టోరిస్ వంటి కొత్త మోడళ్లు వచ్చినా కూడా గ్రాండ్ విటారా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం మారుతికి నిజంగా డబుల్ హ్యాపీ ఇచ్చే విషయం. ఈ అమ్మకాల జోరుతో 2026లో కూడా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో గ్రాండ్ విటారా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, December 15, 2025, 7:30 [IST]
English summary
Maruti grand vitara sales jump 12 overtakes toyota hyryder with attractive discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+