పెద్ద ఫ్యామిలీకి పిల్లలతో హాయిగా తిరగడానికి ఫర్పెక్ట్ కారు.. భారీగా ధర పెరిగినా తగ్గని డిమాండ్

హ్యాచ్‌బ్యాక్ అయినా, ఎస్యూవీ అయినా, ఎంపీవీ అయినా.. భారతీయులు మొదట చూసేది ఆ బాడీ స్టైల్‌లో మారుతి కారు ఉందా లేదా అని.. ఒకప్పుడు మారుతికి అంత పట్టులేని ఎస్ యూవీ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు గట్టిగా నిలదొక్కుకుంది. ఇక ఎంపీవీ సెగ్మెంట్‌లో మారుతికి ఒకటి కంటే ఎక్కువ మోడళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ఎర్టిగా అనే ఒక్క మోడల్ ఈ సెగ్మెంట్‌ను ఏలుతోంది.

మారుతి పాపులర్, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు ఎర్టిగా. ఇక ఎర్టిగా ఎంపీవీ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లు కాస్త ఎక్కువ డబ్బు సిద్ధం చేసుకోవాలి. ఇండో-జపనీస్ వాహన తయారీ సంస్థ ఈ కారు అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. ఈ ధరల పెరుగుదల తక్షణమే అమల్లోకి వచ్చింది. కార్వాలేలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎర్టిగా (Maruti Ertiga Price Hike) ధర రూ.12,500 పెరిగింది.

Maruti Ertiga

ఎంపీవీ నాలుగు వేరియంట్లకు ఒకే విధంగా ధర పెరిగింది. ఈ మార్పుల తర్వాత ఎర్టిగా ప్రారంభ ధర ఇప్పుడు రూ.8.96 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.13.25 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. 2025 ఫిబ్రవరిలో కూడా మారుతి ఎర్టిగా అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. అప్పుడు కంపెనీ రూ.10,000 నుండి రూ.15,000 వరకు ధర పెంచింది.

ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నందున కంపెనీ తరచుగా కార్ల ధరలను మారుస్తూ ఉంటుంది. ఈ పెరుగుదల మారుతి ఎర్టిగా డిమాండ్‌ను ప్రభావితం చేయకపోవచ్చని భావిస్తున్నారు. మారుతి కొత్త ఫీచర్లు లేదా అప్‌డేట్‌లు ఇవ్వనప్పటికీ ఎర్టిగా ఇప్పటికీ దాని సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన 7 సీటర్ ఆప్షన్‌గా కొనసాగుతోంది.

Maruti

మంచి మైలేజ్, అందుబాటు ధరలో మెయింటెనెన్స్ ఖర్చులు ఉండటం వల్ల మారుతి ఎర్టిగా భారతీయ మార్కెట్లో అత్యంత పాపులారిటీ పొందిన 7 సీటర్ ఎంపీవీలలో ఒకటిగా నిలిచింది. తాజా ధరల పెరుగుదల తర్వాత కూడా ఎర్టిగా డబ్బుకు తగిన విలువనిచ్చే ఆప్షన్‌గా కొనసాగుతోంది. మారుతి సుజుకి మార్చి 15, 2022న నవీకరించబడిన ఎర్టిగాను దేశంలో విడుదల చేసింది.

LXi, VXi, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో ఈ ఎంపీవీ అందుబాటులో ఉంది. VXI, ZXI వేరియంట్లలో సీఎన్జీ కిట్ ఆప్షన్ కూడా ఉంది. పెర్ల్ మెటాలిక్ ఆటం రెడ్, డిగ్నిటీ బ్రౌన్, మెటాలిక్ మాగ్మా గ్రే, పెర్ల్ మెటాలిక్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ అనే ఏడు రంగుల్లో దీన్ని ఎంచుకోవచ్చు.

Eartiga

ఈ అందుబాటు ధరలోని ఎంపీవీలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను మారుతి సుజుకి అందిస్తోంది. ఈ ఇంజన్ 103 బీహెచ్పీ పవర్‌ను, 136.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌తో పాటు స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వస్తుంది. అదే సమయంలో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజన్ 87 బీహెచ్పీ పవర్‌ను, 121.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే ఫ్యూయెల్ కెపాసిటీ పెరుగుతుంది. మారుతి ఎర్టిగా పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో దాని పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 20.3 కిలోమీటర్లు. సీఎన్జీ మోడ్‌లో ఎర్టిగా కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని తయారీదారులు పేర్కొంటున్నారు.

ఫీచర్ల పరంగా కూడా మారుతి ఎర్టిగా ఏమాత్రం తక్కువ కాదు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్‌తో కూడిన 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండవ వరుస ప్రయాణికుల కోసం ఏసీ వెంట్లు, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ముఖ్యమైన ఫీచర్లు ఈ ఎంపీవీలో ఉన్నాయి.

ఈ ఎంపీవీలో ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు. అంటే చిన్న కుటుంబాలు అయితే రెండు కుటుంబాల వరకు కూడా సౌకర్యంగా వెళ్లవచ్చు. విశాలమైన సీట్లతో పాటు మంచి లగేజ్ స్పేస్ కూడా ఇందులో ఉంది. దీని బూట్ స్పేస్ 209 లీటర్లు. మూడవ వరుస సీట్లను మడిస్తే అది 550 లీటర్లకు పెరుగుతుంది.

ప్రయాణికులతో పాటు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాల్సిన కుటుంబాలకు దూర ప్రయాణాల్లో, వీకెండ్ ట్రిప్‌లలో ఇది చాలా అనుకూలమైన ఆప్షన్. ఇప్పుడు ధర పెరిగినప్పటికీ దాని పోటీదారులైన కియా కారెన్స్, టయోటా రూమియన్లతో పోలిస్తే ఎర్టిగా ధర ఇప్పటికీ తక్కువే. అందువల్ల ఎర్టిగా అమ్మకాలు పెద్దగా పడిపోయే అవకాశం లేదు.

Swift

గత నెలలో ఎంపిక చేసిన కొన్ని ఇతర మోడళ్ల ధరలను కూడా మారుతి పెంచింది. అయితే అవేవీ కంపెనీ అమ్మకాలను ప్రభావితం చేయలేదు. 2025 ఏప్రిల్‌లో మారుతి సుజుకి మొత్తం 1,79,791 కార్లను విక్రయించింది. 2024 ఏప్రిల్‌లో విక్రయించిన 1,68,089 యూనిట్లతో పోలిస్తే వార్షిక వృద్ధి దాదాపు 7 శాతం. దేశీయ మార్కెట్లో మారుతి 1,42,053 యూనిట్లను విక్రయించింది.

పోయిన నెలలో టయోటాకు 9,827 యూనిట్లను సరఫరా చేసింది. 27,911 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. మారుతి అమ్మకాలను వివరంగా పరిశీలిస్తే ఆల్టో , ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్ల విభాగానికి ఎదురుదెబ్బ తగిలింది. 12 నెలల క్రితం ఈ మోడళ్ల అమ్మకాలు 11,519 యూనిట్లు ఉండగా 2025 ఏప్రిల్‌లో భారీగా తగ్గి 6,332 యూనిట్లకు చేరుకుంది.

అదే సమయంలో బలెనో, స్విఫ్ట్, వాగన్‌ఆర్, డిజైర్, ఇగ్నిస్ వంటి కార్లు ఉన్న కాంపాక్ట్ విభాగంలో అమ్మకాలు పెరిగాయి. 2024 ఏప్రిల్‌లో 56,953 యూనిట్లుగా ఉన్న కాంపాక్ట్ కార్ల అమ్మకాలు గత నెలలో 61,591 యూనిట్లకు పెరిగాయి. ఇటీవల చిన్న కార్ల అమ్మకాల్లోని తగ్గుదలను మారుతి యుటిలిటీ వాహన విభాగం గట్టిగా అధిగమిస్తోంది.

గత నెలలో కూడా యువి విభాగం కంపెనీ ఆశలను నిలబెట్టింది. ఫ్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 59,022 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 56,553 యూనిట్ల నుండి మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది. దీనితో పాటు మారుతికి ఎగుమతులు కూడా కలిసి వచ్చాయి.

2024 ఏప్రిల్‌లో 22,160 యూనిట్లుగా ఉన్న ఎగుమతులను 27,911 యూనిట్లకు పెంచడం మారుతికి సంతోషాన్నిచ్చింది. దేశీయ మార్కెట్లో స్థిరమైన పనితీరుతో పాటు మారుతి ఎగుమతులు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా శుభపరిణామం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 5, 2025, 10:15 [IST]
English summary
Maruti hikes price of popular 7 seater ertiga still under 9 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+