పేరు మార్చి మార్కెట్లోకి కొత్త వేరియంట్ లాంచ్ చేసిన మారుతి.. దిమ్మతిరిగే మైలేజీ, ధర
దేశంలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న కంపెనీ మారుతి సుజుకి. ఈ కంపెనీ కార్లు ప్రైవేట్ వ్యక్తులలోనే కాకుండా వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం ఉపయోగించే ట్యాక్సీలుగా కూడా బాగా పాపులర్ అయ్యాయి. కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి పేర్లు మార్చి రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్స్, తక్కువ ధరతో రిలీజైన కొత్త మోడల్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి తయారు చేసిన మోడల్స్ లో నంబర్ వన్ కాంపాక్ట్ సెడారు కారు మారుతి సుజుకి డిజైర్. దీనిని తాజాగా టూర్ ఎస్ పేరుతో కమర్షియల్ వెహికల్ గా కూడా విక్రయిస్తుంది. టూర్ S కూడా మన భారతీయులకు ఎంతో ఇష్టమైన టాక్సీ కార్లలో ఒకటి. మారుతి సుజుకి త్వరలో కమర్షియల్ వినియోగదారుల కోసం కొత్త 2025 టూర్ S టాక్సీని విడుదల చేయబోతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

మారుతి గతేడాది చివరల్లో డిజైన్ సెడాన్ న్యూ జనరేషన్ వెర్షన్ లాంచ్ చేసింది. ఫోర్త్ జనరేషన్ డిజైర్ కొత్త ఇంజిన్, డిజైన్, అధునాతన ఫీచర్స్ తో ప్రారంభించారు. సేఫ్టీపరంగా కూడా న్యూజెన్ డిజైన్ ఆకట్టుకుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొట్టమొదటి మారుతి కారుగా డిజైల్ నిలిచింది. కొత్త అప్ డేట్‌తో టూర్ S 5-స్టార్ రేటింగ్ పొందిన ఏకైక కమర్షియల్ కారుగా అవతరించబోతుంది.
మారుతి సుజుకి త్వరలో అరీనా ఛానల్ ద్వారా కొత్త కారు విక్రయాలను ప్రారంభించనుందని వీ3 కార్స్ తెలిపింది. కొత్త టూర్ ఎస్ మోడల్ ధర, మైలేజీని కూడా వీ3 కార్స్ నివేదించింది. మార్కెట్లో 2025 టూర్ S పెట్రోల్ ధర రూ. 6.79 లక్షలు, టూర్ S సీఎన్జీ ధర రూ. 7.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

డిజైర్ బేస్ మోడల్ కంటే టూర్ ఎస్ పెట్రోల్ ధర రూ. 5వేలు తక్కువగా ఉంటుంది. మారుతి డిజైర్ సీఎన్జీ VXi వేరియంట్‌లో అమ్మకానికి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.79 లక్షలు. టూర్ ఎస్ సీఎన్జీ డిజైర్ బేస్ LXi మోడల్ ఆధారంగా రూపొందించారు. కొత్త ఇంజిన్‌తో డిజైర్ మైలేజ్ మెరుగు పడిందని చెప్పాలి.
డిజైర్ పెట్రోల్ మాన్యువల్ మైలేజ్ లీటరుకు 24.79 కి.మీ, డిజైర్ పెట్రోల్-ఆటోమేటిక్ 25.71కి.మీ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. అదే సమయంలో, డిజైర్ సీఎన్జీ కిలోకు 33.73 కి.మీ మైలేజీని అందిస్తుంది. వాస్తవానికి 2025 డిజైర్ టూర్ ఎస్ మోడల్ మైలేజ్ పెరిగింది.

ఏఆర్ఏఐ టెస్టింగులో 2025 డిజైర్ టూర్ ఎస్ లీటరుకు 26.06కి.మీ. మైలేజీని అందించింది. ఇది డిజైర్ పెట్రోల్ మాన్యువల్ కంటే 5.12 శాతం ఎక్కువ. డిజైర్ పెట్రోల్ ఆటోమేటిక్ కంటే 1.36 శాతం ఎక్కువ. టూర్ ఎస్ సీఎన్జీ మైలేజ్ కిలోగ్రాముకు 34.30 కిలోమీటర్లు అని నివేదిక పేర్కొంది. ఇది సాధారణ డిజైర్ సీఎన్జీ కంటే 1.7 శాతం ఎక్కువ.
2025 డిజైర్ టూర్ ఎస్ టాక్సీ ఫీచర్స్ పరిశీలిస్తే దీనికి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. గతంలో ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పటి నుంచి కారులోని అన్ని విండోలకు పవర్ విండోలు ఉంటాయి. గతంలో ముందు పవర్ విండోస్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇతర ఫీచర్లతో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 1-టచ్ అప్/డౌన్ డ్రైవర్ విండో, రిమోట్ సెంట్రల్ లాకింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా ఉన్నాయి.
కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించే వెహికల్స్ కొన్ని విలాసాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించారు. దీని వలన సరసమైన ధరలకు మంచి మైలేజ్ ఉన్న కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొత్త టూర్ ఎస్ సీఎన్జీ లీటర్‌కు 34 కిలోమీటర్ల మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ వస్తున్నందున, మరింత మంది టాక్సీ డ్రైవర్లు దీని వైపు ఆకర్షితులవుతారు. ఇది కూడా చౌకగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








