బుల్లెట్ ప్రూఫ్ ఫ్యామిలీ కార్! తక్కువ ధరలో ఎయిర్‌బ్యాగులు, కెప్టెన్ సీటు, 27 కి.మీ మైలేజ్.. కొత్తగా మారిన ఈకో
భారతదేశంలో అదిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki) ప్రయాణికుల సేఫ్టీకి ఇటీవల కాలంలో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. గతంలో గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో మారుతికి తక్కువ స్కోర్లు రావడం వల్ల విమర్శలు ఎదురవ్వగా, ఇప్పుడు అదే మారుతీ కొత్త తరం డిజైర్‌కు 5-స్టార్ రేటింగ్ సాధించి ఇతర వాహన తయారీదారులకు పోటీ పరంగా గట్టిగా తిరిగి సమాధానం ఇచ్చింది. తక్కువ ధరలలో లభించే మారుతి ఆల్టో K10, సెలెరియో వంటివాటి బేస్ వేరియంట్లలో కూడా ఇప్పుడు ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తుండటాన్ని చూస్తేనే సేఫ్టీకి మారుతీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో తెలిసిపోతుంది.
ఇంతకుముందు వేరియంట్లు ఎయిర్‌బ్యాగ్ లేకుండా కూడా వచ్చేవి, కానీ ఇప్పుడు భద్రతపై దృష్టితో మారుతీ డిమాండ్ ఉన్న తక్కువ ధరలో లభించే బేస్ వేరియంట్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తూ ముందుకు సాగుతోంది. ఇది కార్ల ధరలను ప్రభావితం చేసే అంశమే అయినా, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. టాటా మోటార్స్‌కు ధీటుగా ఇప్పుడు మారుతీ ప్రణాళికలు రచిస్తుంది.

ఇటీవలే గ్రాండ్ విటారా, వ్యాగన్ఆర్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు జోడించిన కంపెనీ వరుసగా మిగిలిన బేస్ వేరియంట్లకు కూడా క్రమంగా వీటిని అందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే కోవలో ఎంపీవీ విభాంగంలో ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉన్నటువంటి మారుతీ ఈకో (eeco) కూడా భద్రత పరంగా పెద్ద అప్‌గ్రేడ్ పొందింది. తాజాగా విడుదలైన 2025 మారుతీ సుజుకీ ఈకోలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభించనున్నాయి
ఈ మల్టీ పర్పస్ వెహికిల్ (MPV) ఇప్పుడు కొత్త 6-సీట్ల వేరియంట్‌ను కూడా పొందనుంది. ఇది కుటుంబ ప్రయాణాలతో పాటు, వ్యాపార సూవలకు,షేర్ రైడింగ్ సేవలకి మరింత అనుకూలంగా మారుతుంది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన ధరలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు. 2025 మారుతీ సుజుకీ ఈకో గతంలో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో మాత్రమే వచ్చిందీ, ఇప్పుడు అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా రావడం విశేషం.

సేఫ్టీలోనే కాకుండా సీటింగ్ కాపాసిటీ పరంగా కూడా దీనిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 7 సీట్ల వేరియంట్‌ను నిలిపివేసి, దాని స్థానంలో కొత్తగా 6 సీట్ల వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 5 సీట్ల వేరియంట్‌తో పాటు, ఈ కొత్త 6 సీట్ల ఎంపిక కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వచ్చే ఈ 6 సీట్ల మోడల్‌లో మరో ప్రత్యేకత ఉంది.
మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తాయి. ఇవి ప్రయాణికులకు మరింత కంఫర్ట్, వ్యక్తిగత స్థలం అందించేందుకు వీలుపడతాయి. ఎక్స్‌టీరియర్ చూసినట్లయితే ఎలాంటి కొత్త మార్పులు కనిపించడం లేదు. మునుపటి మోడల్ మాదిరిగా హాలోజన్ హెడ్‌లైట్లు, హాలోజన్ టెయిల్ లైట్లు, అలాగే కవర్లు లేని 13 అంగుళాల స్టీల్ వీల్స్ అందించడం జరిగింది.

లోపలి భాగంలో సేఫ్టీ పరంగా ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వడం మినహా ఎలాంటి కొత్త అప్‌డేట్స్ చూడకపోవచ్చు. ఇంటీరియర్ డిజైన్‌లో, బేసిక్ డాష్‌బోర్డ్, బ్లాక్ AC వెంట్లు, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా మోనోటోన్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (MID) తో కూడిన సెమీ-డిజిటల్ క్లస్టర్ ఉంది, హీటర్‌తో కూడిన మాన్యువల్ AC ఉన్నాయి. క్యాబిన్ లైట్స్, విండోలు మాన్యువల్‌గా పనిచేసే విధంగా ఉంటాయి.
సేఫ్టీ పరంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD),యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ప్రయాణీకులకు 3-పాయింట్ సీట్ బెల్టులు, సీట్ బెల్ట్ రిమైండర్ ఫర్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి కీలక భద్రతా ఫీచర్లు మారుతీ సుజుకీ ఈకోలో ఉన్నాయి. అంతకుముందు ఉన్న ఈకో స్టాండర్డ్ (O) 5-సీటర్ ధర రూ. 5.44 లక్షలు, AC (O) 5-సీటర్ రూ.5.80 లక్షల ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








