వచ్చేసింది బాస్..! ఈ కారులో ఎలాంటి భయం లేకుండా వెళ్లొచ్చు.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 28 కి.మీల మైలేజ్‌

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) దేశీయంగా మరింత పట్టు సాధించడానికి తన ప్రసిద్ధ మోడళ్లను ప్రస్తుత ఏడాదిలో వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా కంపెనీ తాజాగా 2025 వెర్షన్ గ్రాండ్ విటారాను(Grand Vitara) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే SUV విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మోడల్, తాజా అప్‌డేట్‌‌లో భాగంగా పలు ముఖ్యమైన మార్పులతో వినియోగదారుల కోసం మరోసారి వచ్చింది. ఈసారి ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి టాప్-ఎండ్ వేరియంట్లకే పరిమితమైన 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా (స్టాండర్డ్) అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చింది.

2025 మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ధర రూ. 11.42 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. తాజా అప్‌డేట్‌లో, కొత్త టెక్నాలజీలు, కంఫర్ట్ ఫీచర్లు వంటి వాటి విషయంలో మరింత నాణ్యతను తీసుకురావడమే కాకుండా, అన్ని వేరియంట్లకు సమానంగా అందించారు. సేఫ్టీలోను ముందుండే కారుగా ఇది మార్కెట్‌లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. కొత్త గ్రాండ్ విటారాలో ప్రయాణికుల సేఫ్టీ కోసం డజన్ల కొద్ది అత్యుత్తమ ప్రమాణాలను అందించారు.

Grand Vitara 2025 Model

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ABS (యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ హోల్డ్ అసిస్ట్, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. ప్రయాణికులంతా మరింత సురక్షితంగా ప్రయాణించేందుకు ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, పిల్లల కోసం ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ పలు ఇతర ఆప్షన్స్ ఈ కారులో ఉంటాయి.

అంతేకాదు, 2025 మోడల్ ఇయర్‌కు చెందిన ఈ అప్‌డేట్‌లో, మారుతీ తన SUV లైనప్‌లో 18 వేరియంట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వినియోగదారులకు మరిన్ని వేరియంట్లను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తన ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇవ్వడానికి కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.16.99 లక్షలుగా ఉంది. దీనిలో డెల్టా+, జీటా+, ఆల్ఫా+, జీటా+ (O),ఆల్ఫా+ (O) వేరియంట్స్ ఉన్నాయి.

Maruti Suzuki 2025 Grand Vitara

అదనంగా, 1.5-లీటర్ పెట్రోల్ AWD వేరియంట్‌లోని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ స్థానంలో కొత్తగా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో భర్తీ చేయడం విశేషం. అలాగే, కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, గ్రాండ్ విటారా జీటా (O), జీటా ప్లస్ (O), ఆల్ఫా (O), ఆల్ఫా ప్లస్ (O) వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను ఐచ్ఛికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

అలాగే, ఈ మిడ్-సైజ్ SUVలో 8-వే డ్రైవర్ పవర్డ్ సీటు, కొత్త LED క్యాబిన్ లాంప్స్, 6AT వేరియంట్లకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టం, వెనుక రియర్ డోర్ సన్‌షేడ్‌లు , pm 2.5 డిస్ప్లేతో ఆటో ప్యూరిఫై సిస్టం, కొత్త R17 ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ ఇచ్చింది. ఈ అల్లాయ్ వీల్స్ కారు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Maruti Suzuki 2025 Grand Vitara 6 Airbags

గ్రాండ్ విటారా ఇతర ఫీచర్స్‌ను చూసినట్లయితే హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీ అనుకూలంగా ఉండేటటువంటి 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటానికి వెంటిలేటెడ్ సీట్లు, 360-వ్యూ కెమెరా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం క్లారియన్‌తో కూడిన ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. బూట్ స్పేస్‌ 373 లీటర్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 9, 2025, 10:50 [IST]
English summary
Maruti suzuki 2025 grand vitara model launched with 6 airbags starting price at rs 11 42lakh
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+