ఈ కారు ఉంటే బస్సు, రైలు ఎక్కాల్సిన అవసరమే లేదు! రెండు ఫ్యామిలీలకు బెస్ట్.. 27 కి.మీ మైలేజీతో సేల్స్‌లో హవా
భారతీయ వినియోగదారులకు ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లంటే చాలా ఇష్టం. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కుటుంబ ప్రయాణికులకు అనుగుణంగా ఉండే 7 సీటర్ కార్లను విడుదల చేయడంలో బాగా ప్రసిద్ధ చెందింది. అలాంటి వాటిలో ఈకో (eeco) ఒకటి. ఇది బడ్జెట్ ధర, తక్కువ మెయింటనెన్స్, అందుబాటులో ఉన్న పెద్ద సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా కంపెనీ నుంచి విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 1,35,672 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం నమోదు చేసిన 1,37,139 యూనిట్ల అమ్మకాలో పోలిస్తే స్వల్పంగా తక్కువగా ఉన్నా, మార్కెట్లో ఈకోకి ఇంకా బలమైన స్థానం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.
చిన్న వ్యాపారాలకు, క్యాబ్ సర్వీసులు, కుటుంబ ప్రయాణాల కోసం ఇలా అనేక రకాలుగా ఉపయోగించడానికి రూపొందించబడిన ఈ మల్టీ పర్పస్ వాహనం, అత్యంత తక్కువ ధరలొ 7-సీటర్ ఎంపికగా పేరుగాంచింది. మారుతీ సుజుకీ అందించే నమ్మకమైన ఇంజిన్ పనితీరు, అందుబాటులో ఉన్న స్పేర్ పార్ట్స్, సేవా నెట్‌వర్క్ లాంటి అంశాలు కూడా ఈకో విజయానికి పునాది వేసాయి. SUVల హవా నడుస్తున్నా, ఈకో వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలవడం విశేషం.

మారుతీ ఈకో ఇంజిన్ విషయానికి వస్తే, ఇది క్తివంతమైన 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ VVT పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 18.76 bhp పవర్, 104 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. మరో విషయం ఏమిటంటే ఇది cngలో కూడా కొనుగోలుకు లభిస్తుంది. పెట్రోల్‌తో రన్ అవుతున్నప్పుడు లీటరుకు 19.71 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే సీఎన్‌జీలో 26.78 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
ఈ మారుతీ ఈకో నగరాల్లోనూ, హైవే రైడింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది. తక్కువ ధర కావడంతో సాధారణంగా ఫీచర్లు తగ్గిపోతాయని అందరికీ అనిపిస్తుంది. కానీ ఈకో మాత్రం ఆ ఆలోచనకు విరుద్ధంగా నిలుస్తుంది. ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉండటమే కాకుండా, అవసరమైన సేఫ్టీ, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABSతో కలిపిన EBD ఫీచర్లు కారును సురక్షితంగా మారుస్తాయి.

అంతేకాదు, స్లైడింగ్ డోర్ వలన కారులోకి ఎక్కడం, దిగడం చాలా సులభం. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు పార్కింగ్‌ను సులభతరం చేస్తాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్తగా డిజైన్ చేసిన స్టీరింగ్ వీల్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. బడ్జెట్ తక్కువగా ఉన్నాడ్రైవింగ్ అనుభవం మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉండేలా చూస్తుంది మారుతీ ఈకో. ఇది ఒక్క ఫ్యామిలీకి కాదు, వ్యాపార అవసరాలకు కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గానే నిలుస్తుంది.
మారుతీ ఈకో 3 వేరే వేరియంట్లతో పాటు ఐదు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది వ్యక్తిగత అవసరాల నుంచి, వాణిజ్య ప్రయోజనాల వరకు అన్ని రకాల కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ. 5.44 లక్షల నుండి టాప్ వేరియంట్ రూ. 6.70 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ నగరాలను బట్టి మారుతుంది.

పెట్రోల్, CNG వేరియంట్లు అందుబాటులో ఉండటంతో పాటు, ఇందులో స్థలం,ఫీచర్స్ కూడా ఉండటం కారణంగా ఇది విజయవంతంగా అమ్మకాల్లో ముందుకు సాగుతుంది. తక్కువ ధరలో 7 సీట్ల వాహనంగా నిలుస్తుంది. పెద్ద కుటుంబాల కోసం మారుతీ ఈకో మోడల్ అత్యుత్తమైన ఎంపికగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








