పేదలు-మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కారు.. అరకోటి మంది కొన్నారు.. రెండు తరాలు చూసింది

మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సాధారణ ప్రజల కలల కారు. ఒకప్పుడు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రారాజుగా నిలిచిన ఈ చిన్న కారు, భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక లెజెండ్‌గా గుర్తింపు పొందింది. మారుతి 800 తన కాలంలో ప్రజలకు చవకగా, నమ్మకంగా లభించే వాహనం అయితే, దాని స్థానంలోకి వచ్చిన ఆల్టో మరింత ఆధునికంగా, అందరికీ చేరువగా నిలిచింది. ఈ చిన్న కార్ ఆవిష్కరణతోనే మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత కారు అనే కలను నిజం చేసుకున్నాయి. ఆల్టో విడుదలైన మొదటి రోజునుండి ప్రజలలో ఏదో ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించింది. కాంపాక్ట్ సైజ్, తేలికైన డిజైన్, తక్కువ ఇంధన వినియోగం, ఇవన్నీ ఈ కారును సాధారణ వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా తీర్చిదిద్దాయి.

నగర రహదారుల నుండి గ్రామీణ వీధుల వరకు ఎక్కడ నడిపినా, ఆల్టో తన పనితీరుతో, మైలేజ్‌తో ఆకట్టుకుంది. తక్కువ ధర, మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉండటం వలన ప్రతి ఇంటికి సులభంగా చేరింది. అందుకే దీన్ని చాలా మంది ప్రేమగా లార్డ్ ఆల్టో అని పిలిచారు. ఈ కారు మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి తన క్లాస్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మొదటిసారిగా 2000 సెప్టెంబర్‌లో భారతదేశంలో ఆల్టో ప్రవేశించింది.

Maruti Suzuki Alto Achieves 47 Lakh Units Sales In India After Its 2000 Debut

అప్పటినుండి వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 8 సంవత్సరాల వ్యవధిలోనే, 2008 ఫిబ్రవరిలో 10 లక్షల అమ్మకాల మార్కును దాటింది. ఇది మారుతి ఆల్టో విజయగాథలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ రోజు వరకూ మొత్తం 47 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడవడం ద్వారా ఆల్టో తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. కేవలం అమ్మకాల రికార్డులకే కాదు, భావోద్వేగ స్థాయిలో కూడా ఈ కారు కోట్లాది భారతీయుల మనసును గెలుచుకుంది.

చాలా మంది తమ జీవితంలో తొలి కారుగా ఆల్టోనే ఎంచుకున్నారు. ఒక సాధారణ వాహనం మాత్రమే కాదు, కుటుంబంతో కలిసి మొదటి ప్రయాణం, కొత్త ఆరంభానికి ప్రతీకగా మారింది. మారుతి ఆల్టో అనే పేరు ఇప్పుడు భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక చిహ్నంలా నిలిచిపోయింది. కాలం మారినా, కొత్త మోడళ్లు వచ్చినా, ఈ చిన్న కారు అందించిన విశ్వాసం, సౌకర్యం, ఆర్థిక లాభం.. ఇవన్నీ దానిని ఎప్పటికీ ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Maruti Suzuki Alto Achieves 47 Lakh Units Sales In India After Its 2000 Debut

మారుతి ఆల్టో ప్రారంభ దశలో మొదటిసారిగా ఈ కారు 796 సిసి మరియు 1.0-లీటర్ ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది. వీటిలో 796 సిసి ఇంజన్ సాధారణ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన, మైలేజ్ ఆధారిత ఎంపికగా నిలిచింది. 1.0-లీటర్ వేరియంట్ మాత్రం కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే డ్రైవర్స్ కోసం సరిపోయేలా రూపొందించబడింది. అయితే కాలక్రమేణా, 2023లో ఆల్టో 800 మోడల్‌ను నిలిపివేసింది.

ప్రస్తుతం ఆల్టో 1.0-లీటర్, మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 67 bhp పవర్, 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది, పెట్రోల్ వేరియంట్‌తో పాటు, ఆల్టో CNG ఆప్షన్‌తో లభిస్తుంది. ఆల్టో పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.90 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తే, CNG వెర్షన్ ఒక్క కిలోగ్రామ్ గ్యాస్‌తో 33.40 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు.

Maruti Suzuki Alto Achieves 47 Lakh Units Sales In India After Its 2000 Debut

ఇది చిన్న కారు అయినప్పటికి సేఫ్టీలో మేటీగా ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వచ్చే ఈ చిన్న కారు, అన్ని వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)తో కూడా వస్తుంది. కాబట్టి, భద్రత గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్టో K10 భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా కొనుగోలు చేయగలిగేలా అందుబాటు ధరలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 8, 2025, 11:22 [IST]
English summary
Maruti suzuki alto achieves 47 lakh units sales in india after its 2000 debut
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+