కేవలం రూ.4.23 లక్షలకే కొత్త కారు.. 34 కి.మీ మైలేజీని ఇస్తుంది! ఎంతమంది కొన్నారో తెలిస్తే షాక్!
భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో దొరికే, మంచి మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇలాంటి అంచనాలను చాలా సమర్థంగా తీర్చుతూ, ఎన్నో ఏళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచాయి. తక్కువ ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, ఇంధన పొదుపు వంటి కారణాల వల్ల వీటికి మంచి ఆదరణ లభించింది. కానీ, ఇటీవలి కాలంలో భారతీయ వినియోగదారుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అనే పాత ప్రమాణాలతోనే కస్టమర్లు సంతృప్తి చెందడం తగ్గిపోయింది. కారులో సౌకర్యం, సేఫ్టీ, ఆధునిక ఫీచర్లు, డిజైన్ ఆకర్షణ వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
డిజిటల్ కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, అధునాతన సేఫ్టీ ఫీచర్లు లాంటి అంశాలను కలిగి ఉన్న వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బహుశా కొన్నిహ్యాచ్‌బ్యాక్ కార్లకు విక్రయాల్లో కొంత వెనకడుగు వేయించాయి. తాజాగా విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, మారుతీ సుజుకీ ఆల్టో కె10 (Alto K10) కారుకి ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇటివలి అమ్మకాల్లో దీన్ని తక్కువ మంది కొనుగోలు చేశారు.

2025 మొదటి ఐదు నెలల్లో అంటే, జనవరి నుంచి మే వరకు కేవలం 40,336 యూనిట్లే అమ్ముడుపోయాయి. ఇది గత గణాంకాలతో పోలిస్తే తగ్గుదలేనని చెప్పాలి. నెలల వారీగా అమ్మకాలను చూసినట్లయితే, జనవరిలో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌కు మంచి ఆదరణ లభించింది. ఒక్క నెలలో 11,352 యూనిట్లు అమ్ముడవడం మొదట్లో విశేష విజయాన్ని సూచించింది. అయితే ఈ జోరు ఎక్కువకాలం నిలువలేదు.
ఫిబ్రవరిలోనే అమ్మకాల సంఖ్య గణనీయంగా తగ్గి 8,541కి పరిమితం అయింది. నెల రోజుల వ్యత్యాసంలో దాదాపు 3 వేల యూనిట్ల తేడా రావడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మార్చిలో మాత్రం కొంత ఊరట కనిపించింది. ఈ కారుకు కొంచెం పుంజుకొని 9,867 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇది కొంత సానుకూల సంకేతమని భావించినా, సాధారణ స్థిరత్వం అందకోలేదని గణంకాలను చూస్తేనే తెలుస్తుంది.

కానీ ఆ తర్వాతి కాలంలో ఆల్టో K10 మరింత సవాళ్లను ఎదుర్కొంది. ఏప్రిల్ నెలలో అమ్మకాలు మళ్లీ క్షీణించాయి. కేవలం 5,606 యూనిట్లే డీలర్ల నుంచి బయటకు వెళ్లాయి. ఇది గత నెలతో పోలిస్తే దాదాపు సగం విక్రయాల వరకు పడిపోవడమే. ఈ పడిపోవడం తక్షణ ప్రభావానికి పరిమితం కాకుండా, మే నెలలో మరింతగా తీవ్రమైంది. మేలో కేవలం 4,970 యూనిట్లే అమ్ముడవడం, వినియోగదారుల ఆకాంక్షలు మారుతున్నాయని స్పష్టంగా సూచించింది.
ఇలా వరుసగా నెలల విక్రయాల్లో తేడాలు, తగ్గుదలలు కనిపించడం, మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్ల పోటీ కారణంగా ఇది వాటికి ఎదురుగా నిలబడలేకపోయింది. వినియోగదారులు ఇప్పుడు కేవలం తక్కువ ధర, మైలేజ్‌కి పరిమితం కాకుండా, ఆధునిక ఫీచర్లు, డిజైన్, సురక్షత వంటి అంశాలను మరింత ప్రాధాన్యంతో చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఆల్టో K10 అమ్మకాలపై పడిన ప్రభావానికి కారణమయ్యాయి.

మొత్తం మీద,2025 మొదటి 5 నెలల్లో 40,336 మారుతీ సుజుకీ ఆల్టో K10 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఆల్టో K10 ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.4.23 లక్షలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర కూడా రూ.6.21 లక్షలు మాత్రమే.పెట్రోల్/మాన్యువల్ ఇంజిన్ లీటరుకు 24.39 కి.మీ మైలేజీని అందిస్తుంది, పెట్రోల్/ఆటోమేటిక్ 24.90 కి.మీ మైలేజీని అందిస్తుంది. CNG/మాన్యువల్ ఇంజిన్ మైలేజ్ 33.85 కి.మీలుగా ఉంది.


Click it and Unblock the Notifications








