డాక్టర్లు, ఇంజనీర్లు ఇష్టపడే కారు! రూ.4.23 లక్షలు.. 34 కి.మీ మైలేజ్.. ఒక్క సంవత్సరంలోనే నమ్మకం కోల్పోయిందా?
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి నుంచి విడుదలయ్యే కార్లకు ప్రజల నుంచి ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయగలిగే విధంగా తక్కువ ధరలో ఈ కంపెనీ కార్లు అందుబాటులో ఉంటాయి. పైగా ఫీచర్స్ కూడా బొలేడు ఉంటాయి. అందకే మార్కెట్లో అమ్ముడుపోతున్న 10 కార్లలో కనీసం 6 వరకు మారుతి కార్లే ఉంటాయి. ఇదిలా ఉంటే జూన్ నెల ముగిసిన తరువాత వాహనాల తయారీదారులు వరుసగా తమ మోడళ్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంటారు. ఇదే క్రమంలో మారుతి తన ప్రసిద్ధ హ్యచ్‌బ్యాక్ మోడల్ ఆల్టో K10 (Alto K10) సేల్స్‌ను వెల్లడించింది.
మధ్యతరగతి వినియోగదారుల మనసు దోచిన హ్యాచ్‌బ్యాక్, ధర, మైలేజ్‌లో మినిమమ్ మెయింటెనెన్స్ అన్నీ కలిపి ఓ పూర్తి ప్యాకేజీలా వెలిగిన ఈ చిన్న కారు, ఇప్పుడు అమ్మకాల పరంగా కాస్త వెనుకబడుతోంది. 2025 జూన్ నెలలో ఆల్టో తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఈ నెలలో కేవలం 5,045 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 7,775 కార్లతో పోలిస్తే, ఇది 35.11 శాతం తగ్గుదల.

అంటే ఏడాదిలో అమ్మకాల పరంగా ఓ గణనీయమైన వెనకడుగు పడింది. అంతేకాదు, ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అంటే జనవరి నుంచి మే వరకు కూడా ఆల్టో అమ్మకాల్లో స్ధిరత్వం కనిపించలేదు. ఒకసారి ఎక్కువ, మరోసారి తక్కువ అమ్మకాలు నమోదవుతున్నాయి. ఈ ఐదు నెలల్లో మొత్తం 40,336 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాన్ని పూర్తిగా చూస్తే, నెలకు సగటున 8,000 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది.
మొత్తంగా చూస్తే, మారుతి ఆల్టో K10 ఒకప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా అందర్నీ ఆకర్షించినా.. ప్రస్తుత మార్కెట్ పోటీ, వినియోగదారుల అభిరుచుల మార్పు, బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్ల ఎంట్రీ వంటి అంశాలు దీని అమ్మకాలను ప్రభావితం చేసినట్టే అనిపిస్తోంది. తక్కువ ధర, మంచి మైలేజ్‌తో మొదటి సారి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్. ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారు ఎక్కువగా దీనిపైనే ఆసక్తి చూపిస్తారు.

మారుతి సుజుకి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండటం వల్ల, బడ్జెట్‌ను అధిగమించకుండా కారు కలను నెరవేర్చుకోవచ్చు. ఈ కారు మూడు వేరియంట్లలో LXI, VXI, VXI ప్లస్ రూపంలో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలను బట్టి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇంజిన్ పరంగా చూస్తే, ఆల్టో K10 రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందిస్తోంది.
మొదటిది 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 65.71 PS శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ 24.90 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది, ఇది నిజంగా బేసిక్ యూజర్లకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంకో వైపు, ఫ్యూయల్ ఖర్చులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి CNG వేరియంట్ కూడా ఉంది.

అదే 1-లీటర్ ఇంజిన్ CNG ఫ్యూయల్‌తో 56.70 PS పవర్, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. దీని మైలేజ్ మెయిన్ అట్రాక్షన్, ఇది 33.85 కిలోమీటర్లకు పైగా ఇస్తుంది. ఐదు మంది గల కుటుంబం గల వారు ఈ కారులో హాయిగా ప్రయాణించవచ్చు. సేఫ్టీకి 6 ఎయిర్‌బ్యాగులు, ESP, 3-పాయింట్ సీట్ బెల్టులు వంటి వాటిని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








