34 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ధర కేవలం రూ. 4 లక్షలు మాత్రమే! గత నెలలో ఎంత మంది కొన్నారో తెలుసా..

భారత అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) పేద, మధ్య తరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా తక్కువ ధరలో కార్లను విడుదల చేయడంలో చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుబాటు ధరలో మంచి కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ కంపెనీకి చెందిన మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల మారుతీ వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ ఆల్టో కె10 (Alto K10)కు సంబంధించి 2025 జనవరి సేల్స్ డేటాను వెల్లడించింది. మారుతీ వెల్లడించిన దాని ప్రకారం, ఈ కారు అమ్మకాలు ఈ నెలలో 11,352 యూనిట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇదే కంపెనీ చెందినటువంటి ఆఫ్‌రోడ్ కింగ్ జిమ్నీ, S-ప్రెస్సో, సెలెరియో వంటి మోడళ్ల కంటే కూడా ఆల్టో కారు మెరుగైన సేల్స్ సాధించడం గమనార్హం.

మారుతీ సుజుకీ ఆల్టో కె10 దేశంలో తక్కువ ధరలో లభించే కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు కారును ఉండాలనే కోరికను ఇది చాలా వరకు తీర్చింది. కేవలం ఇది బడ్జెట్ ధరలో లభించడం మాత్రమే కాకుండా ఇది మైలేజ్ పరంగా అదిరిపోయే మోడల్. ఈ కారు పెట్రోల్, CNG ఆప్షన్లలో కొనుగోలుకు ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు దాదాపు 25 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది.

Alto K10 January 2025 Sales Report

అదే CNG అయితే ఏకంగా 34 కి.మీల వరకు ఇస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆల్టో కె10 రూ.4.09 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలుకు లభిస్తుంది. అదే దీనిలో టాప్ వేరియంట్ ధర దీని కంటే మరింత ఎక్కువగా రూ. 6.05 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే వివిధ పన్నులు, ఇన్సురెన్స్‌తో కలిపి ఇంకా ఎక్కువ అమౌంట్ పడుతుంది.

భారతీయ మధ్యతరగతి వినియోగదారులకు మారుతీ ఆల్టో కె10 ఫేవరెట్ మోడల్. దేశంలో చాలా ఏరియాల్లో ఈ ప్రసిద్ధ మోడల్ కనిపిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.4.09 లక్షలుగా ఉన్నప్పటికి పండగల సమయంలో కంపెనీ, డీలర్లు అందించే ప్రత్యేక తగ్గింపుల ద్వారా కస్టమర్లు కారును మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇది నాలుగు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగాదారులు తమ అవసరానికి అనుగుణంగా నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు.

Maruti Suzuki Alto K10 Sales Report

ఆల్టో కె10 (Alto K10) 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 66 bhp పవర్, 89 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను జోడించారు. అదే CNG ఇంజిన్ ఎడిషన్‌ను కావాలనుకున్న వారు దాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

లోపల ప్రయాణికులకు అవసరమయ్యే ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఎయిర్ కండిషనింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఎయిర్ కండిషనింగ్, సర్దుబాటు చేయగల సెట్టింగ్‌లతో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, సెంటర్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఇతర పలు ఫీచర్స్‌ను మారుతీ ఆల్టో కె10 (Alto K10)లో అందించారు.

Maruti Suzuki Alto K10 January 2025 Sales Report

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2025, 15:00 [IST]
English summary
Maruti suzuki alto k10 january 2025 sales report details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+