దేశంలో అందరి ఫేవరెట్ రూ.4.23 లక్షల కారు.. ఇకపై 6 ఎయిర్‌బ్యాగులు, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్‌తో మరింత సురక్షితం

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారతీయ వినియోగాదారులకు తక్కువ ధరలో కార్లను అందించడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. దేశంలో చాలా ప్రసిద్ధ మోడళ్లను విక్రయిస్తూ, అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉన్న మారుతీ తన కార్లలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన ప్రమాణాలను అందిస్తుంది. తాజాగా కంపెనీ ఇండియాలో ఫేమస్ మోడల్ అయినటువంటి ఎంట్రీ లెవల్ ఆల్టో K10 (Alto K10) కారును కొత్తగా అప్‌డేట్ చేసి తిరిగి మార్కెట్లోకి అమ్మకానికి తీసుకొచ్చింది. సాధారణంగా దేశంలో పేద-మధ్య తరగతి వారు తక్కువ ధరలో కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారికి మారుతీ ఆల్టో K10 సరైన ఆప్షన్. ఇప్పుడు మరింత కొత్తగా అప్‌డేటేడ్ ఫీచర్స్‌తో వచ్చిన ఎంట్రీ వేరియంట్‌ను జనాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కొత్తగా తన ఎంట్రీ లెవల్ ఆల్టో K10 కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ప్రధానంగా మెరుగైన సేఫ్టీ ప్రమాణాలతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఎంట్రీ లెవల్ కారులో కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించింది. అలాగే, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+ (ESP),వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్టులు వంటివి ఇప్పుడు ఈ కారులో ఉన్నాయి.

Maruti Suzuki Alto K10 Updated With 6 Airbags

ఇంకా, వెనుక డోర్ చైల్డ్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్‌ల్యాంప్ లెవలింగ్, ఎక్కువ వేగంతో వెళ్తుంటే హెచ్చరించే ప్రత్యేక అలర్గ్ సిస్టం, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, హై-మౌంటెడ్ స్టాప్ లాంప్ వంటి దాదాపు 15కు పైగా అధునాతన సేఫ్టీ ఫీచర్స్‌ను ఈ కారులో అందించారు. ఇన్ని భద్రతా ప్రమాణాలతో వచ్చిన ఎంట్రీ లెవల్ వేరియంట్ ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారికి ఎలాంటి అపాయం కలగకుండా రక్షణ అందిస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్‌ను మాత్రమే కాకుండా ఇంటీరియర్‌ను సైతం కొత్తగా మార్చారు. కొత్త మారుతీ ఆల్టో K10 కారులో 4 స్పీకర్ ఆప్షన్‌‌తో కూడిన లేటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు. దీంతో ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. ఈ కారు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎక్స్‌టీరియర్‌లో సుజుకి బ్యాడ్జ్‌, ఫ్రంట్ బంపర్ కొత్త గ్రిల్ మొదలుగు వాటిని కలిగి ఉంది.

Maruti Suzuki New Alto K10

ఈ కారులో 5 మంది కలిసి సులభంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది 214 లీటర్ల బూట్ స్పేస్‌తో వచ్చింది. మారుతీ ఆల్టో K10‌ను కొత్తగా అప్‌డేట్ చేసిన నేపథ్యంలో దీని ధరను రూ.16,000 వరకు పెంచారు. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.4.23 లక్షలు, అదే టాప్ వేరియంట్ విషయానికి వస్తే రూ.6.21 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ ఎక్కువగా ఉంటుంది.

ఇది రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌, 67 bhp పవర్, 89 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. CNG విషయానికి వస్తే, 56 bhp పవర్, 82 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 33.85 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

Maruti Suzuki Alto K10 6 Airbags

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 2, 2025, 11:00 [IST]
English summary
Maruti suzuki alto k10 updated with 6 airbags its starting price rs 4 23 lakh
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+