ఇదే చివరి ఛాన్స్! కారు కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే కొనేయండి.. కొద్ది రోజుల్లో మారుతీ ధరలు పెరుగుతున్నాయి
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ(maruti suzuki) పేద, మధ్య తరగతి వినియోగదారులకు టార్గెట్ చేసి తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో కంపెనీ దేశీయ వినియెగదారులకు వరుసగా షాక్‌లు ఇస్తుంది. ఇంత కాలం అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ధరలో కార్లను తీసుకొచ్చిన మారుతీ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఏప్రిల్ 1, 2025 నుండి తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించి వినియోగదారులకు పెద్ద షాకిచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు ధరలు పెంచిన కంపెనీ ఇప్పుడు మరోసారి ధరల పెంపుదలను ప్రకటించడం గమనార్హం. ఈ ధరల పెంపు వివిధ మోడళ్లను బట్టి 4 శాతం వరకు ఉంటుందని మారుతీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం, ద్రవ్యోల్బణం ఇతర ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో వీటిని తగ్గించుకోవడానికి ఖర్చుల భారాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్లపై మోపాల్సిన పరిస్థితి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో, 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ. 1,500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈసారి కూడా ధరలు అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉందని సమాచారం.

జనవరిలో కూడా మారుతి తన కార్ల ధరలను 4 శాతం పెంచింది. కేవలం నెలల వ్యవధిలోనే రెండో సారి ధరలు పెంచడంపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. కస్టమర్లపై భారాన్ని తగ్గించేందుకే కంపెనీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతీ తన వివరణను ఇస్తుంది. ఏది ఏమైనప్పటికి వచ్చే నెల నుంచి మారుతీ కార్లు మరింత ప్రీయం కానున్నాయి.
ఏప్రిల్‌లో తన కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న తరువాత కంపెనీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగాయి. ఈ ధరల పెంపుదల 4 శాతం వరకు ఉంటుందని వెల్లడించినప్పటికి ఇది ప్రతి మోడల్‌కు వేరు వేరుగా ఉంటుంది. ఏ మోడల్‌కు ఎంత మేరకు ధర పెరుగుతుందో మారుతీ ఇంకా వెల్లడించలేదు. దీని గురించిన మరిన్ని వివరాలను మరికొద్ది రోజుల్లోనే వెల్లడించనుంది.

మారుతీ ప్రస్తుతం దేశంలో డజనుకు పైగా కార్లను విడుదల చేస్తోంది. వీటిలో ప్రసిద్ధ మోడళ్లు చాలా ఉన్నాయి. ఈ కంపెనీ ప్రతి ఏడాది కూడా ఇండియాలో అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. వ్యాగన్ ఆర్, ఆల్టో కె10, డిజైర్, స్విఫ్ట్, బాలెనో, ఈకో, జిమ్నీ, సెలెరియో, సియాజ్, ఎక్స్‌ఎల్6, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఇగ్నిస్ వంటి పలు ప్రసిద్ధ మోడళ్లను విక్రయిస్తుంది.
కొత్తగా మారుతీ కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు వీలైనంత తొందరగా ఏప్రిల్ నెల రాకముందే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే ఈ నెల ముగియడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే మీకు నచ్చిన మారుతీ కొనడం ద్వారా భారీ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








