మరో రెండ్రోజులు మాత్రమే.. చౌక కార్లు వెతికినా దొరకవు.. భారీగా పెరగనున్న కార్ల ధరలు

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు ఎప్పటి మాదిరే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీనిని భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి మొదట ప్రారంభించింది. మారుతి సుజుకి తన కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది ఇండో-జపనీస్ ఆటోమేకర్ ధరలను పెంచడం ఇది మూడోసారి. ఈసారి ధరల పెరుగుదల వేరియంట్ బట్టి 4% వరకు ఉంటుందని సమాచారం. ఈ ధరల పెరుగుదల అన్ని కార్ మోడళ్లకు వర్తిస్తుందని భావిస్తున్నారు. ఇది అరీనా, నెక్సా డీలర్‌షిప్‌లలో కార్ల ఎక్స్-షోరూమ్ ధరలలో కూడా కనిపిస్తుంది. ధరల పెరుగుదల ఏ మారుతి సుజుకి మోడల్స్ లలో ఎక్కువగా కనిపిస్తుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Marito Alto

ఆల్టో K10 అనేది మారుతి సుజుకికి చెందిన ఎంట్రి లెవల్ కారు మోడల్. ప్రస్తుతం ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుంచి రూ.6.21లక్షల వరకు ఉంది. గరిష్ట ధర పెరుగుదల 4 శాతం అయితే ఈ కారు ధర కొత్తగా కొనాలంటే రూ. 16,920 నుంచి రూ. 24,840వరకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫలితంగా కారు కొత్త ధర రూ.439,920 నుంచి రూ.645,840 వరకు పెరుగుతుంది.

ఎక్స్ ప్రెస్సో అనేది మారుతి విడుదల చేసిన మరో చిన్న కారు. ఈ కారు ప్రస్తుత ధర రూ.4.27 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు ఉంది. ఈ కారు ధర రూ.17,080 నుంచి రూ.24,480 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉంది.

Celerio

4శాతం పెరుగుదల ఉంటే రూ.21,480 నుంచి రూ.28,400 వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొత్త ధర తర్వాత, సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 558,480 నుంచి రూ. 738,400 వరకు ఉంటుంది. మారుతి విడుదల చేసిన ఏకైక వ్యాన్ ఇకో. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ. 5.44 లక్షల నుంచి రూ. 6.91 లక్షల వరకు ఉంది. ఈ ధర రూ.21,760 నుంచి రూ.27,640కి పెరగవచ్చు.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మారుతి కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ప్రస్తుత ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 7.48 లక్షల వరకు ఉంది. 4% పెరుగుదల అమల్లోకి వస్తే కొత్త వ్యాగన్ఆర్ కొనుగోలు చేసే వినియోగదారులు రూ.22,600 నుంచి రూ.29,920 వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ధరలు రూ.587,600 నుంచి రూ.777,920 వరకు ఉంటుందని అంచనా.

Baleno Price

మారుతి నుంచి వచ్చిన మరో చిన్న కారు. మారుతి కాంపాక్ట్ అర్బన్ SUV అని పిలిచే నెక్సా మోడల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.85 లక్షల నుంచి రూ.8.12లక్షల వరకు ఉంది. 4% పెరుగుదల తర్వాత దాని ధర దాదాపు రూ. 23,400 పెరిగి రూ.32,480కి చేరుకుంటుంది. అందువల్ల, ఈ కారు ధరలు ఏప్రిల్ 1 తర్వాత రూ. 608,400నుంచి రూ. 844,480మధ్య ఉంటుందని అంచనా.

మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పాపులర్ మోడల్ బాలెనో ప్రస్తుత ధరలు రూ. 6.70 లక్షల నుంచి రూ. 9.92 లక్షల వరకు ఉంది. ఎక్స్-షోరూమ్ ధరలో కూడా ఇదే విధమైన 4 శాతం పెరుగుదల నమోదైతే దాదాపు రూ. 26,800 నుంచి రూ. 39,680 వరకు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ ధర పెంపు తర్వాత, ఈ కారు రూ.696,800నుంచి రూ.10,31,680 మధ్య అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది.

Grand Vitara

ప్రముఖ కాంపాక్ట్ SUV, ఫ్రాంక్స్ ప్రస్తుతం రూ.7.52లక్షల నుంచి రూ.12.88 లక్షల ధరల మధ్య అమ్ముడవుతోంది. ఏప్రిల్‌లో ధరల పెరుగుదల దాదాపు 30,080 నుంచి 51,520వరకు ఉంటుందని అంచనా. ఫలితంగా, ఈ కారు ధర దాదాపు రూ. 7,82,080 నుంచి రూ. 13,39,520 వరకు ఉండే అవకాశం ఉంది. సియాజ్ అనేది మారుతి విడుదల చేసిన ఒక మిడ్ సైజు సెడాన్. ఈ కారు త్వరలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కారు కొనడానికి రాబోయే కొద్ది నెలలు మాత్రమే చివరి అవకాశం. సియాజ్ కారు ప్రస్తుత ధర రూ.9.42 లక్షల నుంచి రూ.12.31 లక్షల వరకు ఉంది. అంచనా ధర పెరుగుదల తర్వాత రూ. 37,000 నుంచి రూ. 49,000 వరకు ఉంటుంది. దీంతో ఈ కారు సవరించిన ధర రూ. 9.79 లక్షల నుంచి రూ. 12.80 లక్షలకు పెరుగుతుంది.

మారుతి విక్రయించే పాపులర్ మిడ్-సైజ్ SUV గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ కోసం రూ.19 లక్షలు ఖర్చు చేయాలి. ధరల పెరుగుదల తర్వాత హైబ్రిడ్ SUVల కొనుగోలుదారులు రూ.44,000 నుంచి రూ.79,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీవీ కొనాలని ప్లాన్ చేసుకునే వారు కూడా ధరల పెరుగుదలను భరించడానికి రెడీగా ఉండాలి.

మారుతి XL6 ఎంపీవీ ధర ప్రస్తుతం రూ. 11 లక్షల నుంచి రూ. 14.71 లక్షల మధ్య ఉంది. ధరల పెరుగుదల అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కారు ధర అదనంగా రూ. 46,000 నుంచి రూ. 58,000 వరకు ఉంటుందని అంచనా. ఫలితంగా, ఈ కారు ధర వచ్చే ఏప్రిల్ నుంచి 12 నుంచి 17 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

Ignis

థార్‎కు పోటీగా వచ్చిన జిమ్నీధర కూడా వచ్చే నెలలో పెరగవచ్చు. ప్రస్తుతం, జిమ్నీ 5-డోర్ బేస్ వేరియంట్ ధర రూ. 12.76 లక్షలు. టాప్-స్పెక్ వేరియంట్ ధర 14.81 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆఫ్-రోడర్ SUV ధర రూ. 51,000 నుంచి రూ. 59,000 మధ్య పెరుగుతుందని అంచనా. ధరల పెరుగుదల ఫలితంగా, జిమ్నీ ధర రూ. 13.27లక్షల నుంచి రూ.15.40లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఇన్విక్టో అనేది టయోటా మోడల్.. దీనిని మారుతి రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. ఇది మన దేశంలో మారుతి విక్రయించే అత్యంత ఖరీదైన కారు. ఇది ప్రీమియం ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్ వెర్షన్ ప్రస్తుత ధర రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల వరకు ఉంది. ఈ కారు ధర రూ.1.02 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

S Presso

ఏప్రిల్ 1 నుండి మారుతి ఇన్నోవా కొనడానికి ఆసక్తి ఉన్న వారుక కూడా దాదాపు రూ. 26,53,000 నుండి రూ. 30,38,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్నవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. మారుతి తన మోడల్ శ్రేణిలో ధరలను పెంచుతుందని అర్థమవుతోంది.

పైన పేర్కొన్న ధరలు మోడల్ శ్రేణి అంతటా ఏకరీతి ధర పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు ధర పెరుగుదల మోడల్‌ను బట్టి మారవచ్చు. ఇటీవల ధరల పెంపుదల ప్రకటించినప్పుడు.. కంపెనీ తక్కువ అమ్మకాలు కలిగిన జిమ్నీ, సియాజ్ మోడళ్లకు స్వల్ప ధరల పెంపును మాత్రమే ప్రతిపాదించింది.

ధరలు ఎంతమేరకు పెరుగుతాయని అధికారికంగా చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత కారు కొనాలని ప్లాన్ చేసుకునే వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రాబోయే మూడు రోజుల్లో కొత్త కారు కొంటే పాత ధరకే అది లభిస్తుంది. ఆ తర్వాత కొనుగోలు చేస్తే, మీరు కొత్త ధర చెల్లించాల్సి ఉంటుంది.

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు సవాళ్లే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. వీటిని భరించేందుకే కంపెనీలు ముందుగానే ధరల పెంపుదల ప్రకటించినందున మార్చి 2025లో మరిన్ని అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. మీరు కొత్త మారుతి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకూడనుకుంటే ఇప్పుడే కారు కొనేయండి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 30, 2025, 6:10 [IST]
English summary
Maruti suzuki announces price hike for april 2025 impact on multiple models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+