ఒక్కనెలలో కొన్ని లక్షల మంది ఈ కంపెనీ కార్లను కొన్నారు.. కార్ల మార్కెట్‌‌లో కింగ్ అంటే ఇదే

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దశాబ్దాలుగా ఈ బ్రాండ్ సాధించిన విజయాలు, కస్టమర్ల విశ్వాసం, విస్తృతమైన మోడల్ లైనప్ అన్నీ కలిపి దీన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపాయి. దేశంలోనే అతిపెద్ద ఆటోమేకర్‌గా మారుతి సుజుకి ఎప్పటికీ ఒక ప్రమాణంగా నిలుస్తోంది. ఆగస్టు 2025కి సంబంధించిన తాజా అమ్మకాల గణాంకాలు విడుదల కావడంతో మళ్లీ ఒకసారి కంపెనీ తన శక్తి ఎంత గొప్పదో చూపించింది. గత 31 రోజుల్లో ఈ బ్రాండ్ మొత్తం 1,80,683 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 1,81,782 యూనిట్లతో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదు.

దేశీయ మార్కెట్లో కొద్దిగా వెనకబడినా, ఎగుమతుల్లో మాత్రం కంపెనీ శక్తివంతమైన పెరుగుదల చూపించింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఎగుమతుల్లో 41 శాతం పెరుగుదల సాధించడం. ఇది మారుతి సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఎంత బలంగా అడుగుపెట్టిందనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. స్థానిక అమ్మకాలలో ఒక చిన్న తగ్గుదల వచ్చినా, అంతర్జాతీయ డిమాండ్ పెరగడం కంపెనీకి కొత్త ఆశలు నింపుతోంది.

Maruti Suzuki August 2025 Sales Recorded 1 80 Lakh Cars

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే, టాటా, మహీంద్రా లాంటి బ్రాండ్లు ఎంత ప్రయత్నించినా, మారుతి సాధించిన స్థాయికి చేరుకోవడం సులభం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి నెలా లక్షల కార్లను విక్రయించే ఈ దిగ్గజానికి ఇతర పోటీదారులు సగం కూడా అందుకోలేకపోతున్నారు. మొత్తానికి, ఆగస్టు నెలలో దేశీయ అమ్మకాలలో కాస్త వెనుకడుగు వేసినప్పటికీ, ఎగుమతుల్లో సాధించిన ఈ భారీ వృద్ధి వల్ల మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

గత నెలలో విక్రయించిన మొత్తం సేల్స్‌లో దేశీయంగా చూస్తే, 1,34,050 కార్లు విక్రయించడం ద్వారా విస్తృతమైన కస్టమర్ బేస్‌పై కంపెనీకి ఉన్న పట్టును మళ్లీ నిరూపించింది. అదే సమయంలో, 36,538 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలోనూ బలమైన డిమాండ్ ఉందని స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా, ఎగుమతుల్లో గత ఏడాదితో పోలిస్తే 41 శాతం పెరుగుదల సాధించడం ఒక పెద్ద విజయంగా భావించబడుతోంది.

Maruti Suzuki August 2025 Sales Recorded 1 80 Lakh Cars

దీంతో పాటు, మారుతి సుజుకి ఇతర OEMలకు కూడా వాహనాలను సరఫరా చేస్తోంది. ఆగస్టులో ఈ విభాగం ద్వారా 10,095 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. అంటే, మారుతి తన బ్రాండ్‌కే పరిమితం కాకుండా, ఇతర కంపెనీల ఉత్పత్తి అవసరాలను నెరవేర్చుతోంది. కంపెనీ ప్రసిద్ద మోడళ్లు ఆల్టో K10,బాలెనో, స్విఫ్ట్, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, డిజైర్, ఇగ్నిస్, సెలెరియో వంటి మోడళ్లను కలిగి ఉన్న మినీ, కాంపాక్ట్ విభాగంలో 66,450 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఇదే సమయంలో బ్రెజ్జా, ఫోర్క్స్, ఎర్టిగా,ఇన్విక్టో, గ్రాండ్ విటారా, జిమ్నీ, XL6 వంటి మోడళ్ల అమ్మకాలు 54,043 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సియాజ్ కారు ఆగస్టు 2024లో 707 యూనిట్లను మాత్రమే విక్రయించింది కానీ ఈ నెలలో ఎటువంటి అమ్మకాలను నమోదు చేయలేదు. మారుతున్న కస్టమర్ల అభిరుచుల కారణంగా గత నెలలో ఎవరు ఈ కారును కోనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

Maruti Suzuki August 2025 Sales Recorded 1 80 Lakh Cars

ఆగస్టు 2025 అమ్మకాల గణాంకాల్లో వ్యాన్, కమర్షియల్ వాహన విభాగాలు స్థిరమైన ప్రదర్శనను చూపించాయి. ఈ విభాగాల్లో పెద్దగా పోటీ లేకపోయినా, ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంది. వ్యాన్ విభాగం విషయానికి వస్తే, ఈ విభాగంలో ఉన్న ఏకైక మోడల్ ఈకో (Eeco) ఆగస్టు నెలలో 10,785 యూనిట్ల అమ్మకాలను అందించింది. వాణిజ్య వాహన విభాగంలో ఏకైక మోడల్ సూపర్ క్యారీ (Super Carry) ఆగస్టు 2025లో 2,772 యూనిట్లను విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 10:47 [IST]
English summary
Maruti suzuki august 2025 sales recorded 1 80 lakh cars details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+