ఇంత మంచి కారుని ఇప్పటి కస్టమర్లు ఎందుకు వదులుకుంటున్నారు? రూ.6.70 లక్షలకే 5-సీటర్, 30 కి.మీ మైలేజ్

భారతదేశంలో దశబ్దాల కాలంగా అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన బాలెనో (Baleno) ఒకప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో దూసుకుపోయిన పేరు. ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు కలిపి వినియోగదారులను ఆకట్టుకున్న ఈ కారు, ఇప్పుడు మాత్రం సేల్స్‌లో తగ్గుదల చూపిస్తోంది. ఇటివల కంపెనీ మే 2025కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, గత నెలలో బాలెనో కేవలం 11,618 యూనిట్లే అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో నమోదైన 12,842 యూనిట్లతో పోల్చితే సుమారు 9.53 శాతం తగ్గుదల. ప్రస్తుత మార్కెట్‌లో ఇది కొంత ఆందోళనకరమైన అంశంగా మారింది.

కేవలం ఈ ఒక్క నెల మాత్రమే కాదు, బాలెనో అమ్మకాలలో ఈ ఏడాది మొదటి నాలుగు నెలలుగా సేల్స్ సంఖ్య మారుతూ వస్తున్నాయి. జనవరిలో బలంగా ప్రారంభమైన బాలెనో సేల్స్ 19,965 యూనిట్లుగా ఉన్నా, ఫిబ్రవరిలో అవి 15,480కి తగ్గిపోయాయి. మార్చిలో ఇవి 12,357కి పడిపోవడంతో పాటు, ఏప్రిల్‌లో 13,180 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదంతా చూస్తే, బాలెనో మార్కెట్‌లో స్థిరంగా నిలబడలేక కొంత ఒత్తిడికి లోనవుతోందని స్పష్టమవుతోంది.

Maruti Suzuki Baleno Sales

ఇప్పటికీ బాలెనోకు నమ్మకమైన వినియోగదారుల మద్దతు ఉన్నా, కొత్త మోడళ్లు, పోటీ కార్లు మార్కెట్లోకి రావడం, మార్కెట్ ట్రెండ్ మారడం వల్ల అమ్మకాలపై ప్రభావం పడినట్టు అనిపిస్తోంది. ఇప్పటి ఆటోమొబైల్ మార్కెట్ ట్రెండ్ SUVల దిశగా సాగుతోంది. వినియోగదారులు ఇప్పుడు కార్ల ఎంపికలో, ప్రత్యేకంగా ఆకర్షణీయమైన బాడీ స్టైల్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను ప్రాధాన్యంగా చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో, హ్యాచ్‌బ్యాక్‌లు కొంచెం వెనక్కి తగ్గాయి. బాలెనో ధర పరిధిలోనే కొన్ని కంపాక్ట్ SUVలు, ఆకట్టుకునే అందమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లోకి రావడం, వినియోగదారుల దృష్టిని వాటివైపు మళ్లించాయి. ఈ పరిస్థితుల్లో, మారుతీ సుజుకీ మరోసారి బాలెనోను రిఫ్రెష్ చేయడం లేదా కొత్త ఆఫర్లు ప్రకటించడం ద్వారా తిరిగి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు.

Maruti Suzuki Baleno Booking

ఇక మరోవైపు, మారుతీ సుజుకీ ఫ్రాంచైజీ నుండే వచ్చిన ఫ్రాంక్స్(Fronx) వంటి కొత్త మోడల్స్ బాలెనో స్థానాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తున్నాయి. బలమైన బాడీ లైన్, SUV స్టైల్ డిజైన్, టెక్నాలజీ ఫీచర్లు కలిపి ఈ కారు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. వీటి ప్రభావం బాలెనో అమ్మకాలపై కనిపిస్తుంది. ఈ విధంగా, మారుతున్న కస్టమర్ అభిరుచులు, కాంపిటీషన్, SUVల డిమాండ్ వంటివి బాలెనో అమ్మకాల తగ్గుదల వెనక ఉన్న అంశాలు.

మారుతీ సుజుకీ బాలెనో ధర రూ.6.70 లక్షల నుంచి రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, వినియోగదారులకి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం ఎంపికగా మారింది. ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగు వేరియంట్లలో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫాలో లభిస్తుంది. ప్రతి వేరియంట్‌కి ప్రత్యేక ఫీచర్లు ఉండగా, వీటి ద్వారా వినియోగదారులకి వారి అవసరాలకు తగ్గట్లుగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తోంది.

Maruti Suzuki Baleno Design

పెర్ఫార్మెన్స్ పరంగా బాలెనో ఒక శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్‌కి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటే, ఇవి డ్రైవింగ్ అనుభూతిని సాఫీగా మార్చుతాయి. అత్యంత ఆశ్చర్యకరంగా, బాలెనో 22 నుండి 30 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదు, ఇది ఒక కారుకు మాత్రమే కాదు, చాలా బైక్‌లకూ గట్టి పోటీగా ఉంటుంది.

ఇది నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని క్యాబిన్‌లో డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD , ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2025, 13:13 [IST]
English summary
Maruti suzuki baleno 11618 sales units recorded in may 2025 details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+