రూ.5.99 లక్షలకే దేశం మెచ్చిన కారు.. 30 కి.మీ మైలేజ్.. ఇంత మంచి కారును ఎవరు వద్దనుకుంటారు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) పేరు వినగానే, ఒకే మాట గుర్తుకు వస్తుంది నమ్మకమైన హ్యాచ్‌బ్యాక్ అని. ఈ కారు కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు, మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కి ఒక ఫ్లాగ్‌షిప్ ప్రతీక. బాలెనో తన సొగసైన రూపంతో, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో, ప్రాక్టికల్ ఫీచర్లతో, భారతీయ కుటుంబాలకు ఒక ఆప్షన్ కంటే ఎక్కువగా ఒక ఎమోషన్‌గా మారింది. మారుతి సుజుకి ఎప్పుడూ తన కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన వాహనాల్లో మార్పులు చేస్తూనే ఉంటుంది. అదే కారణంగా, బాలెనో మొదటి విడుదల నుంచే మార్కెట్లో అద్భుతమైన సక్సెస్ సాధించింది. 2025 అక్టోబర్ నెలలో కూడా బాలెనో తన విజయ పరంపరను కొనసాగిస్తూ మళ్లీ అమ్మకాలలో సత్తా చూపించింది.
అక్టోబర్ 2025లో, 16,873 యూనిట్లు బాలెనో అమ్ముడవగా, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 16,082 యూనిట్లతో పోలిస్తే 5% వృద్ధిని నమోదు చేసింది. అంటే, బాలెనోపై ఉన్న ప్రజల ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి నెలా కొత్త పోటీదారులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, బాలెనో స్థిరమైన అమ్మకాలతో, SUVలకే పోటీగా నిలుస్తోంది. ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మొదటగా, 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన GST సవరణల కారణంగా బాలెనో ధర కొంత తగ్గింది. ధర తగ్గడం వల్ల మధ్యతరగతి వినియోగదారులు మరింత ఆకర్షితులయ్యారు. రెండవది, దీపావళి పండుగ సీజన్‌లో వాహన కొనుగోళ్ల ఉత్సాహం గరిష్ట స్థాయిలో ఉండటంతో, షోరూమ్‌లు బాలెనో డిమాండ్‌తో నిండిపోయాయి. SUVల ఆధిపత్యం పెరుగుతున్న కూడా, ఒక హ్యాచ్‌బ్యాక్‌గా బాలెనో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.
ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, సమర్థవంతమైన పెట్రోల్ ఇంజిన్ కారణంగా, ఇది SUVలను కూడా సవాలు చేసే స్థాయికి చేరింది. కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ, ఇంటీరియర్‌లోని స్పేస్, కంఫర్ట్ లగ్జరీ కార్ల స్థాయిలో ఉండటం వినియోగదారుల మనసు దోచుకుంది. మారుతి సుజుకి బాలెనోలో లభించే టెక్నాలజీ ఫీచర్లు కూడా దాని విజయానికి కీలక కారణం. SUVల హవా ఉన్నా, మంచి డిజైన్, నాణ్యత, విలువతో బాలెనో మంచి స్థానం పొందింది.

మారుతి సుజుకి బాలెనో కేవలం ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే కాదు, ఇది సరసమైన ధరలో లభించే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని చెప్పాలి. ధర పరంగా చూసినా, ఇది ప్రతి తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించబడింది. ఈ కారు రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో లభించగా, టాప్ వేరియంట్ రూ. 9.10 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్ - బెంగళూరు) ధరను కలిగి ఉంది.
బాలెనో నాలుగు వేరియంట్లలో సిగ్మా (Sigma), డెల్టా (Delta), జీటా (Zeta), ఆల్ఫా (Alpha)లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బాలెనోలోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అత్యంత స్మూత్‌గా పనిచేస్తుంది. ఇది 90 PS పవర్, 113 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తూ, నగర డ్రైవింగ్‌కీ, హైవే రైడ్‌కీ సరైన బేలెన్స్‌ను ఇస్తుంది.

ఫ్యూయల్ 22.35 kmpl నుండి 22.94 kmpl వరకు మైలేజీ అందించడం, రోజువారీ ప్రయాణాలు చేసే వారికి పెద్ద ప్లస్ పాయింట్. అదే సమయంలో, CNG వేరియంట్ 1.2-లీటర్ పెట్రోల్ + CNG ఇంజన్‌తో వస్తుంది, ఇది 77.5 PS పవర్, 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 30.61 km/kg వరకు ఉండటం వల్ల, ఇంధన వ్యయం తగ్గించాలని చూసే వారికి ఇది అత్యుత్తమ ఎంపికగా మారింది.


Click it and Unblock the Notifications








