30 కి.మీల మైలేజ్ ఇచ్చే కారు.. దేశంలోని ప్రజలందరికి బాగా నచ్చిన మోడల్.. అది ఏదో తెలుసా?

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న మారుతీ సుజుకీ బాలెనో చాలా కాలంగా మార్కెట్లో మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ఈ కారును తొలిసారి అక్టోబర్ 2015 చివర్లో మార్కెట్‌కి పరిచయం చేశారు. అప్పటి నుంచి బాలెనో మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. మంచి మెరుగైన మైలేజ్, లేటెస్ట్ టెక్నాలజీ, ఆకర్షణీయమై డిజైన్ కారణంగా బాలెనో ప్రతి తరానికి నచ్చుతూ వచ్చింది. అయితే ఇన్నేళ్ళ ప్రయాణంలో బాలెనో ఒక ముఖ్యమైన మైలురాయిని బాలెనో అధిగమించింది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, జూన్ 2024 నాటికి, ఈ కార్ల అమ్మకాలు 1.5 మిలియన్ల (15 లక్షల) యూనిట్లకు పైగా చేరుకున్నాయి.

భారత్‌లో ఒకే ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుకు ఇంత స్థాయిలో ఆదరణ లభించడం అరుదైన విషయం. ఇప్పుడు ఈ ఘనత సాధించి దాదాపు సంవత్సరం కావొచ్చింది, కానీ ఇప్పటికీ బాలెనో అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మారుతి సుజుకి బ్రాండ్‌కి మాత్రమే కాకుండా, భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఇది గర్వకారణం. ప్రతినెలా అమ్మకాల పరంగా అద్భుతమైన గణంకాలను సాధిస్తుంది. అందుకే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన స్థానాన్ని బలంగా స్థాపించుకుంది.

Maruti Suzuki Baleno

ఈ కారుకు భారతీయ ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగానే, ఈ మోడల్‌ను 1.5 మిలియన్ యూనిట్ల మైలురాయిని అధిగమించడానికి దోహదపడింది. ఇటీవల విడుదలైన ఏప్రిల్ 2025 అమ్మకాల గణాంకాలు కూడా ఈ ధోరణికి అనుగుణంగానే ఉన్నాయి. మిగతా మోడళ్లన్నింటినీ మించిన ఉత్సాహంతో, ఏప్రిల్ నెలలో బాలెనో 13,180 యూనిట్ల అమ్మకాలతో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇది మార్చి 2025తో పోలిస్తే స్పష్టమైన మెరుగుదల.

మార్చిలో అమ్ముడైన బాలెనో కార్ల సంఖ్య 12,357 కాగా, ఏప్రిల్‌లో అది 823 యూనిట్ల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల చిన్న సంఖ్యలా కనిపించొచ్చు కానీ, ఆటోమొబైల్ మార్కెట్ వంటి పోటీతో నిండిన విభాగంలో, నెల నుంచి నెలకి ఇటువంటి స్థిరమైన మంచి పురోగతిని సాధించడం గొప్ప విషయమే. వినియోగదారుల నమ్మకాన్ని పొందడం, విశ్వసనీయతను నిలబెట్టుకోవడం, కాలానికి తగ్గ అప్‌డేట్స్‌ను అందించడం బాలెనో విజయానికి మూలస్తంభాలుగా నిలిచాయి.

Maruti Suzuki Baleno Sales

ఏప్రిల్ 2025లో మారుతీ సుజుకీ బాలెనో నెలవారీ అమ్మకాలలో మంచి వృద్ధిని సాధించినప్పటికీ, టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 10వ స్థానమే లభించింది. ఈ లిస్ట్‌లో 10వ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. అమ్మకాల పరంగా ఈ రెండు కార్ల మధ్య వ్యత్యాసం 233 యూనిట్లు మాత్రమే. అనగా, ప్రస్తుత ఏప్రిల్ 2025 నెలలో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ అమ్మకాల సంఖ్య 13,413గా ఉంది.

మారుతీ సుజుకీ బాలెనో, నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకానికి ఉన్నటువంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. నెక్సా సిరీస్‌లో ప్రస్తుతం మొత్తం 8 మోడళ్లు అందుబాటులో ఉండగా, వాటిలో బాలెనో తన స్థిరమైన అమ్మకాలతో ముందు వరుసలో నిలుస్తోంది. ఇది నెక్సా బ్రాండ్‌కు ఒక నమ్మకమైన స్టార్ కారుగా మారింది. బాలెనోకు ఈ స్థాయి ప్రజాదరణ రావడానికి ప్రధాన కారణాలు ధర, అలాగే మైలేజ్.

Maruti Suzuki Baleno April Sales

మార్కెట్‌లో ఉన్న అనేక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లతో పోల్చితే బాలెనో ధర మరింత తక్కువగా ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధరగా కేవలం రూ. 6.70 లక్షల నుండి ప్రారంభమవుతోంది. దీని CNG వేరియంట్లు కిలోగ్రాముకు 30.61 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలవు. దీని టాప్ వేరియంట్లు అన్నీ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2025, 10:50 [IST]
English summary
Maruti suzuki baleno april sales 13180 reported in april 2025 more details here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+