రూ.6.70 లక్షలకే 30.61 కి.మీ మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ కారు.. ఆ మోడల్ కారణంగా జనాలు పట్టించుకోవట్లేదు!

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాన్ని మాటలకే కాదు, అమ్మకాల పరంగా కూడా శాసించింది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). అందమైన డిజైన్, మన్నికైన ఇంజిన్, మంచి మైలేజ్, ఖర్చు తక్కువైన మెయింటెనెన్స్... ఇవన్నీ కలిపి, ఈ కారును చాలా మంది కుటుంబాలు తమ మొదటి ప్రీమియం కారుగా ఎంచుకున్నాయి. రీసేల్ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో, బాలెనో ఒక సురక్షితమైన పెట్టుబడి లా మారింది. అయితే తాజాగా ఈ కారుకు ఆదరణ తగ్గినట్లు తెలుస్తుంది. *జూన్ 2025లో బాలెనో కేవలం 8,966 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇది గత సంవత్సరం ఇదే జూన్ నెలలో విక్రయించిన 14,895 యూనిట్లతో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుదల. బాలెనో తరహా పెద్ద బ్రాండ్‌కు ఇది చాలా పెద్ద నష్టమే.

ఎప్పటికప్పుడు మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం సవాలే. సంవత్సరాలుగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కీలకంగా ఉన్న బాలెనో ఇప్పుడు గణాంకాల పరంగా వెనకడుగు వేస్తోంది. ఈ కారు అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం ఫ్రాంక్స్. అదే ప్లాట్‌ఫారమ్, అదే ఇంజిన్, కానీ SUV స్టైల్ లుక్, అదనపు ఫీచర్లు కలిపి, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కస్టమర్లను ఫ్రాంక్స్ వైపు లాక్కెళ్లాయి. బాలెనో చుట్టూ ఉన్న స్పేస్, స్టేటస్ కొంతవరకు ఫ్రాంక్స్ ఆక్రమించింది.

Maruti Suzuki Baleno

ఇటీవలే భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మారుతి బాలెనో 4-స్టార్ రేటింగ్‌ను సాధించలేకపోయినప్పటికీ, అందులో ఉన్న భద్రతా ఫీచర్ల సంఖ్య మాత్రం తక్కువేమీ కాదు. కానీ, ఈ భద్రతా అప్‌డేట్స్ కూడా అమ్మకాలను గణనీయంగా పెంచకపోవడం మారుతికి అసలు నిరాశగా మారింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో, భద్రతా పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS ఉన్నాయి.

ఇంకా, బాలెనో జిన్ విషయానికి వస్తే ఇది 1.2 లీటర్, 4 సిలిండర్ డ్యూయల్‌జెట్ K12N పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది మంచి మైలేజ్‌‌ను అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు సరైన పొటెన్షియల్‌తో వస్తున్న ఈ మోటార్, మారుతి ఇంజినీరింగ్‌కు మంచి ఉదాహరణ. అన్నీ ఉన్నప్పటికీ, మార్కెట్ స్పందన మాత్రం మారుతిని ఆశించిన దారిలో తీసుకెళ్లడం లేదు. ఫ్రాంక్స్ వంటి మోడళ్ల రాకతో బాలెనో డిమాండ్ కాస్త వెనక్కి పడిపోయింది.

Maruti Suzuki Baleno Sales

ఈ కారుకు ఇంజిన్ ఇది 90 bhp శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ పరంగా చూస్తే, వినియోగదారుడి అవసరాన్ని బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ ప్రకారం, మాన్యువల్ వేరియంట్ 22.35 kmpl, AMT వేరియంట్ 22.94 kmpl వరకు మైలేజ్ సామార్థ్యం చూపగలదు. మైలేజ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్.

అయితే, మైలేజ్‌కి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం, CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది కంపెనీ ప్రకారం 30.61 km/kg మైలేజ్‌ను ఇవ్వగలదు. రోజూ ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణించే వారికి ఇది నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ చాయిస్. ఇంటీరియర్ విషయానికి వస్తే, బాలెనో టెక్నాలజీ పరంగా కూడా ప్రీమియమ్ అనిపించేలా తీర్చిదిద్దబడింది.

Maruti Suzuki Baleno Price

కారు లోపల అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయి. ప్రధానంగా 9.0 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ వ్యవస్థ, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్, వాయిస్ కమాండ్ల సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. బయటి రూపంలో స్పోర్టీవ్ లుక్స్, లోపల టెక్-ఫ్రెండ్‌గా ఉండే ఫీచర్లతో, బాలెనో వినియోగదారుడికి వాల్యూతో ప్యాక్డ్ కార్ అనిపించేలా చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 16, 2025, 17:36 [IST]
English summary
Maruti suzuki baleno hatchback june 2025 sales 40 percent down
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+