అయ్యయ్యో..! ఫేమస్ కారు ధర పెంచిన మారుతి సుజుకి.. ఆ కారు కొనాలంటే ఇప్పుడు మరింత కష్టమే!

మారుతి సుజుకి... భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎంతో ప్రత్యేకం. గల్లీ నుంచి దిల్లీ దాకా తమ వాహనాలతో వినియోగదారులను ఆకట్టుకుంది. ఎరెనా, నెక్సా డీలర్‌షిప్ ద్వారా.. తమ కార్లతో ఈ సంస్థ కస్టమర్లకు చేరువైంది. అట్రాక్టివ్ డిజైన్‌తో, ఫీచర్లతో సేల్స్ పెంచుకుంటూ వస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ మోడళ్లను అప్‌డేట్ చేసి తీసుకురావడం ఈ కూడా ఈ సంస్థ మరో ప్రత్యేకత. అందుకే ఎన్నో ఏళ్లుగా తన స్థానాన్ని సుస్థిరంగా కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వినియోగదారులను షాక్‌కు గురి చేసింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

తమ అన్ని కారు మోడళ్లపై ధరలు పెంచనున్నట్లు మారుతి సుజుకి సంస్థ గతంలోనే ప్రకటించింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుతండడం, ఆపరేషనల్ ఖర్చులు కూడా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు ధరలు పెంచుతోంది. తాజాగా మారుతి సంస్థ నుంచి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతి సుజుకి బాలెనో కారు మోడల్‌పై రూ.5,000 ధర పెంచింది.

Maruti Suzuki Baleno Price Increased

అట్రాక్టివ్ డిజైన్‌తో ఈ మారుతి బాలెనో కారు ఉంటుంది. ఇది సిగ్మా, డెల్టా, జెటా అనే వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం కారు...Nexa Blue, Arctic White, Grandeur Grey, Splendid Silver, Opulent Red వంటి కలర్ ఆప్షన్లతో వస్తోంది. దీంట్లో ఐదుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు.

ఈ కారు రెండు పవర్ ట్రెయిన్స్‌తో ఉంటుంది. దీంట్లోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 PS పవర్, 113 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బాలెనో సీఎన్‌జీ మోడల్‌లోనూ సేమ్ ఇంజిన్ ఉంటుంది. అయితే ఇది 77.5 PS పవర్, 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున ఈ కారు ఫర్పామెన్స్‌లోనూ అదరగొడుతోంది.

Maruti Suzuki Baleno Price Hike

ఈ హ్యాచ్‌బ్యాక్ దాని వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఉంటుంది. దీంట్లోని పెట్రోల్ మోడల్ 22.35 నుంచి 22.94 కి.మీ.ల మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో దీంట్లోని సీఎన్‌జీ వేరియంట్ 30.61 kmpl మైలేజీ అందిస్తుంది. దీంట్లో 318 లీటర్ బూట్‌స్పేస్ ఉంటుంది. ఇది ట్రావెలింగ్‌లో ఎక్కువ లగేజ్‌ను క్యారీ చేయగలదు.

ఈ మారుతి బాలెనో కారులో ఫీచర్లు కూడా భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. దీంట్లో 9- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్- బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఆప్షన్లు ఉంటాయి.

ఈ కారును ప్రయాణికులకు మ్యాగ్జిమమ్ ప్రొటెక్షన్ అందించే విధంగా డిజైన్ చేశారు. దీంట్లో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం), ESP(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్- హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360- డిగ్రీ కెమెరా ఉంటాయి. ఈ కారు హ్యూందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్స్‌కు పోటీగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2025, 17:25 [IST]
English summary
Maruti suzuki baleno price increased check latest fare and its full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+