టీచర్లు, ఇంజనీర్లకు బాగా ఇష్టమైన కారు.. 34 కి.మీ మైలేజ్! ధర చాలా తక్కువ

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ భారతదేశంలో ప్రతి కుటుంబానికి దగ్గరైన పేరు. చిన్న కారు సెగ్మెంట్‌లో ఎంతోకాలంగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్, అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరతో పాటు మెరుగైన పనితీరు, విశాలమైన ఇంటీరియర్, స్టైలిష్ లుక్‌లతో ఆకట్టుకుంటుంది. కారు మైలేజ్, విశ్వసనీయత కారణంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వర్గం ప్రజల మనసును దోచుకుంది. ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ టీచర్లు, బ్యాంక్ ఉద్యోగులు వంటి మధ్యతరగతి వర్గానికి ఇది ఒక కలల కారు లాంటిది. దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ తన మోడర్న్ డిజైన్, ఎత్తైన సీటింగ్ పొజిషన్, సౌకర్యవంతమైన క్యాబిన్, ప్రాక్టికల్ ఫీచర్లతో ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది.

రోజువారీ ప్రయాణాల కోసం, అలాగే కుటుంబంతో వీకెండ్ ట్రిప్స్‌కి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే, వ్యాగన్‌ఆర్‌ పేరు చెప్పకుండా ఉండలేము, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ కారు సక్సెస్ స్టోరీకి మరో సాక్ష్యం సెప్టెంబర్‌ 2025లో రికార్డ్ చేసిన అమ్మకాల సంఖ్య. ఈ ఒక్క నెలలోనే మారుతి సుజుకి 15,388 వ్యాగన్‌ఆర్‌ యూనిట్లు దేశవ్యాప్తంగా డెలివరీ చేసింది.

Maruti Suzuki Best Mileage Car Wagonr September 2025 Sales Report

గత ఏడాది ఇదే నెలలో 13,359 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. ఇది వినియోగదారుల విశ్వాసం, కంపెనీ నాణ్యత, వ్యాగన్‌ఆర్‌ విశ్వసనీయతకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇది సిటీ డ్రైవ్‌కి అనువుగా ఉండి, హైవే మీద కూడా సులభంగా నడుస్తుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు వ్యాగన్‌ఆర్‌ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో మొత్తం 42,192 యూనిట్లు కొనుగోళ్లు జరిగాయి.

ఇది ఈ హ్యాచ్‌బ్యాక్‌పై ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని, దీని డిమాండ్‌ ఎటువంటి స్థాయిలో ఉందో స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రధానంగా సెప్టెంబర్‌ నెలలో వ్యాగన్‌ఆర్‌ అమ్మకాలు మరింతగా వేగం పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంచే సవరించిన జీఎస్‌టీ పన్ను రేట్లు అమలు కావడం, ఈ కారుకు కొత్త ఊపిరి పోశాయి. పన్ను రాయితీల కారణంగా వ్యాగన్‌ఆర్‌ ధర రూ.79,600 వరకు తగ్గడం వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగించింది.

Maruti Suzuki Best Mileage Car Wagonr September 2025 Sales Report

వ్యాగన్‌ఆర్‌ ధర విషయానికి వస్తే, ఇది భారతీయ వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలు కాగా, టాప్‌ వేరియంట్‌ ధర రూ.6.95 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అంటే, నగరాల్లో పనిచేసే ఉద్యోగులకైనా, చిన్న పట్టణాల్లో నివసించే కుటుంబాలకైనా ఈ కారు సులభంగా అందుబాటులో ఉంటుంది. ధరకు తగ్గ నాణ్యత, సౌకర్యం, మరియు పనితీరు కలిపి దీనిని మార్కెట్లో అత్యధికంగా కోరుకునే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలబెట్టాయి.

వ్యాగన్‌ఆర్‌ మొత్తం నాలుగు వేరియంట్లలో LXI, VXI, ZXI, ZXI ప్లస్‌లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్‌ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇంజిన్‌ పరంగా చూస్తే, ఈ కారు విభిన్న పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో వస్తోంది. 1.0 లీటర్‌ పెట్రోల్‌, 1.2 లీటర్‌ పెట్రోల్‌, అలాగే 1.0 లీటర్‌ CNG ఇంజిన్‌ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఇవన్నీ BS6 ఫేజ్-II నార్మ్స్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.

Maruti Suzuki Best Mileage Car Wagonr September 2025 Sales Report

డ్రైవింగ్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ ఆటోమేటిక్‌ (AGS) ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజ్‌ విషయానికి వస్తే, ఇది వ్యాగన్‌ఆర్‌ పెద్ద హైలైట్, పెట్రోల్‌ వేరియంట్‌ 23 kmpl వరకు, CNG వేరియంట్‌ 34 km/kg వరకు మైలేజ్‌ ఇస్తుంది. అంటే, బైక్‌లకు సమానంగా ఇంధన సామర్థ్యాన్ని అందించే కారు అని చెప్పొచ్చు.

Article Published On: Friday, October 10, 2025, 9:15 [IST]
English summary
Maruti suzuki best mileage car wagonr september 2025 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+