కార్లంటే ఇవి భయ్యా.. మీకు తక్కువ ధరలో.. బెస్ట్ మైలేజ్ ఇస్తాయి.. మీ కోసమే ఆ కార్ల లిస్ట్.. ఓ లుక్కేయండి మరి
ఇండియాలో ఎక్కువ మైలేజ్ అందించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోజువారీ అవసరాలతో పాటు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ టూర్లకు వెళ్లడానికి మైలేజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా వాహన తయారీ కంపెనీలు అధునాతన డిజైన్లతో, సరికొత్త ఫీచర్లతో ఎక్కువ మైలేజ్ అందించే కార్లను విడుదల చేస్తున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ మైలేజ్ విషయంలో కీలకంగా దృష్టి సారించాయి. అందుకే కార్లను లాంచ్ చేస్తున్న సమయంలో లీటర్ పెట్రోల్‌కు లేదా డీజిల్‌కు వచ్చే మైలేజ్‌ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ ఈ విభాగంలో ముందు స్థానంలో ఉంటుంది.
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కార్లు ఎక్కువ మైలేజ్‌ను అందించడంలో ఇండియాలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాయి. కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఈ కంపెనీ కార్లు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. ప్రస్తుతం మారుతీకి చెందిన పలు మోడళ్లు మైలేజ్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించేవి గ్రాండ్ విటారా, ఆల్టో కె10, వంటివి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి గురించిన వివరాలను క్రింది కథనంలో తెలుసుకుందాం.

Maruti Wagon R:మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో దాదాపు 24.35 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది. అదే ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 25.19 కి.మీల వరకు ఇస్తుంది. అదే సీఎన్‌జీ ఆప్షన్‌లో 34.05 కి.మీల వరకు మైలేజ్ వస్తుంది. చిన్ని ఫ్యామిలీకి ఈ కారు అనువుగా ఉంటుంది. ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి.
Maruti Grand Vitara: మారుతి గ్రాండ్ విటారా అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా ఉంది. ఇది 1.5-లీటర్, 3-సిలిండర్, హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ కారు దాదాపు 27.97 కి.మీల మైలేజ్‌ను అందిస్తుంది. దీనిలో ఆటో ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందించారు. పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడా ఈ కారు రన్ అవుతుంది. ఇంకా cng ఆప్షన్‌లో కూడా మెరుగైన మైలేజ్‌ను ఇస్తుంది.

Maruti Baleno:మారుతీ బాలెనో హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారు. ఇది పెట్రోల్, cng ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌లో లీటర్ పెట్రోల్‌కు 22.35 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. అదే ఆటోమెటిక్ మాన్యువల్‌లో 22.9 కి.మీల వరకు ఇస్తుంది. cng ఆప్షన్‌లో ఇది మాన్యూవల్ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. కిలో ఇంధనానికి 30.61 కి.మీల మైలేజ్ ఇస్తుంది.
Maruti Alto K10:కొత్త మారుతి ఆల్టో కె10 ప్రారంభ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది పెట్రోలో, cng ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్‌లో దాదాపు 24.39 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. అదే cngలో అయితే 33.85 కి.మీల వరకు ఇస్తుంది. భారత్‌లో చాలా చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్ కారు.

Maruti S-Presso: మారుతీ ఎస్-ప్రెస్సో పెట్రోల్, cng ఆఫ్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్‌లో 24.12 కిమీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. అదే cng ఆప్షన్‌లో 32.73 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఇది రూ.4.26 లక్షల నుంచి మొదలుకుని రూ.6.12 లక్షల వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








