25 కి.మీ మైలేజ్ ఇచ్చే రూ.8 లక్షల మారుతీ కారును కస్టమర్లు తెగ కొన్నారు.. చిన్న ఫ్యామిలీకి బాగా సెట్ అవుద్ది!
మారుతీ సుజుకీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza), ఈ మధ్యకాలంలో కాంపాక్ట్ SUV విభాగంలో తనదైన స్థానాన్ని సాధించింది. ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, వినియోగదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడం వంటి ప్రత్యేకతలతో బ్రెజ్జా అంటేనే అందరికి బాగా ఇష్టమైన కారుగా గుర్తింపు పొందింది. తాజాగా జూన్ నెల ముగియగానే తయారీ కంపెనీలు వరుసగా తమ సేల్స్‌ను వెల్లడిస్తున్న తరుణంలో మారుతీ సైతం బ్రెజ్జా కారు అమ్మకాలను విడుదల చేసింది. జూన్ నెలకు గాను దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా వెల్లడి కాగా, ఈ జాబితాలో బ్రెజ్జా 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 14,507 యూనిట్ల అమ్మకాలతో కస్టమర్ల ఆదరణ ఉందని నిరూపించుకుంది.
అయితే, ఈ రేసులో హ్యుందాయ్ క్రెటా మరింత ముందుకి దూసుకెళ్ళింది. జూన్‌లో మొత్తం 15,786 యూనిట్లు అమ్ముడుపోగా, రెండవ స్థానంలో నిలిచిన మారుతీ సుజుకీ డిజైర్ 15,484 యూనిట్లను రికార్డు చేసింది. కేవలం జూన్ నెలలోనే కాదు, ఈ సంవత్సరం మొదటి అయిదు నెలల్లోనూ బ్రెజ్జా తన గరిష్ట స్థాయిలో అమ్మకాలు కొనసాగిస్తోంది. జనవరిలో 14,747 మంది బ్రెజ్జా కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

ఆ తర్వాత ఫిబ్రవరిలో మరింతగా వృద్ధి చెంది 15,392 యూనిట్లు, మార్చిలో 16,546 యూనిట్లు, ఏప్రిల్‌లో 16,971 యూనిట్లు, మే నెలలోనూ 15,566 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగించింది. ఈ కారును ఎంచుకునే వినియోగదారులు దాని బలమైన రోడ్ ప్రెజెన్స్, మైలేజ్, ఇంటీరియర్ సౌకర్యాలపై ప్రత్యేకంగా ఆకర్షితమవుతున్నారు. రాబోయే నెలల్లోనూ ఇదే స్థాయిలో సత్తా చూపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మారుతి సుజుకి బ్రెజ్జా, దాని శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో ప్రతి డ్రైవ్‌ను కొత్తగా మారుస్తుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉండగా, ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారి కోసం CNG వేరియంట్ కూడా అందిస్తున్నారు. ఈ ఇంజిన్ స్మూత్‌గా రిఫైన్‌మెంట్‌ను ఇస్తూ, మంచి పరఫార్మెన్స్‌నే కాక, ఆశ్చర్యపరిచే స్థాయి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయంలోనూ ఈ SUV ఈజీ డ్రైవింగ్‌కి అన్ని సౌకర్యాలనూ కల్పిస్తుంది.

ట్రెడిషనల్ మాన్యువల్ గేర్‌షిఫ్టింగ్‌కి ఇష్టపడే వారికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, మరింత సౌకర్యాన్ని కోరుకునే వారికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది వేరియంట్ ఆధారంగా లీటరుకు 17 నుండి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది, ఇది SUV విభాగంలో దాదాపు ఏ బైక్‌కైనా సాటిగా నిలుస్తుంది. ధర విషయానికి వచ్చేసరికి, బ్రెజ్జా వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని సరసమైన ధరలో అందుబాటులో ఉంది.
దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8.69 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్ ZXI ప్లస్ కోసం రూ. 14.14 లక్షల వరకు ఉన్నాయి. దీనికి తోడు, వినియోగదారుల అవసరాల ఆధారంగా LXI, VXI, ZXI, ZXI ప్లస్ వేరియంట్లను ఎంచుకునే అవకాశం ఉంది. అందుకే, ప్రీమియం SUVను ఆకర్షణీయమైన ధరలో, నమ్మకమైన ఇంజిన్‌తో, కాంపాక్ట్ డిజైన్ పొందాలనుకునే వారందరికీ మారుతీ సుజుకీ బ్రెజ్జా మొదటి ఆప్షన్ అవుతోంది.

బ్రెజ్జా కారు మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు కలిగి ఉంటుంది, ఇవి ప్రమాద సందర్భంలో ప్రయాణికుల ప్రాణ రక్షణ కోసం కీలక పాత్ర పోషిస్తాయి. ఆటోమొబైల్ సేఫ్టీలో అత్యంత కీలకమైన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) కూడా ఇందులో ఉంది. ఇది అత్యవసర బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ కావడం నుంచి కాపాడుతుంది. అదేవిధంగా, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటివి దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








