డబ్బుకు పూర్తిగా న్యాయం చేసే కారు.. రూ.8 లక్షలకే 5 సీట్లు, 25.51 కి.మీల మైలేజ్.. కానీ గత నెలలో తగ్గిన జోరు
ఇండియాలో పేద-మధ్య తరగతి వారికి బాగా ఇష్టమైన కార్ల తయారీ కంపెనీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ(Maruti Suzuki) మాత్రమే. దీని నుంచి వచ్చిన ప్రసిద్ధ మోడల్ బ్రెజ్జా(Brezza) చాలా కాలంగా దేశంలో అందరి అభిమానాన్ని పొందుతుంది. అత్యంత ప్రజాధారణ suvలలో ఇది ఒకటిగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఫిబ్రవరి నెల ముగియగానే అన్ని వాహన తయారీదారులు వరుసగా తమ సేల్స్ వివరాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మారుతీ సైతం తన ప్రసిద్ధ SUV బ్రెజ్జాకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. డేటా ప్రకారం, ఈ మోడల్ ఫిబ్రవరి 2025లో 15,392 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఏడాది 2024 ఇదే నెలలో మొత్తం 15,765 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి సేల్స్ 2 శాతం తగ్గడం గమనార్హం.
ఒక సంవత్సరం వ్యవధిలో అమ్మకాలు తగ్గడంపై మారుతీ సుజుకీ ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతానికి సేల్స్ క్షీణించడంపై ఎలాంటి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. స్వల్పంగా మాత్రమే తగ్గడంతో రానున్న రోజుల్లో సేల్స్ పెంచడానికి కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికి ముందు జనవరి 2025లో మారుతీ బ్రెజ్జా అమ్మకాలు 14,747 యూనిట్లుగా నమోదు కాగా, నెల రోజుల్లో తిరిగి పెరగడం కొంత ఆనందించే విషయం.

సమీక్ష కాలంలో SUV విభాగంలో బ్రెజ్జా సేల్స్ సెగ్మెంట్‌లో మూడవ స్థానంలో ఉంది. దీని కంటే ముందు స్థానంలో 21,461 యూనిట్లతో మారుతీ ఫ్రాంక్స్ టాప్ ప్లేస్‌లో ఉండగా, తరువాత రెండో స్థానంలో 16,317 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా ఉంది. గత ఏడాది కూడా మారుతీ బ్రెజ్జా మెరుగైన అమ్మకాలను సాధించింది. దీని ఆకట్టుకునే డిజైన్, ట్రెండింగ్‌కు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్‌తో భారతీయ కస్టమర్లను ఇది ఆకర్షిస్తుంది.
2024లో మారుతీ బ్రెజ్జా అమ్మకాలను చూసినట్లయితే డిసెంబర్ నెలలో ఇది 17,336 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్‌లో 14,918 యూనిట్లు, అక్టోబర్‌లో 16,565 యూనిట్లు, సెప్టెంబర్‌లో 15,322 యూనిట్ల సేల్స్‌ను ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీ సాధించింది. ఈ గణాంకాలను చూసినట్లయితే ప్రతినెలా కూడా బ్రెజ్జా సగటున 10,000 కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడం విశేషం. దీన్ని బట్టి ఈ కారుకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.

ఇక కారు ధర, ఇతర విషయానికి వస్తే, మారుతీ కొత్త బ్రెజ్జా రూ.8.69 లక్షల ప్రారంభ ధరకు లభిస్తుంది. అదే టాప్ వేరియంట్ విషయానికి వస్తే, రూ.14.14 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే పన్నులతో కలిపి స్వల్పంగా పెరుగుతుంది. ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీ LXI, VXI, ZXI వంటి పలు రకాల వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.
ఫీచర్స్‌కు అనుగుణంగా కస్టమర్లు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. మారుతీ బ్రెజ్జా పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మాగ్మా గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి ఇతర కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. కొత్త మోడల్ 1.5-లీటర్. పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 103 PS పవర్, 37 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరో ఆప్షన్ CNG విషయానికి వస్తే, 88 హార్స్‌పవర్, 121.5 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ప్రధానంగా మైలేజ్ గురించి చూసినట్లయితే లీటరుకు 17.38 నుండి 25.51 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. 5 సీటర్ ఆప్షన్‌లో లభిస్తున్న ఈ కారులో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్, ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








