మధ్యతరగతి వ్యక్తి రూ.1.12 లక్షల తగ్గింపుతో ఈ కారుని కొనచ్చు.. ఇండియాలో ఇది ఉండని ఊరు లేదు
దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో సంచలనాత్మక మార్పు తెచ్చిన అంశం ఏమిటంటే జీఎస్టీ (GST) తగ్గింపు. ఈ పన్ను తగ్గింపు కారణంగా అనేక కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా వినియోగదారులలో ఆనందం వెల్లివిరుస్తోంది. షోరూమ్‌ల ముందు కొత్త వాహనాల కోసం క్యూలు ఏర్పడుతున్నాయి. చాలా మంది తమ డ్రీమ్ కారు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా 4 మీటర్ల లోపు వాహనాల విభాగం ఈ జీఎస్టీ తగ్గింపుతో అత్యధిక లాభం పొందిన సెగ్మెంట్‌గా నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన బ్రెజ్జా (Maruti Suzuki Brezza) మోడల్ డిమాండ్ మరింతగా పెరిగింది. బ్రెజ్జా అనేది SUV మార్కెట్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ఉత్తమ ఎంపికగా ఎప్పటి నుంచో గుర్తింపు పొందింది.
తమ సొంత SUV అనే భావనను ఇచ్చిన ఈ మోడల్, భారతీయ కుటుంబాల్లో విశేష స్థానం సంపాదించింది. బ్రెజ్జా ఇది కేవలం ఒక కారు కాదు, అది మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసిన ఒక విశ్వసనీయ బ్రాండ్. తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన మైలేజ్, రేంజ్ రోవర్‌లను తలపించే లుక్, అధిక రీసేల్ విలువ వంటి లక్షణాలు దీనిని ఈ విభాగంలో ఇతర SUVల కంటే ముందంజలో ఉంచాయి.

కేవలం రూపం కాదు, పనితీరులో కూడా ఇది తనదైన స్థాయిని నిలబెట్టుకుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్రెజ్జా అమ్మకాలు నెలకు పదివేల యూనిట్లకు పైగా చేరుతున్నాయి. అంటే ప్రతి నెలా దాదాపు 10,000 మంది కస్టమర్లు ఈ SUVని కొనుగోలు చేస్తున్నారు. ఇది మారుతి బ్రాండ్‌పై ఉన్న ప్రజల విశ్వాసానికి నిదర్శనం. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో బ్రెజ్జా ధరలు మరింత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త GST అమలుతో బ్రెజ్జా ధర రూ.43,000 నుంచి ఇప్పుడు రూ.1.12 లక్షలు తగ్గి మరింత ఆకర్షణీయంగా మారింది. వేరియంట్ల వారీగా కొత్త ధరలను ఒకసారి చూసినట్లయితే, ముందుగా, LXI మాన్యువల్ వెర్షన్ ధర గతంలో రూ.8.69 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.43,000 తగ్గి రూ.8.26 లక్షలకు చేరింది. అదే విధంగా, LXI CNG వెర్షన్ ధర రూ.9.64 లక్షల నుండి తగ్గి రూ.9.17 లక్షలకు వచ్చింది.

VXI మాన్యువల్ వెర్షన్ గతంలో రూ.9.75 లక్షలు ఉన్న ధర ఇప్పుడు రూ.9.26 లక్షలలోకి వచ్చి, డిమాండ్ మరింత పెరగడానికి కారణమవుతుంది. VXI CNG ను కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు కేవలం రూ.10.17 లక్షలు చెల్లించాలి, గత ధరకు పోలిస్తే గణనీయమైన తగ్గింపు. టాప్-ఎండ్ ZXI మాన్యువల్ వెర్షన్ గత ధర రూ.11.26-12.21 లక్షల నుంచి ఇప్పుడు రూ.10.40 లక్షలు అయింది.
ZXI CNG వెర్షన్ రూ.11.31 లక్షలకు చేరింది. అత్యధిక తగ్గింపును చూసిన ZXI Plus మాన్యువల్ వెర్షన్ ధర రూ.12.58 లక్షల నుంచి తగ్గి రూ.11.51 లక్షలకు చేరింది, అంటే కస్టమర్లకు రూ.1.07 లక్షల లాభం. ఆటోమేటిక్ విషయానికి వస్తే, VXI ఆటోమేటిక్ ధర రూ.11.15 లక్షల నుండి రూ.10.60 లక్షలకు, అంటే రూ.55,000 తగ్గింపు కలిగింది. ZXI ఆటోమేటిక్ ధర రూ.12.66 లక్షల నుండి రూ.11.75 లక్షలకు చేరింది.

అత్యంత టాప్-ఎండ్ ZXI Plus ఆటోమేటిక్ వెర్షన్ రూ.13.98 లక్షల నుంచి తగ్గి రూ.12.86 లక్షలకు, అంటే వాస్తవంగా రూ.1.12 లక్షల తగ్గింపు లభించింది. మొత్తం మీద, బ్రెజ్జా ఇప్పుడు కేవలం ఆకర్షణీయమైన ధరలతో మాత్రమే కాకుండా, అన్ని వేరియంట్లలో వినియోగదారులకు విస్తృత ఎంపికలను అందిస్తుంది. జీఎస్టీ తగ్గింపుతో, మధ్యతరగతి, SUV ప్రేమికులు తక్కువ ఖర్చుతో తమ డ్రీమ్ SUVని సొంతం చేసుకోవడానికి ఇది అత్యంత సరైన సమయం.


Click it and Unblock the Notifications