దేశంలో మిడిల్ క్లాస్ బడ్జెట్ కారు! రూ.4.27 లక్షలే.. 33 kmpl మైలేజ్.. సేల్స్ చూసి కంపెనీ షాక్ అయింది

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S Presso) మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఇది SUV స్టైల్ లుక్స్‌తో హ్యాచ్‌బ్యాక్ కాంపాక్ట్ సైజ్ కలిగిన ప్రత్యేకమైన కారు అని చాలా మంది భావించారు. అందుకే దీన్ని చాలామంది మైక్రో SUV అని కూడా పిలిచారు. కానీ కాలక్రమేణా వినియోగదారుల అభిరుచులు మారడం ప్రారంభించాయి. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించే వారు కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులయ్యారు. ఫ్యూయల్ ఖర్చులు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఇవన్నీ EVలకు పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్-ప్రెస్సో తన మార్కెట్లో మెల్లగా వెనుకబడిపోతోంది. జూలై 2025లో విడుదలైన అమ్మకాల గణాంకాలు దీనికి స్పష్టమైన ఉదాహరణ.

తాజాగా విడుదలైన గణంకాల ప్రకారం, ఎస్-ప్రెస్సో గత నెలలో కేవలం 912 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో జూలై 2024లో ఈ కారు అమ్మకాలు 2,607 యూనిట్లుగా ఉండటం గమనార్హం. అంటే ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65.02 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇది కేవలం ఒక నెల గణాంకం మాత్రమే కాదు. గత కొన్ని నెలలుగా ఎస్-ప్రెస్సో అమ్మకాల గ్రాఫ్ క్రమంగా క్షీణత దిశగా వెళ్తోంది.

Maruti Suzuki Budget Family Car S Presso 912 Sales Units Recorded

కస్టమర్లు కొత్త మోడల్స్, అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తున్న కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు, దీంతో కారు సేల్స్ తగ్గాయి. ముఖ్యంగా చిన్న ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్‌లో టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు బలమైన స్థానం సంపాదించాయి. మరోవైపు, EVల పాపులారిటీ వేగంగా పెరుగుతోంది. నగరాల్లో డైలీ యూజ్ కోసం చాలామంది ఎలక్ట్రిక్ కార్లనే ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే, S-ప్రెస్సో వంటి మోడల్స్ భవిష్యత్తులో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో జూన్ 2025లో 1,369 యూనిట్లు అమ్ముడుపోయింది.అయితే, కేవలం ఒక నెలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూలై 2025లో అమ్మకాలు కేవలం 912 యూనిట్లకు పడిపోవడం గమనార్హం. అంటే ఒక్క నెలలోనే దాదాపు 33.38 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇది కేవలం నెలవారీ డిక్లైన్ మాత్రమే కాదు. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

Maruti Suzuki Budget Family Car S Presso 912 Sales Units Recorded

ధర పరంగా, ఎస్-ప్రెస్సో దేశంలో అత్యంత సరసమైన కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 4.27 లక్షల (ఎక్స్-షోరూమ్) మాత్రమే. పైగా, ఇది పెట్రోల్, CNG ఇంధన ఎంపికలతో అందుబాటులో ఉండటం బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకునే అంశం. అయినా కూడా అమ్మకాల గ్రాఫ్ క్రమంగా పడిపోవడం వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని సూచిస్తోంది. అయినప్పటికి ఈ కారు బడ్జెట్ ప్రేమికులకు మంచి ఆప్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మారుతి ఎస్-ప్రెస్సో చిన్నదే అయినా, అందులోని ఇంజిన్ మాత్రం శక్తివంతమైనది. ఈ కారులో 1.0-లీటర్, మూడు సిలిండర్ల K10C పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. నగర రోడ్లలో సులభంగా నడపడానికి, హైవేలపై స్మూత్‌గా రన్ అవ్వడానికి ఇది సరైన కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT ట్రాన్స్‌మిషన్తో జత చేశారు. ఈ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 66 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఇస్తుంది.

Maruti Suzuki Budget Family Car S Presso 912 Sales Units Recorded

ఇక, మరో ప్రత్యేకత CNG వేరియంట్. ఈ ఆప్షన్‌లో 5,300 rpm వద్ద 56.69 bhp పవర్, 3,400 rpm వద్ద 82.1 Nm టార్క్‌ను అందిస్తుంది. CNG ఎంచుకునే వారికి ఒకే ఆప్షన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే. మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.76 kmpl, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 25.3 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. CNG వేరియంట్ కిలోగ్రాముకు 32.73 కి.మీ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 19, 2025, 16:33 [IST]
English summary
Maruti suzuki budget family car s presso 912 sales units recorded in july 2025
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+