ఇది పేదలకు లగ్జరీ కారు, ధర రూ.5.85 లక్షలు.. ఇంత మంచి కారును ఎందుకు కొనడం లేదు?

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) నుంచి వచ్చినటువంటి ఇగ్నిస్ (ignis) ఒక స్టైలిష్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కారు మొదట్లో మంచి రెస్పాన్స్‌ అందుకుంది. కానీ... ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలలో గణనీయంగా పడిపోయింది. జూన్ 2024లో 2,536 యూనిట్లు అమ్ముడవుతే, 2025 జూన్‌లో కేవలం 1,484 యూనిట్లే అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 41.48 శాతం అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. అయితే ఈ సేల్స్ తగ్గుదల గత నెలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏడాది అంటే, 2025 మొదటి ఐదు నెలల్లో కూడా ఇగ్నిస్ అమ్మకాల్లో స్థిరత కనిపించలేదు. ఈ కాలంలో మొత్తం 11,865 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఈ లెక్కన చూసినట్లయితే నెలకి సగటున 2,373 యూనిట్లే అమ్ముడవుతున్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు ఇది చాల తక్కువ. చాలా స్టైలీష్‌గా కనిపించడం ఒక్కటే ఒక కారును నిలబెట్టడం కాదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బలమైన పోటీదారులు, ఫీచర్లలో తేడాలు, మైలేజ్ పై కస్టమర్ అంచనాలు... ఇవన్నీ కలిసి ఇగ్నిస్‌ మార్కెట్‌లో వెనక్కి నెట్టాయి. ఒకప్పుడు వైవిధ్యం ఉన్న డిజైన్ అంటూ ప్రచారం పొందిన ఈ కారుకు ఆదరణ తక్కువైంది.

Maruti Suzuki Ignis Sales

మారుతి సుజుకి ఇగ్నిస్‌ అమ్మకాలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో, మార్కెట్ విశ్లేషకులు దీనికి పలు కారణాలను చూపుతున్నారు. ముఖ్యంగా వినియోగదారుల ఇష్టాల్లో వచ్చిన మార్పులు ఈ కారును ప్రభావితం చేశాయని చెబుతున్నారు. ఇప్పటి వినియోగదారులు చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల కంటే SUV లేదా SUV లుక్ ఉన్న కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. దీని వల్ల చాలా మంది కస్టమర్లు తమ దృష్టిని ఇగ్నిస్ నుండి ఇతర SUV లవైపు మళ్లించారు.

ఇదే సమయంలో, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లను ఇగ్నిస్ ధర రేంజ్‌లోనే కొనుగోలు చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఇగ్నిస్ పరిమాణం కూడా కొంతమందికి నచ్చడం లేదన్న అభిప్రాయం ఉంది. దాని పొడవు, వెడల్పు పరిమితంగానే ఉండటంతో, ఇది కుటుంబ అవసరాలకు సరిపోదని కొంతమంది భావిస్తున్నారు. పైగా, పెద్ద బూట్ స్పేస్ లేదా వెనుక సీటింగ్ స్పేస్ ఆశించే వారికి ఇది సరైన ఎంపిక కాకపోతుంది.

Ignis June 2025 Sales

సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తున్న ఈ కారు ధర రూ. 5.85 లక్షల నుండి, రూ. 8.12 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది . కేవలం ధర మాత్రమే కాదు, పనితీరులోనూ ఇది బలంగా నిలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 PS పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి.

మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు సగటున 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ హ్యాచ్‌బ్యాక్ వేగంలోనూ వెనుకంజలో లేదు. కేవలం 13 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా ఇది 175 kmph వరకు పరుగెడుతుంది. 32 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో, ఇది నిత్య ప్రయాణాల్లో సౌలభ్యంగా ఉంటుందని చెప్పొచ్చు.

Maruti Suzuki Ignis June 2025 Sales

ఒక చిన్న కుటుంబం సౌకర్యవంతంగా ప్రయాణించడానికి దీనికి 5 సీట్ల ఏర్పాటు ఉంది. సిటీలో, పొదుపుగా, చక్కగా తిరగడానికి ఇది బెస్ట్. మీ ట్రావెల్‌కు అవసరమైన లగేజీని సులభంగా తీసుకెళ్లేందుకు 260 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది. దీని ప్రీమియం లుక్స్‌ను మరింత హైలైట్ చేసే అంశాలే.. LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, స్టైలిష్ DRLలు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్. కారు లోపల టెక్నాలజీ అంశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 23, 2025, 12:35 [IST]
English summary
Maruti suzuki budget friendly car ignis june 2025 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+