33 కి.మీ మైలేజ్! ధర రూ.4.27 లక్షలు.. కానీ ఈ కారును ఎవరూ కొనలేదు! ఎందుకో తెలుసా?
భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం వారు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరల్లో కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది మారుతి సుజుకి (maruti suzuki). సాధాణంగా ఈ కంపెనీ ప్రతి నెలా సేల్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తుంది. దాని ప్రసిద్ధ మోడళ్లు టాప్ నిలవడం సర్వ సాధారణం. జూలై నెల ముగిసిన తరువాత తన కార్ల అమ్మకాల వివరాలను వెల్లడిస్తున్న కంపెనీ దాని బడ్జెట్ కారు మోడల్ అయినటువంటి ఎస్-ప్రెస్సో (S-Presso)కు సంబంధించిన సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. జూలై 2025లో మారుతి సుజుకి S-ప్రెస్సో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెలలో కేవలం 912 యూనిట్లు మాత్రమే మార్కెట్లోకి వెళ్లగా, గత సంవత్సరం ఇదే నెలలో 2,607 కార్లు అమ్ముడయ్యాయి.
ఎస్-ప్రెస్సో సేల్స్ ఏడాది ప్రాతిపదికన చూస్తే 65 శాతం తగ్గుదల నమోదైంది. ఈ పెద్ద క్షీణత మార్కెట్లో ఉన్న పోటీ, కస్టమర్ల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, కొత్త మోడళ్ల ప్రభావం వల్ల జరిగినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మారుతి ఎస్-ప్రెస్సో సెప్టెంబర్ 2019లో భారతీయ వినియోగదారులలో భారీ అంచనాల నడుమ రంగప్రవేశం చేసింది. తక్కువ ధరలో లభించే మోడల్‌గా, ఇది దేశంలో అత్యంత సరసమైన కార్ల జాబితాలో చోటు సంపాదించింది.

ప్రారంభం తర్వాత తొలి రోజుల్లోనే ఈ చిన్న SUV తరహా కారు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ ఉత్సాహం ఎంతటి స్థాయిలో ఉందంటే, విడుదలైన కేవలం రెండు వారాల్లోనే 10,000కు పైగా బుకింగ్‌లు నమోదు అయ్యాయి. అయితే, కాలక్రమేణా ఈ ఉత్సాహం క్రమంగా చల్లారింది. మార్కెట్లో కొత్త ప్రత్యామ్నాయాల ప్రవేశం, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పెరిగిన పోటీ కారణంగా ఎస్-ప్రెస్సోకు ఉన్న ఆకర్షణ తగ్గుతూ వచ్చింది.
ఫలితంగా, ఒకప్పుడు హాట్ కేకలా అమ్ముడైన కారు ఇప్పుడు నెలవారీ అమ్మకాలలో గణనీయమైన పడిపోయే గణాంకాలను చూపిస్తోంది. ఈ జూలై 2025 నెలలోనూ పరిస్థితి భిన్నంగా లేదు, అమ్మకాలు మరింత తగ్గి, గతంలో ఉన్న ఆ బలమైన డిమాండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇదిలా ఉంటే, జూన్ 2025లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు 1,369 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గణనీయమైన 33.38 శాతం తగ్గుదల.

జూలై 2025లో ఈ సంఖ్య కేవలం 912 యూనిట్లకు పడిపోయింది. అంటే, కేవలం ఒక్క నెల వ్యవధిలోనే జూన్‌తో పోలిస్తే 457 తక్కువ ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి. ఈ పడిపోయిన గణాంకాలు, మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఎంత మేర తగ్గిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎస్-ప్రెస్సో ఒకప్పుడు సిటీ కారు సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన, ఆర్థికంగా అందుబాటులో ఉండే మోడళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
దాని ప్రారంభ ధర రూ. 4.27 లక్షలు కావడంతో, మొదట్లో బడ్జెట్ కారు కొనుగోలుదారులలో విపరీతమైన ఆదరణ పొందింది. చిన్న SUV లుక్, కాంపాక్ట్ డిజైన్, రోజువారీ ఉపయోగానికి సరిపడే ఫీచర్లు దీన్ని మొదటి సారి కారు కొనుగోలు చేసే వారికి ఆకర్షణియంగా మార్చాయి. మారుతి అందించిన CNG వేరియంట్ ప్రత్యేకంగా మైలేజ్ పరంగా హైలైట్ అయింది. కంపెనీ ప్రకారం, ఇది కిలోకు 32.73 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.

సీఎన్‌జీ ఫ్యూయల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే వినియోగదారులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ కాలక్రమేణా, వినియోగదారుల అభిరుచులు మారడం, కొత్త పోటీ మోడళ్లు రావడం, మరిన్ని ఫీచర్లతో కూడిన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఎస్-ప్రెస్సోకు ఉన్న మార్కెట్ షేర్ క్రమంగా తగ్గింది. జూలై 2025లో నమోదైన ఈ తక్కువ అమ్మకాల గణాంకాలు, ఈ కారు ఒకప్పుడు ఉన్న విజయాన్ని తిరిగి సాధించాలంటే కంపెనీ కొత్త ప్రణాళికలు వేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








