ఆకాశం నుంచి దిగొచ్చిన నల్లటి అందం.. నెక్సా వార్షికోత్సవానికి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఆవిష్కరణ

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki) తన కార్ల విక్రయానికి ప్రత్యేక డీలర్ నెట్‌వర్క్‌ ద్వారా కస్టమర్లకు చేరువ అవుతుంది. తాజాగా ప్రీమియం కార్ల విక్రయానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నెక్సా డీలర్‌షిప్ నెట్‌వర్క్, భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది విజయవంతంగా 10 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. 2015లో ఆరంభమైన ఈ ప్రీమియం సేల్స్ చానల్, ఇప్పటివరకు లక్షలాది కార్లను వినియోగదారుల చేతికి చేర్చింది. ఈ పదవ వార్షికోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, కంపెనీ తన ప్రీమియం SUV అయిన గ్రాండ్ విటారా కొత్త 'ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ (PHANTOM BLAQ Edition)'ను ఆవిష్కరించింది.

ఈ ప్రత్యేక ఎడిషన్, పేరు చెబుతున్నట్లుగానే, పూర్తిగా నల్లటి థీమ్‌తో మెరుస్తూ, ఒక ఎలిగెంట్, అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. బాడీ మొత్తం డీప్ బ్లాక్ షేడ్‌లో ఉండగా, గ్రిల్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, టెయిల్‌గేట్, డోర్ హ్యాండిల్స్, అలాగే D-పిల్లర్ యాక్సెంట్‌లు కూడా అదే బ్లాక్ ఫినిష్‌లో ఉంటాయి. ఇది SUVకు ఒక స్టెల్త్, స్పోర్టీ, ప్రీమియం వైబ్స్‌ను ఇస్తూ, రోడ్డుపై ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది.

10 Years of Nexa Unveils Grand Vitara Phantom Blaq Edition

డిజైన్‌లో ఈ రంగు మార్పు తప్ప, ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ మిగతా విషయాలలో సాధారణ గ్రాండ్ విటారానే. అయితే, నెక్సా పదవ వార్షికోత్సవానికి గుర్తుగా వచ్చిన ఈ ప్రత్యేక వెర్షన్, బ్రాండ్‌కి ఒక మైలురాయిగా నిలిచే అవకాశముంది. కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ ధరను కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ధర రూ. 20 లక్షలు(ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ప్రత్యేక ఎడిషన్, SUV యొక్క టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఆల్ఫా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పై ఆధారపడి రూపొందించబడింది. ఇందులో ప్రీమియం ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, అత్యుత్తమ హైబ్రిడ్ పనితీరును అందిస్తుంది. ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ రూపంలో, గ్రాండ్ విటారా మరింత స్టైలిష్, ప్రత్యేకమైన లుక్‌తో ప్రీమియం SUV సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ శక్తివంతమైన 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది, ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మోటార్‌ల కలయికతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 115 bhp హార్స్‌పవర్‌తో పాటు 141 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ను స్మూత్‌గా అందించడానికి e-CVT గేర్‌బాక్స్ జత చేయబడింది. పనితీరుతో పాటు మైలేజీ పరంగా ఇది ఆకట్టుకుంటుంది, లీటరుకు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్‌లో పూర్తిగా నల్లటి పెయింట్ స్కీమ్ ప్రత్యేక ఆకర్షణ. లోపల, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు లభిస్తాయి. దీనిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కనెక్టివిటీ సులభంగా ఉంటుంది. లగ్జరీ అనుభూతిని ఇవ్వడానికి పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే, ప్రీమియం క్లారియన్ సౌండ్ సిస్టమ్ అందించబడ్డాయి.

డ్రైవర్, ప్రయాణికుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం, అలాగే 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ అందుబాటులో ఉంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు,EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS, హిల్ డీసెంట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2025, 11:11 [IST]
English summary
Maruti suzuki celebrates 10 years of nexa unveils grand vitara phantom blaq edition
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+