రూ.5.60 లక్షలు, 34 కి.మీల మైలేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇంత మంచి కారుకు షాకిచ్చిన కస్టమర్లు

మారుతీ సుజుకీకి (Maruti Suzuki) చెందిన ప్రసిద్ద సెలెరియో (Celerio) దేశంలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు బాగా ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్. ఇది ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మార్కెట్‌లో ఒత్తిడి ఎదుర్కొంటోంది. మారుతీ అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే సెలెరియో గతంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో స్థానం సంపాదించుకోగా ప్రస్తుతం మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాజాగా మారుతీ నుంచి వెల్లడైన సేల్స్ నివేదిక ప్రకారం, 2025 ఏప్రిల్ నెలలో సెలెరియో కేవలం 1,474 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయింది. ఇదే సమయంలో 2024లో 3,220 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది ఏకంగా 54.22 శాతం తగ్గుదలగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే అమ్మకాలు సగానికి పైగా తగ్గిపోవడం అంటే సాధారణ విషయం కాదు.

ఈ గణంకాలను చూసినట్లయితే సెలెరియో మార్కెట్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతుండటంతోపాటు, ప్రత్యర్థి బ్రాండ్లు మరింత లేటెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తున్న నేపథ్యంలో సెలెరియో గతంలో కంటే వెనుకబడినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం సేఫ్టీ ప్రమాణాలను పెంచుతూ అన్ని వేరియంట్లలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, వినియోగదారుల ఆదరణలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు.

Maruti Suzuki Celerio April 2025 Sales

మారుతీ సుజుకీ సెలెరియో ఒక సమయంలో చిన్న కార్ల విభాగంలో నమ్మకమైన కారుగా నిలిచింది. బడ్జెట్ ధర, మంచి మైలేజ్, ఆకట్టుకునే డిజైన్ వంటి అంశాల కారణంగా గతంలో ఈ హ్యాచ్‌బ్యాక్ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు వారు మరింత స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, మల్టీపర్పస్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

మార్కెట్లో ఇప్పుడు కొన్ని SUVలు, సెడాన్లు,MPVలు సెలెరియో ధరలోనే అందుబాటులో ఉండటంతో, వినియోగదారులు ఇతర కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సెలెరియో గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్, చాలా కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంది. ధర పరంగా ఇది రూ. 5.64 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

Maruti Suzuki Celerio

ఇది 1-లీటర్ 3 సిలిండర్ K-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది పెట్రోల్, CNGలలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అలాగే AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది డ్రైవింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. CNG వేరియంట్ మంచి మైలేజ్‌ను అందిస్తుంది. ఇది కిలో ఇంధనానికి 34.43 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.97 కిలోమీటర్లు ఇస్తుంది.

ఇది బైక్‌ల మైలేజీకి సాటిగా ఉండటంతోపాటు, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీ కారుగా నిలుస్తుంది. కొత్త మారుతీ సుజుకీ సెలెరియో చిన్న కారు అయినప్పటికి కూడా దీనిలో అధునాతన ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇంటీరియర్ విషయంలో, సెలెరియోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌‌ప్లే వంటి ఫీచర్స్ కూడా ఈ కారులో అందించబడ్డాయి.

Maruti Suzuki Celerio Sales

పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని వల్ల కారు తాళాలు వెతకాల్సిన అవసరం లేకుండా, కేవలం బటన్ నొక్కి కారు స్టార్ట్ అవుతుంది. సేఫ్టీ విషయానికొస్తే, సెలెరియో కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇవి ప్రయాణాన్ని కేవలం సౌకర్యవంతంగా కాకుండా, సురక్షితంగా కూడా మార్చతాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 23, 2025, 17:20 [IST]
English summary
Maruti suzuki celerio april 2025 sales 54 22 percent down details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+