రూ.5.60 లక్షలకే 34 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు.. అయినప్పటికి కస్టమర్లు రాక దోమలు కొట్టుకున్న సిబ్బంది!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన సెలెరియో (Celerio) ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందిన కారు. అందుబాటులో ధర, మైలేజ్, సింపుల్ డిజైన్ వంటి కారణాలతో మధ్యతరగతి కుటుంబాల తొలి ఎంపికగా నిలిచింది. కానీ గత కొన్ని నెలలుగా ఈ కారుకు సంబంధించి మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. 2025 మే నెలలో కేవలం 1,861 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం గమనార్హం. ఇది గత సంవత్సరం మేలో అమ్మిన 3,314 యూనిట్లతో పోల్చితే సరిగ్గా 43.84 శాతం తగ్గుదల అని చెప్పాలి. ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవడం, మార్కెట్లో ఈ కారుకు దాదాపుగా డిమాండ్ తక్కువైపోయిందనే సంకేతాలను ఇస్తోంది.

ఇక ఈ ఏడాది మొదటి నాలుగు నెలల గణాంకాలపైనా చూస్తే, అదే డ్రాపింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. జనవరిలో 1,954 యూనిట్లు, ఫిబ్రవరిలో ఒకింత పుంజుకొని 4,226 యూనిట్లు అమ్ముడుపోయింది. మార్చిలో తిరిగి తగ్గిపోయి 2,268 యూనిట్లను నమోదు చేసింది.తరువాత ఏప్రిల్‌లో మరింత తగ్గి 1,474 యూనిట్ల వరకే పరిమితం అయ్యింది. ఇప్పుడు మే నెలలో కాస్త పుంజుకుని 1,861 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

Maruti Suzuki Celerio Sales

ఈ గణాంకాలు పరిశీలిస్తే, "సెలెరియో" మళ్లీ తన పాత వైభవాన్ని తిరిగి పొందగలదా అనే అనుమానం కలుగుతుంది. మార్కెట్లో కొత్త మోడళ్ల ఎంట్రీలు, కస్టమర్లు మెచ్చిన ఫీచర్లు లేకపోవడం, డిజైన్ పరంగా ఇతర మెడళ్లు అట్రాక్ట్ చేయడం వంటివి ఒకదానికొకటి కలిసి సెలెరియోపై ప్రభావం చూపుతున్నట్లుంది. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా, వారిలో ఎక్కువమంది ఇప్పుడు కాంపాక్ట్ SUVలు లేదా బేసిక్ సెడాన్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఒకవేళ సెలెరియో ధరకు మరో రూ.1 లక్షల వరకు ఎక్కువ చెల్లిస్తే, ఇతర మోడళ్లు అత్యాధునిక ఫీచర్స్‌తో కూడుకున్నవి లభిస్తున్నాయి. ఇవి మెరుగైన బాడీ స్టైల్, మోడర్న్ డిజైన్, అధునాతన టెక్నాలజీ ఫీచర్లను అందించడమే కాకుండా, ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉండటంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సెలెరియో ధర పరంగా "వాల్యూ ఫర్ మనీ" అయినప్పటికీ కాలానికి అనుగుణంగా మరింత కొత్తగా రాకపోవడం వల్ల సేల్స్‌పై ప్రభావం పడుతోంది.

Maruti Suzuki Celerio Price

మధ్యతరగతి కుటుంబాలకోసం రూపొందించిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5.64 లక్షల నుంచి రూ.7.37 లక్షల(ఎక్స్-షోరూమ్, బెంగళూరు) మధ్య ఉంది. LXI, VXI, ZXI వంటి వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారు, కొనుగోలుదారుల విభిన్న అవసరాలను తీర్చేలా రూపొందించబడింది. వర్‌ ట్రెయిన్ విషయానికి వస్తే, సెలెరియో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఒకటి 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి CNG వేరియంట్.

ఈ ఇంజిన్లు సమర్థవంతమైన హార్స్‌పవర్, టార్క్‌ను అందిస్తాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా, సెలెరియోకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, డ్రైవింగ్ సౌలభ్యానికి 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ పరంగా సెలెరియో తన క్లాస్‌లో మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 24 kmpl, CNG వేరియంట్ అయితే 34 km/kg వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

Maruti Suzuki Celerio May Sales

ఇంటీరియర్ విషయానికి వస్తే, సెలెరియోలో 5-సీట్ల కాంఫిగరేషన్ ఉంటుంది. దీని సీటింగ్ అరంజ్‌మెంట్ ఫ్యామిలీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. 313 లీటర్ల బూట్ స్పేస్ బాగానే ఉంటుంది. దీంతో వీకెండ్ ట్రిప్స్, కిరాణాలు లేదా చిన్న ట్రావెల్ బ్యాగుల కోసం చక్కగా సరిపోతుంది. దీనికి తోడు 32 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీ ఉండటంతో, డేలీ యూజ్‌తో పాటు, ఎక్కువ దూరాలకు ప్రయాణాలకూ ఇది అనువుగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2025, 17:20 [IST]
English summary
Maruti suzuki celerio hatchback 1861 sales units recorded in may 2025
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+