బైక్ కొనడానికి బదులుగా ఈ కారు కొనచ్చు.. 35 కి.మీ మైలేజ్ కారుకు డిమాండ్ మాములుగా లేదు! షోరూమ్‌ల ముందు క్యూ!
ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ మాత్రమే. దశాబ్దాల కాలంగా పేద, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తూ పేదవారి కంపెనీగా బాగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అమ్ముడుపోతున్న టాప్ 10 కార్లలో దాదాపు సగానికి పైగా మారుతీ కార్లనే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీని బట్టి ఈ కంపెనీ మోడళ్ల పట్ల భారతీయ ప్రజలు ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తుంది. అమ్మకాల పరంగా గత నెలలో మారుతీ టాప్‌లో నిలిచింది. ఇప్పటికే పలు మోడళ్ల వారీగా సేల్స్ వివరాలు వెల్లడిస్తున్న కంపెనీ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన సెలెరియో (celerio) సేల్స్ డేటాను విడుదల చేసింది.
మారుతీ డేటా ప్రకారం, ఈ కారును ఫిబ్రవరి 2025లో 4,226 మంది కొనుగోలు చేశారు. అదే గత ఏడాది అనగా 2024 ఇదే నెలలో 3,586 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 18 శాతం వృద్ధి. మారుతీ సుజుకీ సెలెరియో నెలవారీ ప్రాతిపదికన కూడా మెరుగైన సేల్స్‌ను సాధించింది. జనవరి 2025లో ఈ కారును 1,954 కార్ల విక్రయాలు నమోదు చేయడం విశేషం.

జనవరి తర్వాత అమ్మకాలు ఏకంగా 4,226 యూనిట్లకు పెరిగాయి. నెలవారీగా ఇది 53.76 శాతం వృద్ధి. ఈ కారును జనాలు ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఇది తక్కువ ధరలో లభించడంతో పాటు దీని డిజైన్ అందరికి ప్రీమియం లుక్‌ను కలిగిస్తుంది. అలాగే ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల సేఫ్టీని రక్షించడానికి ప్రస్తుతం ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీంతో ఈ కారులో భద్రంగా ప్రయాణించవచ్చు.
బడ్జెట్ ధరలో, అదిరిపోయే ప్రీమియం లుక్, మంచి మైలేజ్ ఇచ్చే కార్లను భారతీయ ప్రజలు ఎప్పుడు ఆదరిస్తుంటారు. వారు కోరుకున్న అన్ని ఫీచర్లు కూడా సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో ఉండటంతో అందరూ కూడా దీని కోసం షోరూమ్‌ల ముందు బారులు తీరారు. ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం కూడా దీని అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం.

భారతదేశంలో కొత్తగా కారును కొనుగోలు చేయాలనే ఆలోచన చేసిన వారు మొదటగా సేఫ్టీ ప్రమాణాల గురించి తెలుసుకుని అవి అందిస్తున్న మోడల్‌ను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదు ఎక్కువ కలిగిన కార్లలో ఉండేటటువంటి ప్రీమియం ఫీచర్స్ దీనిలో ఉండటం వలన పేద, మధ్యతరగతి వారికి మొదటి ప్రాధాన్య ఎంపిక అయింది. అంత డిమాండ్ కలిగిన సెలెరియో కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇది ఎంట్రీ-లెవల్ వేరియంట్ (LXI) ధర. దీని టాప్ వేరియంట్ ZXI+ AGSకు వచ్చేసరికి ధర రూ. 7.37 లక్షలు (ఎక్స్ షోరూమ్). మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వారికి బెస్ట్ మెడల్. CNG వేరియంట్ (VXI MT) కిలో ఇంధనానికి 34.43 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.8 కి.మీల మైలేజ్‌ను ఇస్తుంది. అదే ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 25.75 కి.మీలు అందిస్తుంది. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ వంటి అధునాతన ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








