34 కి.మీల మైలేజ్, రూ.5.64 లక్షల ధర, 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇంత మంచి కారుకు కస్టమర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు
ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తాజాగా మార్చి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (Celerio) మార్చి 2025లో ఆశించిన మేరకు అమ్మకాలను సాధించలేకపోయింది. గతంలో ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది మారుతీ షోరూమ్‌ల ముందు క్యూ కట్టేవారు. కానీ కాలక్రమేణా వినియోగదారుల అభిరుచులు మారుతుండటంతో పాటు, మార్కెట్‌లో కొత్త మోడళ్ల రాక, పెరిగిన పోటీకి కారణంగా అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చిన్న బడ్జెట్‌లో స్టైలిష్ డిజైన్, మైలేజ్ పరంగా సెలెరియో కారు చాలా మంది మధ్యతరగతి భారతీయులకు ఫేవరెట్ మోడల్.
మారుతీ సుజుకీ సెలెరియో అమ్మకాలు గత నెల, అంటే మార్చి 2025లో 2,268 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇదే కాలంలో, అంటే 2024 మార్చిలో అమ్మకాలు 3,478 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 35 శాతం తగ్గుదల కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచే అమ్మకాల్లో వేగం కనిపించటం లేదు. జనవరిలో కేవలం 1,954 యూనిట్లు, ఫిబ్రవరిలో కాస్త మెరుగ్గా 4,226 యూనిట్లు అమ్ముడయ్యాయి.

గత ఏడాది అమ్మకాలను చూసినట్లయితే, 2024 డిసెంబరులో అమ్మకాలు 748 యూనిట్లుగా నమోదు కాగా, నవంబరులో 2,379, అక్టోబర్లో 3,044 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇవన్నీ కలిపి చూస్తే, సెలెరియో అమ్మకాలు ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నాయని అర్ధం అవుతుంది. భారత మార్కెట్‌లో ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో దూసుకెళ్లిన ఈ చిన్న కారు, ఇప్పుడు మాత్రం మార్కెట్ వృద్ధి చెందుతున్న SUV క్రేజ్‌ను తట్టుకోలేకపోయింది.
అమ్మకాలు తగ్గిపోవడానికి కంపెనీ అయితే స్పష్టంగా ఏ కారణాన్నీ చెప్పలేదు. అయితే అంచనాల ప్రకారం, ఈ SUV లకు పెరుగుతున్న డిమాండ్, వాటి అందుబాటు ధరలే సెలెరియో అమ్మకాల తగ్గుదలకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలు ఈ చిన్న కారును కొనుగోలు చేయడానికి బదులుగా ఇదే ధరలో మార్కెట్లోకి వస్తున్నటువంటి కొత్త వాటిని ఎంచుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కొంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలు చేయడానికి లభిస్తున్న మారుతీ సుజుకీ సెలెరియో రూ. 5.64 లక్షల నుండి రూ. 7.37 లక్షల వరకు ఉంటుంది ( ఇవి ఎక్స్-షోరూమ్ ధర). ఈ కారులో ఐదు మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా కూర్చొనే వీలుంటుంది, మలుపుల్లోనూ, ట్రాఫిక్‌లోనూ ఇది ఈజీగా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ట్రావెలింగ్ చేసే వాళ్లకు లగేజీ ఉంచడానికి 313 లీటర్ల బూట్ స్పేస్ కూడా సౌకర్యంగా ఉంది.
ఈ కారు 1-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్‌కి 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీని మైలేజ్ విషయానికి వస్తే 25.24 నుండి 34.43 కిలోమీటర్ల దూరం లీటర్‌కి వరకు ఇస్తుంది. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ AC, 6 ఎయిర్‌బ్యాగులు వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








