పేద-మధ్యతరగతి వారు ఎక్కువగా కొనే కారు ధరను భారీగా పెంచిన మారుతీ సుజుకీ.. ఇది రెండోసారి బ్యాడ్‌న్యూస్..

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారత్‌లో అతిపెద్ద వాహన సంస్థగా ఉంది. పేదలు, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో ఉండే విధంగా కార్లను విడుదల చేస్తూ పేదల కంపెనీగా పేరొందింది. అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారుతీ దేశీయంగా నెక్సా (Nexa), అరెనా (Arena) డీలర్‌షిప్‌ల ద్వారా తన వాహనాలను విక్రయిస్తుంది. అందరిని ఆకట్టుకునే విధంగా ప్రత్యేక డిజైన్లు, అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను లాంచ్ చేస్తుంది. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయాలనుకునే మొదటగా మారుతీ కార్లను ఎంచుకుంటారు. అయితే కంపెనీ ఇటీవల కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరిపై పెద్ద బాంబు వేసింది.

దీనికి ముందు 2024 డిసెంబర్‌లో కూడా కొత్త ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇవ్వగా, దీని నుంచి కోలుకునే లోపు కస్టమర్లపై కంపెనీ పిడుగు వేసింది. పేదల కంపెనీగా ప్రశంసలు అందుకుంటున్న మారుతీ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది కొత్త వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ధరలు భారం మరింత పెరగడం ఏంటని అంటున్నారు.

Maruti Suzuki Celerio

వచ్చే నెల నుంచి ఇకపై పెరిగిన ధరల ప్రకారం, డబ్బులు చెల్లించాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. మారుతీ నుంచి ప్రకటన ప్రకారం, మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. రూ.1500 నుంచి మొదలుకుని రూ.32500 వరకు పెంపుదల ఉంది. ఇంత భారీ మొత్తం పెరగడంతో కస్టమర్లను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో అత్యంత డిమాండ్ ఉండి తక్కువ ధరలో లభిస్తున్న కార్లను కొనడానికి మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

ప్రధానంగా మారుతీ సుజుకీకి చెందిన సెలెరియో (celerio) ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్. ఈ కారు ధరను కంపెనీ ఏకంగా రూ.32,500 వరకు పెంచింది. దీంతో కొత్తగా ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో కొత్త సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.04 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ధర మరింత పెరుగుతుంది.

Maruti Suzuki Celerio Hatchback Price

తాజాగా మారుతీ సుజుకీ విడుదల చేసిన 2024 డిసెంబర్ నెలవారీ నివేదికలో ఈ కారును ఏకంగా 748 మంది కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 2023 ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఈ కారును 247 మంది కొనుగోలు చేశారు. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 203 శాతం వృద్ధిని సాధించింది. సెలెరియో కారు 1-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లో పనిచేస్తుంది. తక్కువ ధరలో లభించడం కారణంగా సేల్స్ భారీగా పెరిగాయి.

మారుతీ సుజుకీ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. ఇది ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ అనే పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి లోపల అధునాతన సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి. ఇది ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

Maruti Suzuki Celerio Hatchback Details

పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు దాదాపు 25.24 కిమీల నుంచి 26.68 కి.మీల వరకు ఇస్తుంది. అదే cng వేరియంట్ కిలో ఇంధనానికి 34.43 కి.మీల వరకు ఇస్తుంది. కార ఎక్స్‌టీరియర్ మాత్రమే కాకుండా, ఇంటీరియర్ కూడా అందంగా ఉంటుంది. లోపల పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2025, 8:20 [IST]
English summary
Maruti suzuki celerio hatchback price hiked from february 1st in india
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+