ఇకపై ఈ కారులో ప్రయాణం మరింత భద్రం.. తక్కువ ధరలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారులో అదిరిపోతున్న కొత్త సేఫ్టీ ఫీచర్స్
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే వాహనాలను విడుదల చేస్తూ, దేశంలో అందరి అభినందనలు పొందుతుంది. దశాబ్దాల కాలంగా మార్కెట్లో రారాజుగా నిలుస్తూ, ఇతర తయారీ కంపెనీలకు అందనంత ఎత్తులో ఉంది. మారుతీ నుంచి విడుదలయ్యే కార్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రోడ్లపై కనిపిస్తుంటాయి. ప్రధానంగా కొన్నేళ్ల క్రితం మారుతీ నుంచి వచ్చిన ఒక మోడల్ భారతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచి ప్రస్తుతం తక్కువ సేల్స్‌ను సాధిస్తుంది. అలాంటి కారును తాజాగా మరుతీ అప్‌డేట్ చేసి మరి విడుదల చేసింది. ఆ మెడల్ పేరే 'సెలెరియో (Celerio)'. మారుతీ ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలను అందించి ఇటీవల తిరిగి కొనుగోలుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ఎక్కువగా అందించే కారును ఎంచుకుంటున్నారు.
భారతదేశంలో సగటన చనిపోయిన వారిలో రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా రక్షణ అందించే కార్లకు డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీదారులు కొత్తగా విడుదల చేస్తున్న మోడళ్లతో పాటు, ఇప్పటికే ఉన్న వాటిలో సేఫ్టీ ప్రమాణాలను అప్‌డేట్ చేసి మరి విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మారుతీ సెలెరియా అమ్మకాలను పెంచడానికి కంపెనీ గణనీయమైన భద్రతా ప్రమాణాలను అందించింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రయాణికులకు 3-పాయింట్ సీట్ బెల్టులు కూడా ప్రామాణికంగా అందించారు. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్. చిన్న కుటుంబాలకు అత్యంత అనువైన కారు. ఇప్పుడు ఈ సేఫ్టీ ప్రమాణాలు ఇవ్వడం ద్వారా కొత్తగా కారును కొనుగోలు చేసేవారు దీన్ని బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్టులతో పాటు ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన ABS,హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీటితో సెలెరియా కారు ఇప్పుడు ఇతర కార్లకు గట్టి ప్రత్యర్థిగా నిలుస్తూ, అమ్మకాలతో దూసుకుపోయే అవకాశం ఉందిని మారుతీ సుజుకీ భారీ అంచనాలు పెట్టుకుంది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సెలెరియా సేఫ్టీ పరంగా అత్యుత్తమైన మోడల్‌గా నిలవనుంది.

2025 మారుతీ సెలెరియా ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.7.37 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. కొత్త సెలెరియా నాలుగు ప్రధాన వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. LXI, VXI, ZXI, ZXI+ వేరియంట్లలో నచ్చిన దానిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఈ కారు 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.
5-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది 66 bhp పవర్, 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు CNGలో కూడా కొనుగోలుకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ వంటి అధునాతన ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.

మైలేజ్ విషయానికి వస్తే, సెలెరియో పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్ 24.8 కి.మీలు, అదే ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 25.75 కి.మీ. మైలేజ్ ఇస్తోంది. అదే CNG వేరియంట్ మాత్రం కిలో ఇంధనానికి 32.85 కి.మీ మైలేజ్ ఇస్తుందని మారుతీ పేర్కొంది. సేప్టీ పరంగా అప్‌డేట్ అయి విడుదలైన ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, టాటా టియాగోకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








