మారుతీ నుంచి షాకింగ్ అప్‌డేట్! ఇకపై ఎలాంటి భయం అవసరం లేదు.. కార్లలో ఫుల్ భద్రత!

దేశీయ అతిపెతద్ద కార్ల తయారీకంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) ఆటోమొబైల్ రంగంలో తన సేఫ్టీ ప్రమాణాలను మరింతగా బలోపేతం చేసే దిశగా మరో మైలురాయి దాటి ముందుకు సాగుతుంది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి తన బేస్ వేరియంట్ కార్లలో కూడా ఎయిర్‌బ్యాగులను అందించడానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దాని అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లు అయినటువంటి వ్యాగన్ R, ఆల్టో K10, సెలెరియో, ఈకో కార్లలో ఇప్పుడు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చబడ్డాయి. గతంలో కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టోను కూడా విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తరువాత దాని బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో నాలుగు ఇప్పుడు స్టాండర్డ్‌‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది.

ఆల్టో K10, సెలెరియో, ఈకో, వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా వంటి అన్ని కార్లు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. ఈ అప్‌డేట్‌లతో, మారుతీ వినియోగదారులకు భద్రతపై మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్ సెటప్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, బాడీకి పక్కవైపున సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే తల భాగాన్ని రక్షించే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవి ప్రమాద పరిస్థితులలో ప్రయాణికుల ప్రాణాలకు గట్టి రక్షణగా నిలిచేలా రూపొందించబడ్డాయి.

Maruti Suzuki Celerio Swift Alto K10

ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, అత్యంత అవసరమైన సేఫ్టీ సాంకేతికతలు కూడా ఈ వాహనాల్లో భాగమయ్యాయి. అందులో ముఖ్యంగా, వాహనం అదుపుతప్పే పరిస్థితుల్లో చాకచక్యంగా నడిపేందుకు సహాయపడే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఎత్తైన ప్రాంతాల్లో వెనక్కి జారకుండా నిలిపేందుకు ఉపయోగపడే హిల్ హోల్డ్ అసిస్ట్, అలాగే బ్రేకింగ్ సమయంలో సుదీర్ఘ నియంత్రణ కల్పించే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో కలసి పనిచేసే ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ భద్రతా అంశాలన్నీ కలిగిన కార్లు మారుతీ అరీనా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వెల్లడించారు. ఈ చర్య మారుతీ సుజుకీ తీసుకున్న భద్రతా ప్రాధాన్యతను స్పష్టంగా చూపుతుండటమే కాకుండా, భారతదేశపు సామాన్య వినియోగదారులకు కూడా ప్రపంచస్థాయి భద్రత అందించాలనే దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. మరింత భద్రతతో, ఇప్పుడు ప్రయాణం కేవలం గమ్యస్థానానికి చేరే మార్గం మాత్రమే కాకుండా, ఒక నమ్మకమైన అనుభవంగా మారుతోంది.

Take a Poll

ఈ వాహనాలు ఇప్పుడు అన్ని సీట్లకు మూడు పాయింట్ల సీట్‌బెల్ట్‌లు, అలాగే ప్రతి ప్రయాణికుడికి సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి జాగ్రత్త చర్యలతో మరింత నమ్మకమైన సేఫ్టీ ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్ల అంశాలు కేవలం చిన్న కార్ల వరకే పరిమితం కాకుండా, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కీ విస్తరించబడింది. మారుతీ సుజుీ తాజా అప్‌డేట్‌లో భాగంగా, గ్రాండ్ విటారా కూడా ఈ మార్పులో భాగమైంది.

2025 మోడల్ గ్రాండ్ విటారా ఇప్పుడు దాని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇది ఇప్పటికే అందుతున్న అధునాతన భద్రతా సాంకేతికతలు అయినటువంటి ESP, హిల్ హోల్డ్, EBD, ABS అంశాలతో కలిపి మరింత సేఫ్టీ కారుగా మారింది. ఇంకా, ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX యాంకర్లు వంటివి కూడా ఉన్నాయి. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడింది.

వేర్వేరు రోడ్ల పరిస్థితులకు తగినట్లుగా డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇదే సందర్భంలో, గ్రాండ్ విటారా లైనప్‌లోకి కొత్తగా ప్రవేశపెట్టిన "డెల్టా+" స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ మరొక ముఖ్యమైన అప్‌డేట్. రూ. 16.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ వెర్షన్, మారుతీ సుజుకీ హైబ్రిడ్ వాహనాల శ్రేణిని మరింత విస్తృతం చేయడంలో ఒక కీలక అడుగు అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2025, 12:55 [IST]
English summary
Maruti suzuki celerio swift alto k10 wagonr dzire and brezza now have six airbags as standard
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+