తక్కువ EMIలో మంచి కారు.. రూ.7,500తో రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ మోడల్! మీ బడ్జెట్‌కు సరిపోద్ది

మారుతి సుజుకి సెలెరియో (Maruti suzuki Celerio) భారత హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ పరిమాణం, ప్రతి రోజు ఉపయోగానికి ప్రాక్టికల్ డిజైన్, రాజీ పడని నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి సెలెరియోను కుటుంబాలు, కొత్త డ్రైవర్స్, బడ్జెట్‌లో మంచి కారును కోరుకునే వారికి ఒక నమ్మదగిన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, మారుతి సుజుకి బ్రాండ్‌ మీద ఉన్న విశ్వసనీయత కూడా సెలెరియోను మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం ఈ కారు బేస్ మోడల్ ధర రూ.4.70 లక్షలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర రూ.6.73 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం

మొదటగా, LXI (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.5.69 లక్షలు. ఇందులో రూ.2 లక్షల డౌన్‌పేమెంట్ ఇవ్వడంతో మిగిలిన రూ.3.68 లక్షలకు రుణం తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు సాధారణంగా ఇవ్వే 9% వడ్డీ రేటు ఆధారంగా 5 సంవత్సరాల రుణం తీసుకున్నట్లయితే, నెలవారీ EMI సుమారు రూ. 7,500 వరకు ఉంటుంది. ఈ వేరియంట్ సింపుల్, అఫోర్డబుల్ ప్యాకేజ్. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి బెస్ట్.

Maruti suzuki Celerio Variant Wise Onroad Price And Monthly Emi Details

తదుపరి, ఎక్కువ మంది కొనుగోలు చేసే VXI (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.6.27 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.4.27 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.8,800 వరకు వస్తుంది. ఈ వేరియంట్‌లో ఫీచర్లు LXI మోడల్‌తో పోలిస్తే మరింతగా లభిస్తాయి.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కోరుకునే డ్రైవర్లకు VXI AMT వేరియంట్ ప్రాచుర్యం పొందిన ఆప్షన్. దీని ఆన్‌రోడ్ ధర రూ.6.80 లక్షలు ఉండగా, రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత మిగిలిన రూ.4.80 లక్షలకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకున్నట్లయితే, నెలవారీ EMI సుమారు రూ.9,500 వరకు వస్తుంది. రోజూ ఆఫీస్ ట్రావెల్ చేసే వారికి, ఎక్కువసేపు డ్రైవ్ చేసే వారికి బెస్ట్.

Maruti suzuki Celerio Variant Wise Onroad Price And Monthly Emi Details

మరింత ఫీచర్లు కోరుకునే కస్టమర్ల కోసం ZXI(పెట్రోల్) వేరియంట్ సెలెరియోలో బెస్ట్-విల్యూ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. దీని ఆన్‌రోడ్ ధర రూ.6.90 లక్షలు. ఇదే విధంగా కొనుగోలు సమయంలో రూ.2 లక్షల అడ్వాన్స్‌ చెల్లిస్తే, మిగిలిన రూ.4.90 లక్షలకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల టెన్‌రుతో చూడగా, నెలవారీ EMI సుమారు రూ.10,000 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో లభించే ఫీచర్లు కారును మరింత ప్రీమియంగా అనిపించేట్టు చేస్తాయి.

CNG కోరుకునే కస్టమర్లలో హాట్‌ ఫేవరెట్‌గా నిలిచింది VXI CNG వేరియంట్. దీని ఆన్‌రోడ్ ధర రూ.7.24 లక్షలు. కొనుగోలులో రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ.5.24 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి చూస్తే, నెలవారీ EMI సుమారు రూ.10,500 వరకు ఉంటుంది. ఈ వేరియంట్‌ను ఎక్కువ మంది ఎందుకు ఎంచుకుంటారంటే, ఇందులో లభించే అద్భుతమైన మైలేజ్ ప్రధాన కారణం.

Maruti suzuki Celerio Variant Wise Onroad Price And Monthly Emi Details

More from DriveSpark

Article Published On: Monday, November 24, 2025, 12:56 [IST]
English summary
Maruti suzuki celerio variant wise onroad price and monthly emi details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+