సేఫ్టీకి శఠగోపం..డబ్బా కారు అంటే ఇదే..క్రాష్ టెస్టులో కంపెనీ పరువు పోయే!..

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz) క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు లగ్జరీ సెడాన్ విభాగంలో రారాజుగా వెలిగిన ఈ కారు, సేఫ్టీ విషయంలో ఎంత వెనుకబడి ఉందో గ్లోబల్ NCAP నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కారు క్రాష్ టెస్ట్ విశ్లేషణ, భవిష్యత్తుపై లోతైన వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి సంస్థ తన సియాజ్ మోడల్‌ను తాజాగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌కు పంపింది. అయితే అందరూ ఊహించిన దానికి భిన్నంగా, ఈ కారు పెద్దల సేఫ్టీ విషయంలో కేవలం 1-స్టార్ రేటింగ్ మాత్రమే సాధించి షాక్ ఇచ్చింది. సాధారణంగా మారుతి కార్లు సేఫ్టీలో వెనుకబడి ఉంటాయనే విమర్శ ఉన్నప్పటికీ, సియాజ్ వంటి ప్రీమియం సెడాన్ ఇంత తక్కువ స్కోర్ చేయడం గమనార్హం.

Maruti Suzuki Ciaz Crash Test 1-Star Safety Rating Sparks Controversy

పిల్లల సేఫ్టీ విభాగంలో మాత్రం కొంత మెరుగ్గా 3-స్టార్ రేటింగ్ లభించింది. అసలు మార్కెట్లో క్రమంగా జోరు తగ్గుతున్న ఈ కారును ఇప్పుడు టెస్టింగ్‌కు పంపడం వెనుక.. లోపాలను సరిదిద్ది మళ్ళీ కొత్త రూపంలో లాంచ్ చేసే ఉద్దేశం మారుతికి ఏమైనా ఉందా? అనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో మొదలైంది.

గ్లోబల్ NCAP నివేదిక ప్రకారం, సియాజ్ కారు బాడీ షెల్(కారు పైకప్పు, ఫ్రేమ్) అస్థిరంగా ఉందని తేలింది. ప్రమాదం జరిగినప్పుడు భారీ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఈ ఫ్రేమ్‌కు లేదని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా డ్రైవర్ తలకు రక్షణ బాగున్నప్పటికీ, ఛాతీ, కాళ్ల భాగాలకు రక్షణ చాలా బలహీనంగా ఉంది.

Maruti Suzuki Ciaz Crash Test 1-Star Safety Rating Sparks Controversy

క్రాష్ టెస్టులో 34 పాయింట్లకు గాను 20.86 పాయింట్లు మాత్రమే రావడం దీని పేలవమైన పనితీరుకు నిదర్శనం. సైడ్ ఇంపాక్ట్ టెస్టులో కూడా డ్రైవర్ ఛాతీకి తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

సియాజ్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, కారు బేసిక్ స్ట్రక్ఛర్ బలంగా లేకపోవడమే ఈ వైఫల్యానికి కారణం. కారులో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోవడం వల్ల దీనిని సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‎కు అనుమతించలేదు.

Maruti Suzuki Ciaz Crash Test 1-Star Safety Rating Sparks Controversy

అంతేకాకుండా, వెనుక సీట్లలో ప్రయాణించే అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్టులు లేవు. పిల్లల సేఫ్టీకి సంబంధించి 49 పాయింట్లకు 28.57 పాయింట్లు లభించినప్పటికీ, ఎయిర్‌బ్యాగ్‌లను డిసేబుల్ చేసే స్విచ్ లేకపోవడం వంటి చిన్న లోపాలు కూడా స్కోరును ప్రభావితం చేశాయి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సేఫ్టీకి భారీ డిమాండ్ ఉంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి కార్లు 5-స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. వాటితో పోలిస్తే సియాజ్ సుమారు 4-5 ఏళ్లు పాతబడిన టెక్నాలజీతో ఉంది. కేవలం స్పేస్, మైలేజీ, తక్కువ ధరకు లభిస్తుందనే కారణంతోనే ఇప్పటికీ కొందరు దీనిని కొనుగోలు చేస్తున్నారు.

కానీ ఈ 1-స్టార్ రేటింగ్ చూసిన తర్వాత వినియోగదారులు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఈ సెగ్మెంట్‌లో నిలదొక్కుకోవాలంటే సియాజ్ లోపాలను పూర్తిగా సరిదిద్ది కొత్త వెర్షన్‌ను తీసుకురావడమో లేదా కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టడమో చేయక తప్పదు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 23, 2025, 10:10 [IST]
English summary
Maruti suzuki ciaz crash test 1 star safety rating sparks controversy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+