ఈ మారుతీ కారుకు జై కొట్టిన జనాలు.. 21 కి.మీ మైలేజ్, రూ.9 లక్షల ధర.. 5 మంది హాయిగా వెళ్లొచ్చు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన ప్రసద్ధ కార్లలో సియాజ్ (ciaz) మోడల్ కూడా ఒకటి. ఇది ఒక ప్రీమియం సెడాన్. మార్చి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న కంపెనీ తాజాగా ఈ సెడాన్‌ సేల్స్ డేటాను తాజాగా వెల్లడింంచింది. నివేదిక ప్రకారం, చూసినట్లయితే ఈ కారును మార్చి 2025లో 676 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది అంటే, 2024 మార్చి నెలలో 590 యూనిట్లను విక్రయించింది. మొత్తంగా విక్రయాల వృద్ధి 14.58 శాతంగా నమోదైంది. సియాజ్ కారు కేవలం లుక్ కోసం మాత్రమే కాదు, దాని అధునాతన ఫీచర్స్‌తో అందిరిని కట్టిపడేస్తుంది.

అయితే ఇటీవల కాలంలో పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో ఈ కారు అమ్మకాలు ఒక నెల మంచి గరిష్ఠానికి చేరుకుంటే, తరువాత నెల కొంచెం మందగిస్తుంది. అయినప్పటికీ, మార్చి నెలలో సియాజ్ మరోసారి తన సత్తా చాటింది. పోటీ గట్టిగా ఉన్నా కూడా, ఈ కారుకు మంచి స్పందన లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో సియాజ్ అమ్మకాల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. జనవరిలో 768 యూనిట్లు అమ్ముడు పోయాయి.

Maruti Suzuki Ciaz Sedan 676 Sales Units Recorded In March 2025

అలాగే, ఫిబ్రవరిలో మాత్రం స్వల్పంగా పెరిగి 1,097 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే తరహాలో, గత సంవత్సరం చివరి నెలల్లో కూడా అమ్మకాల్లో అదే తరహా ఊగిసలాట కనిపించింది. అక్టోబరులో 659 యూనిట్లు అమ్ముడు పోయినప్పటికి, నవంబరులో ఆ సంఖ్య 597కు తగ్గింది. డిసెంబర్‌లో అయితే మరింత తగ్గి కేవలం 464 యూనిట్లే అమ్ముడయ్యాయి. సేల్స్‌లో ఈ తరహా హెచ్చుతగ్గులు రావడానికి మారుతీ నుంచి ఎలాంటి కారణాలు వెలువడలేదు.

అయితే మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్న అభిప్రాయం ప్రకారం, SUV వాహనాలపై పెరుగుతున్న ఇష్టం కారణంగా సెడాన్ కార్ల డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. ఈ ట్రెండ్‌కు సియాజ్ కూడా మినహాయింపు కాదు. అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక అవసరాలు, సెడాన్ వాహనాలపై ఇష్టం ఉన్న వినియోగదారులు సియాజ్‌ను ఎంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సియాజ్ పరిమిత స్థాయిలో అయినా తన మార్కెట్‌ను కొనసాగిస్తోంది. రాబోయే రోజులలో సియాజ్ అమ్మకాలు మళ్లీ ఊపందుకునే అవకాశముంది.

Maruti Suzuki Ciaz Sedan 676 Sales Report

మారుతీ సుజుకీ సియాజ్ సెడాన్ పూర్తి వివరాల్లోకి వెళితే, ఇండియాలో నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతున్నఈ మోడల్ . ప్రారంభ ధర రూ. 9.41 లక్షల నుంచి, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 12.31 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ కారులో ప్రయాణ చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఐదుగురు ప్రయాణికలు కూడా దీనిలో ఈజీగా ప్రయాణించవచ్చు.

ఈ కారు శక్తివంతమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 105 PS పవర్, 138 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సెడాన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా కలిగి ఉంటుంది. మైలేజ్ పరంగా కస్టమర్లు సంతృప్తి చెందుతారు. ఎందుకంటే ఇది దాదాపు లీటర్ పెట్రోల్‌తో 20.04 నుండి 20.65 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

Maruti Suzuki Ciaz Sedan

సియాజ్ సెడాన్‌లో ప్రయాణికులను ఆకట్టుకునే డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, వాతావరణ పరిస్థితుల కంటే ముందుగానే స్పందించే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం, కీలెస్ ఎంట్రీ , డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki ciaz sedan 676 sales units recorded in march 2025 details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+