ఈ కారు ఇక చరిత్రగా మిగిలిపోతుందా? మారుతీ సుజుకీకి గట్టి షాక్.. ఏప్రిల్ అమ్మకాలు చూసి నమ్మలేరు!

దేశీయ అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు అయినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki) ఏప్రిల్ నెలలో తాను సాధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. ఇటీవల తాజాగా మోడళ్ల వారీగా ఒక్కో కారుకు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీ తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి సియాజ్ కారు వివరాలను తెలియజేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ నెలకొంది. ఇలాంటి పరిస్ధితులలో సెడాన్ విభాగానికి గట్టి పోటీ ఎదురవుతుంది. అందుకే ఏప్రిల్ 2025లో కేవలం 321 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇది గత ఏడాది అంటే ఏప్రిల్ 2024లో 867 యూనిట్లుగా నమోదైంది. సియాజ్ విక్రయాలు గత నెలతో పోల్చినప్పుడు గణనీయంగా తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అదే సమయంలో మార్చి 2025లో ఈ మోడల్‌ 676 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య కేవలం 321కి పరిమితమైంది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే 355 కార్లు తక్కువగా విక్రయమయ్యాయి. ఇది సాధారణంగా మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు గానీ, ఈ తగ్గుదలకు ప్రత్యేకమైన కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక ప్రధాన కారణం, SUV వాహనాల పట్ల ప్రజల మక్కువ పెరగడమే.

Maruti Suzuki Ciaz

భారతీయ మార్కెట్లో SUV మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. వెసులుబాటు, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, బలమైన రూపకల్పన వంటి లక్షణాలు SUVల పట్ల వినియోగదారుల ఆకర్షణను పెంచుతున్నాయి. మరో కారణం, మారుతీ సుజుకీ సియాజ్ సెడాన్ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొనడంలో విఫలమవుతుండటమే. హోండా సిటీ, హ్యూండాయ్ వెర్నా, స్కోడా స్లావియా లాంటి ప్రత్యర్థి కార్లు మార్కెట్లో ఈ కారుకు పోటీగా నిలుస్తున్నాయి.

పోటీ కార్లు మార్కెట్లో మెరుగైన ఫీచర్లు, లేటెస్ట్ డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో సియాజ్ తన స్థానాన్ని నిలుపుకోవడంలో వెనుకబడుతోంది. ఈ రెండు అంశాల కలయిక వల్ల, మారుతీ సుజుకీ సియాజ్ అమ్మకాల్లో నెలలవారీగా తగ్గుదల కొనసాగుతోంది. బ్రాండ్‌కు ఉన్న నమ్మకంతో కొంతమంది కొనుగోలుదారులు ఇంకా ఆసక్తి చూపుతున్నప్పటికీ, తాజా పోటీ పరిస్థితుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే సియాజ్‌మరింత కొత్తగా రావాలి.

Ciaz Sedan April 2025 Sales Recorded 321 Units

సాధారణంగా మారుతీ సుజుకీ అనే బ్రాండ్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో నమ్మకానికి మారుపేరు. సాధారణంగా, ఈ కంపెనీకి చెందిన చాలా మోడళ్ల అమ్మకాలు ప్రతి నెలా ఐదు అంకెల గణాంకాలను అలవోకగా తాకుతూ ఉంటాయి. అయితే, అదే ఇదే కంపెనీకి చెందిన సియాజ్ మోడల్ మాత్రం ఈ ట్రెండ్‌కు మినహాయింపుగా నిలుస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రజల్లో ఆదరణ తగ్గిపొతూ, క్రమంగా తక్కువ అమ్మకాలను నమోదు చేస్తుంది.

ఈ తగ్గుదల అనేది కేవలం ఒక్క నెల లేదా ఒక్క సంవత్సరం పరిధిలో మాత్రమే కాదు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, 2024-25లో సియాజ్ అమ్మకాల్లో ఏకంగా 34 శాతం తక్కువగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది స్పష్టంగా సెడాన్ విభాగంలో ఈ మోడల్ తక్కువ ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నదనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ సియాజ్ ఉత్పత్తిని ఆపివేశారని, లేదా తాత్కాలికంగా నిలిపివేశారని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి.

Maruti Suzuki Ciaz Sedan April 2025 Sales

అయినప్పటికీ, ఈ మోడల్ ఇప్పటికీ మారుతీ సుజుకీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటలో ఉండటం ఆసక్తికరమైన విషయమే. అంటే కంపెనీ ఇప్పటికీ ఈ మోడల్‌ను పూర్తిగా విరమించలేదన్న అభిప్రాయం స్పష్టంగా ఏర్పడుతుంది. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, మారుతీ సుజుకీ సియాజ్ భారత మార్కెట్లో ప్రస్తుతం స్టాక్ ఉన్నంతవరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 12:50 [IST]
English summary
Maruti suzuki ciaz sedan april 2025 sales recorded 321 units more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+