35కి.మీ మైలేజీ ఇస్తుంది కాబట్టే.. పేద-మధ్య తరగతికి చెందిన ముగ్గురిలో ఒకరు ఈ కారును కొనేస్తున్నారు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలో సీఎన్జీ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం 17 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో డజనుకు పైగా కార్లు సీఎన్జీ ఎడిషన్లలో అందుబాటులో ఉన్నాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో మారుతి తన సీఎన్జీ కార్లను అధిక మైలేజీనిచ్చే విధంగా రూపొందించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో మారుతి దేశీయంగా 17,95,259 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా.. వాటిలో సుమారు 6,20,000 సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి. అంటే, విక్రయించిన ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్జీ కారే అని అర్థం చేసుకోవచ్చు.

Maruti Suzuki Commands

సీఎన్జీ వాహనాల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ 2024 చివరి నాటికి మారుతి సుజుకి 71.60శాతం మార్కెట్ వాటాతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టాటా మోటార్స్ 16.13శాతం వాటాతో రెండవ స్థానంలో ఉండగా, హ్యుందాయ్ 10.04శాతం మార్కెట్‌ను కలిగి ఉంది. మారుతితో కలిసి తన 2.21శాతం వాటాను పొందుతున్న టయోటా కూడా ఈ విభాగంలో తన ఉనికిని చాటుతోంది.

మారుతి సుజుకి జిమ్నీ, ఇగ్నిస్, ఇన్విక్టో అనే మూడు మోడల్స్ మినహాయిస్తే మిగిలిన అన్ని వాహనాలు సీఎన్జీ వెర్షన్‌లో అమ్ముడవుతున్నాయి. ఈ కార్లన్నీ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌లతో వస్తున్నాయి. ఎక్కువ ఆఫ్షన్లు, అధిక డిమాండ్ సీఎన్జీ మార్కెట్‌లో మారుతి స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.

Maruti Suzuki Alto

మారుతి సీఎన్జీ కార్లు అద్భుతమైన మైలేజీని అందిస్తున్నాయి. ఉదాహరణకు, సెలెరియో సీఎన్జీ ఎడిషన్ ఒక కిలోగ్రాముకు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఈ సామర్థ్యం తక్కువ ధర కలిగిన కార్లను కోరుకునే కస్టమర్లలో వాటి ప్రజాదరణకు గణనీయంగా దోహదం చేస్తుంది.

టాటా మోటార్స్ తన సీఎన్జీ విక్రయాలకు సంబంధించిన నిర్దిష్ట గణాంకాలను విడుదల చేయనప్పటికీ.. ఈ విభాగంలో సంవత్సరానికి 35శాతం వృద్ధిని నమోదు చేసింది. సీఎన్జీ విక్రయాల మొత్తం పరిమాణంలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. సీఎన్జీ వాహనాల్లో బూట్ స్పేస్ సమస్యను పరిష్కరించడానికి ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

Maruti Suzuki Ertiga

ఈ ఆవిష్కరణను ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా స్వీకరించాయి. టాటా తన టియాగో, టిగోర్ మోడళ్లకు సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌లతో పాటు ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌లను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. చాలా మంది ఆటోమేటిక్ గేర్, అధిక మైలేజీనిచ్చే సీఎన్జీ కోసం ఈ రకం కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

సీఎన్జీ కార్లలో తన విజయంతో పాటు, మారుతి సుజుకి 2025 ఆర్థిక సంవత్సరంలో 20,672 స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలను కూడా విక్రయించింది. ఇది ఆ సంవత్సరం మొత్తం విక్రయాలలో 2.4శాతం, 2024 ఆర్థిక సంవత్సరం గణాంకాల నుండి 27శాతం విక్రయాల పెరుగుదలను సూచిస్తుంది.

Maruti Suzuki Dzire

గ్రాండ్ విటా, ఇన్విక్టో మోడళ్లు 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉండడం వలన హైబ్రిడ్ వాహనాల విక్రయాలలో ఈ వృద్ధికి దోహదం చేశాయి. మొత్తంమీద, భారతీయ మోటార్ వాహన మార్కెట్‌లో మారుతి సుజుకి ఆధిపత్యం సీఎన్జీ, హైబ్రిడ్ విభాగాలలో దాని విస్తృత శ్రేణి, వినూత్నమైన ఆవిష్కరణల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 3, 2025, 17:25 [IST]
English summary
Maruti suzuki commands over 70 share of indias cng vehicle market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+