ఈ కారు 500 కి.మీల రేంజ్‌తో పాటు సేఫ్టీని కూడా అందిస్తుంది! వైరల్‌గా మారిన క్రాష్ టెస్ట్ ఫోటోలు
మారుతీ సుజుకీ(Maruti Suzuki) దేశంలో పేద-మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తూ, ప్రసిద్ధ తయారీదారుగా ఉంది. పెట్రోల్, డీజిల్, CNG వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు దూసుకుపోతున్నప్పటి మారుతీ మాత్రం అందరి కంటే వెనుక స్థానంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈవీ విభాగంపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇ-విటారా(-e-vitara) అనే ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. దీన్ని ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVతో మారుతీ ఈవీ సెగ్మెంట్‌లో సైతం తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. ఈ కారు కోసం మారుతీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇ-విటారాను మార్చిలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రమాణాలను అందించారు. తాజాగా దీన్ని క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో లోపల కూర్చన్న ప్రయాణికులను ఏ విధంగా రక్షిణ కల్పిస్తుందో తెలుసుకోవడానికి దీనిని నిర్వహించారు. మారుతీ తన కస్టమర్లకు మరింత భద్రత అందించడంపై కీలకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ క్రాష్ టెస్ట్ చేశారు.

ఇక్కడ కీలక విషయం ఏమిటంటే, ఇది అధికారిక నిర్వహించిన BNCAP లేదా GNCAP క్రాష్ టెస్ట్ కాదు. మారుతీ సుజుకీ కంపెనీ స్థాయిలో అంతర్గతంగా నిర్వహించిన టెస్ట్ అని సమాచారం. ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలను చూసినట్లయితే సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధిక భద్రతను అందించే విధంగా ఉంది. BNCAP లేదా GNCAP క్రాష్ టెస్ట్‌లో ఇది మెరుగైన రేటింగ్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది.
మారుతీ ఇ విటారాలో సేఫ్ఠీ పరంగా 7 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఇది లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)ను కూడా కలిగి ఉంది. అలాగే, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), పార్కింగ్ సెన్సార్లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు వంటి మొదలగునవి ఈ కారులో ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVని ఇండియాలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మారుతీ సుజుకీ విక్రయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అందరిని ఆకట్టుకోవడానికి అధిక సేఫ్టీ రేటింగ్ ప్రమాణాలతో వచ్చింది. ఇక కారు ఇతర వివరాల్లోకి వెళితే, ఇది 49 కిలోవాట్ (kWh), 61 కిలోవాట్ (kWh) కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 500 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉంటాయి. 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి పలు ఇతర ఆప్షన్స్ మారుతీ ఇ విటారాలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








